You Are Here: Home » ఇతర » ప్రతి ఘటనలో ‘మేధా’సంపత్తి

ప్రతి ఘటనలో ‘మేధా’సంపత్తి

25dheeraజాతీయ ఉద్యమ సంస్థల కన్వీనర్‌ మేధా పాట్కర్‌, నవంబర్‌ మొదటి వారంలో కిసాన్‌ సంఘర్ష్‌ సమితి నాయకురాలు ఆరాధనా భార్గవతో మధ్యప్రదేశ్‌లోని చింద్వాడాలో పెంచ్‌ వాటర్‌ డెైవర్షన్‌ ప్రాజెక్ట్‌ను ప్రతిఘటిస్తూ శాంతియుతంగా ఆందోళన చేశారు. ఈ ప్రాజెక్ట్‌ కారణాన 31 గ్రామాల్లోని 56,000 కుటుం బాలు నిరాశ్రయం అవుతాయి. చిత్రమేమిటంటే, ఈ ప్రాజెక్ట్‌కు పరావరణ మంత్రిత్వశాఖ నుండి అనుమతి లేదు. గతంలో దిగ్విజయ్‌ సింగ్‌ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్‌ను ప్రతిఘటించిన రెైతులపెై కాల్పులు జరిపించి జాతీయ ద్యమ సంస్థల కన్వీనర్‌ డా సునీలమ్‌పెై 66 కేసులు మోపారు. జార్ఘండ్‌లో నిరాశ్రయ కుటుంబాలకోసం కృషి చేసిన జాతీయ ఉద్యమ సంస్థల కన్వీనర్‌, ప్రముఖ జర్నలిస్ట్‌ దయామణి బర్లాపెై అక్రమంగా కేసులు మోపారు. మేధా పాట్కర్‌, వీరిని విడుదల చేయమని, అక్రమ కేసులు ఎత్తివేయమని కోరింది.

ప్రత్యామ్నాయాలు
కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో కిరటూర్‌లోని సల్సబీన్‌ గ్రీన్‌ స్కూల్లో మేధా పాట్కర్‌ నేతృత్వంలో నవంబర్‌ 17 నుండి 19 వరకూ జాతీయ ఉద్యమ సంస్థల 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనంలో 15 రాస్ట్రాల నుండి 600 ప్రతినిధులు పాల్గొన్నారు. వీరందరికీ ఆ స్కూలు డెైరెక్టర్‌ హుస్సేనీ దంపతుల సారధ్యంలో విద్యార్థులే స్వయంగా అతిథి ఏర్పాట్లు చేసారు. ప్రకృతి వనరుల సద్వినియోగం, విద్య, వెైద్యం, శ్రామికుల హక్కులు, ఇంధన వనరులు, రెైతులు, కార్మికుల బాగోగులు, ప్రత్యామ్నాయ రాజకీయాలు, అవినీతి నిరోధానికి చర్యలు, కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేక పోరాటం, సంస్కృతి, మీడియా, అసంఘటిత కార్మికుల సమస్యలపెై మేధా పాట్కర్‌ తన ఆలోచనా ధోరణిని సభ ముందు ఉంచారు.

దేనికైనా రెడీ
మేధా పాట్కర్‌ ఆదివాసీ, రెైతులు, దళితులు, అల్పసంఖ్యా కులు, కిరాణా రంగంలో విదేశీ పెట్టుబడులపెై, జాతీయ ఉద్య మాలను ఎలా పటిష్టం చేయాలనే అంశాలపెై మేథావులు, ఆలోచనాపరుల దృష్టిని సారింపచేశారు. ఆమె కాశ్మీరు నుం డి కన్యాకుమారి వరకూ నిరంతరం పర్యటనలు చేస్తారు. ఆమెకు నడుం నొప్పి, మెడనొప్పి వంటి తీవ్ర అనారోగ్య సమ స్యలున్నా ఖాతరు చేయరు. నర్మదా బచావో ఆందోళనను ఎంతో కాలంగా నిర్వహిస్తున్నారు. 27 సంవత్సరాల నుండీ ఆందోళన కొనసాగిస్తున్నా ఇంత వరకూ నిరాశ్రయులకు పూర్తి ఆశ్రయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించ లేక పోయింది. దేశంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా, మేధా పాట్కర్‌ నాయకత్వం తప్పనిసరి.

ఆంధ్రప్రదేశ్‌లోని సోం పేట, డెల్టారెైతుల ఉద్యమం, విశాఖలో గుడిసెవాసుల ఉద్య మం, హైదరాబాద్‌లో హాకర్ల ఉద్యమం, మణుగూరులో ఓపెన్‌ కేస్ట్‌కు వ్యతిరేక ఆందోళన, పూనేలో టాటాడామ్‌, లావాసా ప్రాజెక్ట్‌, తమిళనాడులో సిప్యాట్‌ కోసం భూముల సేకరణ, పాలాచిమడలో కోకాకోలా బాధితులకై, కేరళలో ఎండోసల్ఫాన్‌ బాధితులు, పాట్నాలో గుడిసెవాసులు, ఉత్తరప్రదేశ్‌లో భట్నీ, బాలియాలలో రెైతులకోసం, లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశానికై ఆందోళన ఇలా ఎక్కడెైనా ఆందోళనకు నేను ‘రెఢీ’ అనడమే కాకుండా, సారధ్యం వహించడం ఆమెలోని పోరాట పటిమను తెలియజేస్తుంది. మేధా పాట్కర్‌ ఆదివాసీ, రెైతులు, దళితులు, అల్పసంఖ్యా కులు, కిరాణా రంగంలో విదేశీ పెట్టుబడులపెై, జాతీయ ఉద్య మాలను ఎలా పటిష్టం చేయాలనే అంశాలపెై మేథావులు, ఆలోచనాపరుల దృష్టిని సారింపచేశారు. ఆమె కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ నిరంతరం పర్యటనలు చేస్తారు.

