You Are Here: Home » ఇతర » ప్రపంచంలో 10 హైస్పీడ్‌ ట్రైన్స్‌

ప్రపంచంలో 10 హైస్పీడ్‌ ట్రైన్స్‌

ఇది స్పీడ్‌ యుగం. పనులతో పాటు ప్రయాణ వేగం పెరిగింది. ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లడానికి బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు వాడుతుంటాం. కానీ ఈ మధ్య కాలంలో డిజైన్‌ చేసిన రైళ్ళు విమానాలతో పోటీపడుతున్నారుు. చైనాలో బుల్లెట్‌ ట్రైన్స్‌ విమానాల సమయం కన్నా నిర్దేశిత ప్రదేశాలకు ముందుగానే వెళుతున్నాయని ఈ మధ్య ఓ సర్వేలో తేలింది. ఇవి చైనాేక పరిమితం. ఈ బుల్లెట్‌ ట్రైన్స్‌ సంగతి అలా ఉంచి… భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్ళు వివిధ దేశాలలో నడుస్తున్నారుు.

చైనా రైల్వేలు అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న రైళ్లు నడుపుతున్నప్పటికీ, భధ్రత, ఆ రైలు ఇంజన్ల సామర్యం ఆధారంగా అధికారులు వేగవంతమైన రైళ్ల జాబితా విడుదల చేశారు. ఈ సంవత్సరం సైన్స్‌ అండ్గ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబిలో ప్రపంచంలో వేగంగా వెళ్ళే 10 రైళ్ల వివరాలు తెలిపారు. రైలు భద్రత మరియు సామర్థ్యం చైనాకు చెందిన 380ఎ హైస్పీడ్‌ రైలు అత్యధిక వేగంతో మొదటి స్థానంలో ఉంది. కొత్తగా నిర్మించిన ప్రధాన లైన్‌లో 380 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు వెళుతుంది.
Tra52
హెచ్‌ఎస్‌ఎల్‌1
హెచ్‌ఎస్‌ఎల్‌1 బెల్జియంకు చెందిన రైలు. గంటరు 300 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది బ్రస్సెల్స్‌ నుండి ఎల్‌జివి వోర్డ్‌కు వెళుతుంది. ఇదే బెల్జియంలో హై స్పీడ్‌ రైల్‌ లైను. దీని సర్వీసు 1197లో ప్రారంభించారు. గంటా 22 నిమిషాల్లో ప్యారిస్‌ నుంచి బ్రూసెల్స్‌ చేరుకోవచ్చు.
ఇటిఆర్‌ 500
ఇటిఆర్‌ 500గా పిలిచే ఎలిట్రో టైనో రాపిడో 500 ఇటాలియన్‌ అధిక వేగవంతమైన రైలు. 300 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీన్ని 1993లో ప్రారంభించారు.
యారోస్టార్‌
యారోస్టార్‌ యూకెలో లండన్‌ నుంచి ప్యారీస్‌ నుండి బ్రూసెల్స్‌కు నడుస్తుంది. దీని వేగం గంటకు 300 కిలోమీటర్లు. ఇందులో 900 మంది ప్రయాణించవచ్చు.
Trai2
ఎవిఇ టాల్గో350
స్పెయిన్‌లో తిరిగే ఎవిఇ టాల్గో350 రైలు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. మ్యాడ్రిడ్‌ నుంచి హుస్సేనాకు వెళ్తుంది. ఈ రైలులో కేవలం 318 మంది మాత్రమే ప్రయాణం చేయవచ్చు.
టిహెచ్‌ఎస్‌ 700టి
టిహెచ్‌ఎస్‌700టి మోడల్‌ తైవాన్‌ హైస్పీడ్‌ రైల్‌. తైవాన్‌ యొక్క అధిక వేగంగా పరిగెత్తే రైలు. అత్యధిక స్పీడ్‌ కల ఎలక్ట్రికల్‌ మల్టిపుల్‌ యూనిట్‌ రైలు ఇది . ఇది గంటకు 336 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. తైపీ నుండి కౌషూంగ్‌ వరకూ నడిచే ఈ రైలులో 989 మంది ప్రయాణించవచ్చు.
Train6
కెటిఎక్స్‌-2
కెటిఎక్స్‌-2 లేదా కెటిఎక్స్‌ షాన్‌చియాన్‌ మోడల్‌ రైలు దక్షిణ కొరియాలో నడుస్తుంది. దీన్ని హ్యుందయ్‌ కంపెనీ 2000 సంవత్సరంలో డిజైన్‌ చేసింది. ఇది అధిక వేగం కల రైలు. ఇది గంటకు 353 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దక్షిణ కొరియాలో అనేక ప్రాంతాలకు ఈ రైలు సర్వీసు ఉంది. ఈ రైలులో 363 మంది ప్రయాణించవచ్చు.
టిజివిఆర్‌
ప్రెంచ్‌ యాజమాన్యంలోని టిజివిఆర్‌ రైలు 1992 మరియు 1996 మధ్య అల్స్టామ్‌ కంపెనీ నిర్మించింది.. ఈ రైలు గంటకు 380 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. కానీ ప్రస్తుతం 320 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతున్నారు. ఈ రైలులో 377 మంది ప్రయాణించవచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top