You Are Here: Home » చిన్నారి » కవితలు » ప్రతీదీ

ప్రతీదీ

గుయొర్నికా బొమ్మ ఎక్కడుంది
ఇక్కడే ఈ ఉరఃపంజరంలోనే
రోడిన్‌ థింకర్‌ ఎక్కడున్నాడు
ఇక్కడే ఈ తల లోపలే
యమ్‌.ఎఫ్‌. హుస్సేన్‌
జననాశ్వాలు ఎక్కడున్నాయి
ఇక్కడే ఈ శరీరం నిండానే-
వాన్‌గోలూ, పికాసోలూ, సాల్వడార్‌ దాలీలు
ఎక్కడున్నారు
ఒక విధ్వంస చిత్రకారుడి చేతి వేళ్ళలోనే-

ఎవరు ఏ దేశంలో ఏ కళ్ళతో
జన సమూహాన్ని చూసినా
భౌగోళిక స్వరూప స్వభావాన్ని దర్శించినా
అవన్నీ అవన్నీ ఇక్కడే ఇక్కడే
ఈ కళ్ళలోనే వేళ్ళూనుతున్నాయి-

చిమ్నీ మీద నించున్న కాకీ
పొయ్యిలో పడుకున్న కుక్కా
ఎక్కడో రాతి ఆములోనో, చెత్త కుప్పలోనో
చుట్టలు చుట్టుకుంటున్న తాచుపామూ-
భయంకర మధ్యాన్నపూట
మండుతున్న గోధుమ చేనయినా
ఎండాకాలం తుమ్మ చెట్లెంట
ఎండిన తుమ్మకాయ లేరుకుంటున్న
చెప్పుల్లేని కాళ్ళ చిన్న పిల్లలయినా-

shivaవీళ్ళకి దేశాలేమిటి, స్థలాలేమిటి-
వీళ్ళన్ని దేశాల్లో అన్ని కాలాల్లో సజీవంగా-
రావణాసురుడు పేగులు దీసి
రుద్ర వీణ మోగించాడట
వీళ్ళు ఆకలి పేగులు మోగిస్తున్నారు-
ఎండాకాలం మొత్తాన్ని
యుద్ధ భేరి చేసి వాయిస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top