You Are Here: Home » ఇతర » ప్రేమనగర్‌ హైదరాబాద్‌ అంటే అందరికీ ఇష్టమే!

ప్రేమనగర్‌ హైదరాబాద్‌ అంటే అందరికీ ఇష్టమే!

నిజాం కళల సౌరభం… చరి త్రకు కాణాచి… శుత్రుదు ర్భేద్యం… ఐటి హబ్‌… అభివృద్ధి ఎనలేనిది… అనేక మతాల సంగమం… వివిధ భాషల మేళవింపు… నిరుద్యోగుల పాలిటి కల్పవల్లి… విద్యార్థులకు చదువుల ఆలయం… కోటి ప్రజల నివాసం… ఎనిమిది కోట్ల ఆంధ్రుల రాజధాని… అదే హైదరాబాద్‌. భాగమతి ప్రేమకు చిహ్నంగా వెలిసిన ప్రేమనగర్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంతంలో సాగుతున్న ఉద్యమం… రాష్ట్ర విభజన వద్దంటూ సమైక్యంగానే ఉంచాలంటూ మరికొందరు… రాయలతెలంగాణ ఏర్పాటు చేయాలని ఇంకొందరు ఎవరి వాదన ఎలా ఉన్నా అందరి ఉమ్మడి చర్చ హైదరాబాద్‌పైనే… ేకంద్ర ప్రభుత్వం కూడా తన పాలనలోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్న దరిమిలా… భాగ్యనగరంగా పేరు పొంది హైదరాబాద్‌గా మారిన మన రాష్ట్ర రాజధానిని ఎవరూ వదులుకోవాలనుకోవడం లేదు. నాలుగువందల ఏళ్ల పైబడిన చారిత్రక నగరంపై ప్రత్యేక కథనం.
వాణిజ్య వ్యవస్థ
హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు పొందింది. ప్రస్తుతం ఐటి రంగం దూసుకుపోతుం డడంతో ఐటి హబ్‌గా మారుతోంది. చార్మినారుకు దగ్గర లోనే ముత్యాల మార్కెట్‌ ఉంది. వెండి గిన్నెలు, చీరెలు, నిర్మల్‌, కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.

ఐటి రంగం
Untita1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి, ఐటిఇఎస్‌ కంపెనీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా అనడం ప్రారంభమైంది. హైదరాబాదును బెంగుళూరు తరువాత రెండో సిలికాను వ్యాలీగా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు ప్రపంచ వ్యాప్తి చెందింది. సత్యం కంప్యూటర్స్‌, ఐబిఎం, ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, విప్రో, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఒరాకిల్‌,డెల్‌, కాన్బే, జిఇ, సొన్స్‌ ఈన్దీ, డెలాయిట్‌, హెచ్‌ఎస్‌బిసి, జూనో, ఇంటర్‌గ్రాఫ్‌, కీన్‌, బాన్‌ ఇక్కడున్న ప్రముఖ కంపెనీలలో కొన్ని. ప్రతిష్టాత్మకమయిన ఫ్యాబ్‌ సిటీ ప్రాజెక్టును కూడా హైదరాబాద్‌ చేజిక్కించుకుంది.

స్వాతంత్య్రానికి ముందే అభివృద్ధి…
దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్‌ సకల వస తులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మాని యా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమా నాశ్రయం, కంటోన్మెంటు , విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, డ్రైనేజి వ్యవస్థ, మంచినీటి సరఫరా వ్యవస్థ, రోడ్లు, డబుల్‌ డెక్కర్‌ బస్సులు, డీజిల్‌ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషన్‌, టంకశాల, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ కూడా పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. సంవత్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్‌ సూచన మేరకే బొల్లారంలో రాష్టప్రతి నిలయాన్ని ఏర్పాటు చేశారు. 1956లో హైదరాబాద్‌ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండగా ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉంది.

స్వాతంత్య్రం అనంతరం
1947లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించా లని నిర్ణయించాడు. అయితే ఈ ప్రాంతంలో హింస పెరగడంతో నాటి కేంద్ర మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ నేతృత్వం లో భారతదేశం ఆపరేషన్‌ పోలో పేరుతో పోలీసు చర్యకు ఉపక్రమించింది. సెప్టెంబరు 17, 1948న, అంటే భారతదే శానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడంతో హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత ఎనిమిది సంవత్సరాలపాటు (సెప్టెంబరు 17, 1948 నుండి 1956 నవంబర్‌ 1వరకు) హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. 1956 నవంబర్‌ 1న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించి నపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కలిసిపోయింది. అప్పటి నుంచే హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది.

కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌కు మార్పు…
రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేశారు.

