You Are Here: Home » చిన్నారి » ప్రపంచంలోనే అతి బరువైన కాయిన్స్ ఏవి?

ప్రపంచంలోనే అతి బరువైన కాయిన్స్ ఏవి?

మనం రకరకాల ఆకారాలు, మామూలు బరువు ఉన్న రూపాయి, రెండు, ఐదు, పది రూపాయల నాణాలను చూస్తూనే ఉంటాం. గతంలో నాణాలను చాల పెద్దగా రూపొందించే వారు. స్వీడన్‌కి చెందిన పదిడాలర్ల నాణాలని అత్యంత బరువైన నాణాలుగా భావిస్తున్నారు.

వీటిని 1644లో రూపొందించారు. ఇవి స్వీడన్ రాజ్యాన్ని క్వీన్ క్రిష్టియానా పాలిస్తున్న కాలంలో చలామణిలోకి వచ్చాయి. ఒక్కొక్క కాయిన్ బరువు 19.71 కిలోలు. వీటిని చేతుల్లోనో, జేబులోనో తీసుకొని వెళ్లటం సాధ్యం కాని పని. వీటి తయారీకి వెండిని వాడారు. స్వీడన్‌లో నాణాల తయారీకి బంగారాన్నీ, వెండినీ, రాగిని కూడా ఉపయోగించేవారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top