పేరులో పెన్నిధి
మేధా కేవలం శ్రామిక వర్గాలనే కాక, ఆమె పేరుకు తగ్గట్టు మేధావి వర్గాలను కూడా విశేషంగా ప్రభావితం చేస్తుంది. ప్రముఖ వెైద్యులు బినాయక్‌ సేన్‌ మేధా పాట్కర్‌ నాయకత్వం లో ముందుండటం గమనార్హం. జాతీయ అటవీకార్మికుల ఫెడరేషన్‌, ఏక్తాపరిషత్‌, జనసంఘర్ష మోర్చా, లోక్‌శక్తి అభియాన్‌, పోస్కో (ఒడిషా) ఉద్యమకారులు, సమాచార హక్కు కార్యకర్తలు, జన సంసద్‌, ఘర్‌ బచావో ముంబెై, లోక్‌ శిక్షాపరిషత్‌, కర్నాటకలోని 26 వర్గాల కార్మికులు, మేథాపాట్కర్‌ దిశానిర్ధేశకత్వంలో పనిచేస్తున్నారు. ఈమె విద్య, వెైద్య రంగంలో ప్రత్యామ్నాయాలకై ఆంధ్రప్రదేశ్‌ నుండి ‘సరస్వతి కావుల’ను ఎంపిక చేశారు. సరస్వతి అనువాదాలు చేయడంలోను, సదస్సుల నిర్వహణలో మేటి. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారంలో జాతీయ ఉద్యమ సంస్థల వ్యవస్థాపకుల్లో ఒకరెైన పి.

చెన్నయ్యను, ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌.ఏ.పి.ఎమ్‌ కన్వీనర్‌గా భూపతిరాజు రామకృష్టంరాజును, కర్షకుల సమస్యల అవగాహనకు కిరణ్‌ విస్సాను నియమించారు. మేధా పాట్కర్‌ ప్రపంచీకరణకు పూర్తి వ్యతిరేకి. ప్రత్యామ్నా య రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారేకు బాసటగా నిలిచారు. పెప్సీనహీ, పానీ చాహియే, లడేంగే, జీతేంగే నినాదాలతో పిడికిలి బిగించి ఉద్యమాలలో ఎప్పుడూ అగ్రభాగాన నిలు స్తారు. సుస్థిర వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, బడుగు జీవులకు రక్షణ, కార్మిక, కర్షక, మత్స్యకారులు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికై ఆమె అహరహం శ్రమిస్తారు.

మేథా మనసు..
deraమేధా పాట్కర్‌ ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటుంది. ఆమె ఒంటిపెై నెక్లెస్‌, బంగారు గాజులు వంటి ఏ విధమైన ఆభరణాలు మచ్చుకైనా కానరావు. తల్లి తన బిడ్డల బాగో గులు కాంక్షించినట్లు, అందరూ భోజనం ముగిస్తేనే కానీ ఆమె భోజనం చేయరు. కార్యకర్తలతో పరుష వాక్కులు ఎప్పుడూ కానరావు. ఆమె పనిరాక్షసి. ఆద్యమాల్లో కష్టించే వారికి ఆమె ప్రోత్సాహం ఎప్పుడూ వుంటుంది. ఆమె ధ్యేయం లక్ష్యసాధనే. పార్టీలకు అతీతంగా నాయకులు ఆమె అమూ ల్య సలహాలను స్వీకరిస్తూవుంటారు. అణగారిన వర్గాలకు ఆమె ఆశాజ్యోతి. ఆమె నిర్వహించే జీతీయ ప్రజా ఉద్యమాల ఐక్యవేదికలో కులం, ప్రాంతం, మతం, వర్గాలకు తావు లేదు. జన ఆందోళనలో ఆమె త్యాగాలు యువతకు మార్గద ర్శకాలు.

ఆమె విశాల దృక్పధం కారణాన పలువురు పరిణతి చెందిన రాజకీవేత్తలు, మేథావులు, విద్యావేత్తలు పాలుపంచు కోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో లోహియా అనుచరులు సోమయ్య, పాపిరెడ్డి, గాయత్రీ పరివార్‌లో ప్రముఖ పాత్ర వహించిన డా తుమ్మూరి, జన విజ్ఞాన వేదిక డా ఎల్‌. మురళీధర్‌ వంటి ప్రముఖులు జన ఆందోళన్‌ రాష్ట్రీయ సమ న్వయం, కేరళ సదస్సులో పాల్గొన్నారు. మేధా పాట్కర్‌ కేవ లం క్లాస్‌ లీడరే కాదు, మాస్‌ లీడర్‌ కూడా. వీరితోపాటుగా అంధ్రప్రదేశ్‌ నుండి ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ దండు కృష్ణ వర్మ కూడా పాల్గొని సదస్సు విశేషాల్ని మనకి అందించగా ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ సత్యనారాయణ ఛాయాచిత్రాలు అందించారు.

మేధాపాట్కర్‌ ప్రపంచీకరణకు పూర్తి వ్యతిరేకి. ప్రత్యామ్నాయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారేకు బాసటగా నిలిచారు. పెప్సీనహీ, పానీ చాహియే, లడేంగే, జీతేంగే నినాదాలతో పిడికిలి బిగించి ఉద్యమాలలో ఎప్పుడూ అగ్రభాగాన నిలుస్తారు. సుస్థిర వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, బడుగు జీవులకు రక్షణ, కార్మిక, కర్షక, మత్స్యకారులు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికై ఆమె అహరహం శ్రమిస్తారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top