You Are Here: Home » ఇతర » ప్రేమైక జీవులు

ప్రేమైక జీవులు


01-dogbehavior-600జంతువుల పెంపకం మనకి పౌరాణిక యుగంనుంచీ వస్తున్న అలవాటే. మనషూలతో మమేకమై, మనుషూల మనసుని అర్ధం చేసుకుంటూ అవసరాన్ని తీర్చి… ఆనందాన్నీ పంచడంలో జంతువులు, పక్షులు ఎంతో తోడ్పడుతున్నారుు. అరుుతే మానవుడు మేధస్సు పెరిగిన నాటినుండీ ఏ జంతువుల్ని ఏఏ అవసరాలకోసం వినియోగించుకోవాలో ఆయా జంతువుల్ని మచ్చిక చేసుకుంటూ, వినియోగించుకుంటూ వాటి పట్ల ప్రేమానురాగాల్ని కూడా పెంచుకుంటూ చివరికి వాటిని కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావిస్తున్నాడు. గుర్రాలు, గాడిదలు వంటివి రవాణాకి, ఆవులు, గేదెలు, గొర్రెలు, ఎడ్లు వంటివి వ్యాపారానికీ, వ్యవసాయానికీ వినియోగించుకుంటుండగా, ఇక కుక్కలు రక్షణకీ, కుందేళ్ళు, జింకలు, రామచిలుకలు, మైనా, గోరింక వంటి పక్షిజాతుల్ని ఆనందానికి, వినోదానికీ పెంచుకుంటూ ఉంటారు.

3ఇక ఈకాలానికి వస్తే, ఇళ్లలో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం ఎక్కువగా చూస్తుంటాం. వాటిని తమలో ఒక వ్యక్తి భావించడం. తమతోపాటే ఆహారం, నిద్ర ఏర్పాటు చేయడం చేస్తారు. కొందరు పిల్లలు లేని వారైతే జంతువులనే పిల్లలుగా భావించి అపురూపంగా సాకుతారు. వాటిని గదిలో బెడ్‌పైనే పడుకోబెట్టుకుంటారు. కొందరైతే కుక్కను కక్క అన్నా కోపడతారు. దాని పేరు పప్పి అనో టామీ అనో చెప్పి అలా పిలువమంటారు. మరికొందరు ఆదివారం తమకు మాంసం తేవడంతో పాటు దాని వాటాకి ఇష్టమైన పదార్ధాలు తీసుకొచ్చి మరీ ఇస్తారు. చనిపోతే పారేయకుండా భూమిలో పూడ్చిపెడతారు. అంత్యక్రియలు కూడా నిర్వహించిన సందర్భాలున్నాయి. పిల్లలు ఏడవడం, బెంగతో భోజనం చేయకుండా అదే బాధతో ఉండడం చాలా చోట్ల జరిగే సంఘటనలే. ఇలా కుక్కే కాకుండా పిల్లిని కూడా పెంచేవారు ఎక్కువ. అంతేగాక కుందేలు, పక్షులు, గొర్రె, మేక, కోడి, గేదె, ఆవు, ఎడ్లను పెంచినా, కుక్కలకీ, పిల్లులకీ ఒక ప్రత్యేక స్థానం ఉందని మాత్రం చెప్పవచ్చు. సాధు జంతువుల దినోత్సవం సందర్భంగా పలు వివరాలు…

17Colపురాణకాలంలో ఋష్యాశ్రమాల్లో ఎక్కువగా జింకలు, రామచిలుకలు, పాలిచ్చే గోవులు పెంచిన కథనాలు అన్ని గ్రంధాల్లోను మనకి కనిపిస్తూనే ఉంటాయి. సీతాదేవి బంగారు జింకని పెంచాలని కుతూహల పడటం వెనుక అంతరార్ధం ఇదే. అలాగే చారిత్రక కాలంలో ఎంతో ప్రేమగా పెంచుకునే పావురాల్ని సందేశాలు పంపడానికి, సమాచార సేకరణకి, భట్వాడాగా ఉపయోగించారన్న విషయం మనందరికీ తెలిసినదే. శ్రీరామ భక్తుడైన రామదాసు చిలుకని పెంచినట్టు చరిత్ర చెపుతుంది. ఇలా అనేక రూపాల్లో జంతువుల్ని పెంచుకోవడం అనాదిగా పరిపాటే. అయితే ఇలా పెంచుకునే జంతువులు కూడా కేవలం సాధుజంతులే కావటం వల్ల వాటిలో మనసెరిగి వర్తించే గుణం కూడా అధికంగా ఉంటుందన్నది వాస్తవం.