నీటి సరఫరా…
Hydaహైదరాబాద్‌ నగరానికి కొన్నేళ్లుగా ఉస్మాన్‌సాగర్‌(గండిపేట్‌), హిమాయత్‌సాగర్‌ జలాశయాల నుంచే నీరు సరఫరా అయ్యేది. కాలానుగూణంగా నగర జనాభా పెరుగు తుండటంతో పాటు జంట జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటిపోయి ఇబ్బందులు ఎదురవుతుండటంతో మెదక్‌ జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి భారీగా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే, జనాభా అంతకంతకు పెరగడంతో పాటు శివారు ప్రాంతాలను గ్రేటర్‌లో విలీనం చేయడంతో నీటి కష్టాలను అధికమించ డానికి ప్రభుత్వం కృష్ణాజలాలను రప్పిస్తోంది. ఇప్పటికే శివార్లలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా అవుతుం డగా, మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ కృష్ణాజలాలను అందించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.

ఉస్మాన్‌ సాగర్‌ నుంచి రోజుకు 25 మెట్రిక్‌ గాలన్లు, హిమాయత్‌ సాగర్‌ నుంచి 15 మెట్రిక్‌ గాలన్లు, మంజీరా బ్యారేజీ నుంచి 45 మెట్రిక్‌ గాలన్లు, సింగూర్‌ డ్యాం నుంచి 75 మెట్రిక్‌ గాలన్లు, కృష్ణా ప్రాజెక్టు నుంచి 180 మెట్రిక గాలన్ల నీరు హైదరాబాద్‌కు సరఫరా అవుతోంది. అయినా నీటి సమస్య తీరడం లేదు. 5లక్షల30వేల కనెక్షన్ల ద్వారా నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారు.

చార్మినార్‌ నిర్మాణం…
Untiaతాజ్‌మహల్‌ను ఎవరు నిర్మించారు అనగానే షాజహాన్‌ అని టక్కున చెబుతాం… కానీ చార్మినార్‌ను ఎవరు కట్టించారు… అంటే సమాధానం తెలియనివారు చాలా మందే ఉంటారు. కుతు బ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత చించలం(ఇప్పుడు శాలిబండ ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో ప్లేగు మహమ్మారి సోకి గోల్కొండ నగరం అతలాకుతలమయింది . నవాబ్‌ కులీ కుతుబ్‌ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశాడు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్‌ నిర్మించాడు.

కొత్త మాస్టర్‌ ప్లాన్‌
హైదరాబాదు దాదాపు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం మధ్య ప్రాంతంలో ఉన్నది. ఇది దక్కను పీఠభూమిపై సముద్రమట్టం నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు). బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌) ప్రకారం కోర్‌ ఏరియా 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా… 2031 నాటికి అది 1.84 కోట్లకు పెరుగుతుందనే అంచనాలతో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. ప్రస్తుతం జనాభా కోటి దాటిందనే అనధికార అంచనాలు ఉన్నాయి.

నిర్మాణం….
Hydహైదరాబాదును మూసీ నది ఒడ్డున క్రీ.శ.1590 దశకంలో కుతుబ్‌ షాహీ వంశస్థుడయిన మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా నిర్మించాడు. గోల్కొండలో నీటి సమస్య ఎక్కువగా ఉండేది. దీంతో నగరాన్ని ఈ నది ఒడ్డుకు మార్చినట్లు చరిత్రకారుల అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి నుండే కుతుబ్‌ షాహీ వంశస్తులు ఇప్పటి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని భాగాలను పాలించారు. దాదాపు 4400 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర గల నగరమిది. హైదరాబాదుకు భాగ్‌ నగర్‌ అనే పేరు కూడా ఉంది. మహమద్‌ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్ర్తీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్‌ నగర్‌ అని పేరు పెట్టాడు.

తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్‌ మహల్‌ అని పేరు మార్చుకుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాద్‌గా రూపాంతరం చెందింది. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం వుంది. హైదర్‌ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.

భిన్నత్వంలో ఏకత్వం
హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు, సింధీలు వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. సిక్కులు, పార్శియులు, బౌద్ధులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు తెలుగు, ముస్లిములు ఉర్దూ మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. మూసాపేట ప్రాంతంలో సుదూరతీరంలోని శ్రీకాకుళం జిల్లాలవారు స్ధిరపడ్డారు. ఇక్కడి ముస్లిములు సంప్రదాయికంగా ఉంటారు. స్ర్తీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను ఖచ్చితంగా పాటించడం వంటివి కనిపిస్తాయి.

కోటికి పైనే జనాభా
గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా అధికార లెక్కల ప్రకారం 80 లక్షలు ఉన్నా…వాస్తవానికి కోటికి పైగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలతో పోలీస్తే గ్రేటర్‌ జనాభానే అత్యధిక ఉంది. హైదరాబాద్‌ న గరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని శివారు ప్రాంతాలను కలిపి ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ను ఏర్పాటుచేయడంతో విస్తీర్ణంతో పాటు జనాభా కూడా విపరీతంగా పెరిగింది. శివారు ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలో సుమారుగా 40 శాతానికి పైగా జనాభా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్దిరపడినవారు ఉన్నారు. విద్యా,ఉద్యోగావకాశాలకోసం వచ్చి ఇక్కడ ఉంటున్నవారు కూడా అధికంగా ఉన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top