450941మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. భూమిపై ఉన్న జీవుల్లో విశ్వాసానికి ప్రతీక. రక్షణపరంగా ఉండేందుకు కుక్కలను ఎక్కువగా పెంచుతారు. మన దేశంలో 14,000 సంవత్సరం క్రితమే వీటిని పెంచడం ప్రారంభించారు. జంతువులను వేటాడటానికి, పశువులు, ఇళ్ల కాపలాకు ఇది మంచి రక్షణగా ఉండేది. ముఖ్యంగా గొర్రెల కాపరులు తోడేళ్ల బారీ నుంచి రక్షించుకోవడానికి వీటిని ఉపయోగించుకునేవారు. మన దేశంలో కుక్కను కాలభైరవుడిగా పూజిస్తారు. ప్రస్తుతం పోలీసులు సైతం నేరుస్తులను పట్టుకోవడానికి కుక్కలనే వినియోస్తున్నారు. డాల్మిషన్‌, డాబర్‌మెన్‌, చువావా, బుల్‌డాగ్‌, గోలెడెన్‌ రిట్రీవర్‌, పిట్‌బుల్‌ పెంపుడు కుక్కల్లో పలు జాతులు. అయితే అన్ని రకాల కుక్కల్నీ ఒకే తీరుగా పెంచడం మాత్రం వీలు కుదరదు. కొన్నిటికి ప్రత్యేక పోషణ చాలా అవసరం. కొన్ని జాతుల కుక్కల్లో సింగిల్‌ మాస్టర్‌ డాగ్స్‌ ఉంటాయి. అవి కేవలం ఒక్క యజమాని మాటే తప్ప ఇక ఆ ఇంట్లో ఎవరి మాటా వినవు. అటువంటివాటిని ఒక పద్ధతిలో చాలా జాగ్రత్తగా పెంచుతూ పర్యవేక్షించుకుంటూ ఉండాలి. కానీ ఇవి పెరుగుతున్న ఇంటివారి కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యవు. కొన ఊపిరి వరకూ యజమానిని రక్షించడం కోసం వెనుకడుగు వేయవు.

పిల్లి నడకలు…
18_6_origకన్ను పొడుకున్నా కానరాని చీకటిలో సైతం చూడగల జంతువు పిల్లి. దీన్ని పులికి గురువుగా చెప్పుకుంటాం. సుమారు 9,500 సంవత్సరాల క్రితం పిల్లి పెంపుడు జంతువుగా మారింది. ఇంట్లో ఎలుకలను చంపడం కోసం వినియోగించడం పరిపాటి. పెంపుడు జంతువుల్లో కుక్కల తరువాత పిల్లులదే పైచేయి.

జాగ్రత్తలు…
2రోజూ పరిశుభ్రమైన నీటితో స్నానం చేయించాయి.
నీటిలో డెటాయిల్‌ లాంటి క్రిమిసంహరణిలను కలిపితే బాగుంటుంది.
జంతువులకు కేటాయించిన స్థలాన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
ఆయా రకాల జంతువులను బట్టి వాటికి వేయించాల్సిన టీకాలను విధిగా ఇప్పించాలి.
అవి ఆహారం తినడానికి ఉపయోగించిన పాత్రలను వేరుగా ఉంచాలి.
తినగా మిగిలిన పదార్థాలను కూడా ఇంటికి దూరంగా పారవేయాలి.
వాటికి వ్యాధి వచ్చినట్లు తెలిస్తే తగ్గే వరకు దూరంగా ఉండడమే మేలు.
ఇంటికి దూరంగా నిర్ణీత సమయానికి మలమూత్రవిసర్జన చేసేలా అలవాటు చేయాలి.
గోళ్లను కత్తిరించడం.. ఉంచితే అందులో దుమ్ముదూళి లేకుండా చూసుకోవాలి.
చిన్నారులను నాకడంలాంటి చేస్తే వెంటనే శుభ్రపరచాలి.
గీరినా, కరిచినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వ్యాధులు…
4రేబిస్‌.. ఇది కుక్కల నుంచి వస్తుంది. రేబిస్‌ ఉన్న కుక్క కరిస్తే వైరస్‌ ద్వారా మనిషి, ఇతర జంతువులకు కూడా చేరుతుంది. అమీబియాసిస్‌, టాక్సో ప్లాస్మోసిస్‌, బాలెంటి డియోసిస్‌ లాంటి వ్యాధులు కూడా జంతువుల లాలాజలం నుంచి మనుషులకు సోకుతుంది.బాస్టోమైకోసిస్‌, రింగ్‌వార్మ్‌, కాండిడి యాసిస్‌ వంటి వ్యాధులు ఫంగస్‌ ద్వారా వ్యాపిస్తాయి. ఇవి సోకిన జంతువులకు సన్నితంగా మెలిగిన వారికి కూడా పై వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

1సుమారుగా 15000 సంత్సరాల క్రితమే మానవుడు జంతువులను మచ్చిక చేసుకోవడం ఆరంభించాడు. అవసరాలకు అనుగుణంగా వాటని పెంచేవాడు. అలా మనిషి మచ్చిక చేసుకున్న జంతువుల్లో మొదటిది కుక్క. మనిషికి, కుక్కతో ఉన్న అనుబంధం ఈనాటి కాదని ఈజిప్టులో బయటపడిన అవశేషాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలో అతి ఎక్కువ మంది కుక్కను పెంపుడు జంతువుగా సాకడం గమనార్హం. వేట, రక్షణ వీటి ప్రధాన బాధ్యత. ఇప్పటికి నేరస్తులను పట్టించాలంటే డాగ్‌ స్కాడ్‌ రావాల్సిందే. వాసన చూసి పట్టుకోవడంలో దానికదే సాటి. కుక్క తరువాత స్థానం పిల్లిది. ఎలుకలను చంపడానికి ఎక్కువగా సాదుకునేవారు. బావిలో నీటిని శుభ్రపరచడానికి తాబేలు ఇలా జంతువులను వివిధ అవసరాలకు ఉపయోగించుకునేవారు. కుక్కలు, పిల్లులు, గున్యా పందులు, పలు రకాల ఎలుకలు, పక్షులు, కప్పలు, తాబేలు, కుందేలు, పాములు ఇలాంటి వాటిని ఆయా ప్రాంతాల్లో సరదాగా పెంచుతుంటారు. మన దేశంలో మాత్రం కుక్కలు, పిల్లుల పెంపకం ఎక్కువ. పదేళ్లుగా పక్షులను పెంచే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గొర్రెలు, మేకలు, కోళ్లు పెంచుతున్నా వాటిని ఎక్కువగా ఆహారానికి మాత్రమే వినియోగిస్తాము. పాల కోసం గేదెలను, వ్యవసాయం కోసం ఎడ్లను సర్వసాధారణం..

ఆనందానికి పందిళ్ళు కుందేళ్ళు…
Rabbitకుందేళ్లు బ్రూక్లిన్‌ కళ ప్రాజెక్టు ప్రకారం సంతోషంగా మసిలే పెంపుడు జంతువు. కుందేళ్ల చక్కగా మచ్చిక చేసుకోవచ్చు. మన దేశంలో తక్కువగా కానీ కొన్ని దేశాల్లో కుక్క, పిల్లితో పాటే కుందేళ్లు కూడా ప్రధాన పెంపుడు జంతువు కావడం గమనార్హం. అడవుల్లో తిరుగాడే కుందేళ్లను కూడా సాధు జంతువులుగా మార్చుకోవచ్చు. ఇది శాఖాహారం మాత్రమే తింటుంది. కుక్క, పిల్లి అప్పుడప్పుడు ఇబ్బందిపెట్టినా కుందేలుతో ఎలాంటి కష్టం ఉండదు. కరవడం, గీరడం లాంటి నష్టాలూ ఉండవు. హుందాతనంగా, సెన్సీటీవ్‌గా ఉండేవారు కుందేళ్లను పెంచడానికి ఇష్టపడతారు.

జంతువులు-వాస్తు…
జంతువుల పెంపకం కోసం మీ ఇంట్లో షెడ్డును నిర్మించా లనుకుంటే, దక్షిణ-మధ్యస్థ భాగం, నైరుతి లేదా వాయువ్యం వైపో లేదా పడమర-మధ్యస్థ భాగములోనో నిర్మించడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాదాలు…
పలు ప్రమాదాలకు పెంపుడు జంతువులు కారణమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జంతువుల కారణంగా గాయపడి ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువే. అమెరికాలో 2006లో 86,629 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్లు తెలుస్తోంది. వీటిలో కుక్కలదే పైచేయి. కుక్కులను బయటికి తీసుకెళ్లినప్పుడు జరిగే ప్రమాదాలు అధికం. వేగంగా వచ్చి మీదపడడం, అవి మూత్రవిసర్జన చేస్తే తెలియక జాడిపడడం ఇలా పలు రకాలుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వృద్ధులకు, చిన్నారులకైతే ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top