You Are Here: Home » ఇతర » ప్రజా జీవిత ప్రతిబింబం అభ్యుదయ సాహిత్యం

ప్రజా జీవిత ప్రతిబింబం అభ్యుదయ సాహిత్యం

భారతీయ నాగరికతలో ఉత్తమ సంప్రదాయాలకు వారసులమని…నొక్కి చెబుతూ దేశంలోని అభివృద్ధి నిరోధకత్వాన్ని నిరసిస్తూ….దేశంలో నూతన జీవితం లక్ష్యంగా పెట్టుకొని ప్రజా ఉద్యమాలతో మమేకమవుతూ ‘అరసం’ ముందుకు నడు స్తోంది. ప్రపంచీకరణ అనే ముసుగులో దేశ సంస్కృతిని, సాహిత్యాన్ని కనుమరుగు చేస్తుందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ‘అరసం’ భావిస్తోంది. కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు, గురజాడ, కాళోజి అందించిన సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుెకళ్ళి వాళ్లు నిర్మించిన సాహిత్య పునాదులకు వామపక్ష భావజాలంతో ‘అరసం’ ముందుెకళ్తుందన్నారు. భవిష్యత్‌లో యువ రచరుుతలను ప్రోత్సహించడానికి సాహిత్య స్కూళ్లు, కార్యాచరణ జరపనున్నట్లు ‘అరసం’ ప్రకటించింది. ‘అరసం ’ ఏర్పడి 76 వసంతాలు, అరసం తెలుగు శాఖ ఏర్పడి 70 వసంతాలు పూర్తి అయ్యారుు. అదే స్ఫూర్తితో కాలానుగుణంగా మార్పులను అన్వరుుంచుకుంటూ అభ్యుదయం కోసం జనశ్రేణులు జరుపుతున్న ప్రతి పోరాటం, ఆందోళన, అలజడి అన్ని కూడా వర్గపోరాటంలో అంతర్భాగంగా మారింది ‘‘అరసం’’.

suna1930 దశకపు కల్లో పరిస్థితుల్లో ఫాసిస్టు వ్యతిరేకత నుంచి ప్రపంచవ్యాపితంగా అభ్యుదయ సాహిత్యోద్యమం ఆవిర్భవించింది. 1935లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సు ప్రేరణతో అదే సంవత్సరం అలహాబాద్‌లోని సజ్జాద్‌ జహీర్‌, మున్సీ ప్రేమ్‌చంద్‌ మొదలెైన రచయితల ఆధ్వర్యంలో అభ్యుదయ రచయితల సంఘం (అరసం) స్ఫాపించారు. 1936 నాటికే జాతీయ స్థాయిలో నిర్మాణ రూపాన్ని పొందిన ‘అరసం’ అదే ఏట ఏప్రిల్‌ 9,10, తేదీల్లో లక్నోలో జరిగిన మహాసభలో జాతీయ స్థాయిలో నిర్మాణ రూపాన్ని పొంది అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘంగా (అరసం) ఏర్పడింది. ఆ నాటి నుంచి అన్ని భారతీయ భాషలకు ప్రాతినిథ్యం వహిస్తూ ‘అరసం’ కృషి చేస్తుంది.

ఆలిండియా ప్రోగ్రెసివ్‌ రెైటర్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రశాఖగా అభ్యుదయ రచయితల సంఘం (అరసం)గా 04121942న తెనాలిలో ఆవిర్భవించింది. కందుకూరి, గురజాడ, గిడుగులు, సామాజిక సాహిత్య, భాషా ప్యూడలిజాలకు వ్యతిరేకంగా జరిపిన నిరంతర పోరాటాల వారసత్వాన్ని స్వీకరించిన అభ్యుదయ రచయితల సంఘం 1943 ఫిబ్రవరి 13,14 తేదీల్లో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల మహాసభ జరిగింది. ఆ మహాసభలోనే అరసం ప్రణాళికను రూపొందించారు.

ఈ మహాసభ ఇచ్చిన నూతనోత్తేజంతో ‘అరసం’ తెలుగు జన జీవితంలోకి ప్రవేశించింది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో 194752 సంవత్సరాలలో ‘అరసం’ తీవ్రమైన ప్రభుత్వ దాడులకు, నిర్బంధాలకు గురెైంది. జాతీయ పునరుజ్జీవనోద్యమంలో ప్రజానాట్యమండలితో కలసి ‘అరసం’ ప్రధాన కృషి చేసింది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన పాటలు, సాహిత్యం వెల్లివిరిశాయి. ఎంతోమంది కవులు, కళాకారులు పుట్టుకొచ్చారు. సాహిత్యోద్యమ సేవగా అమరవీరుడు యాదగిరి, సుద్దాల హనుమంతు, తిరునగరు రామాంజనేయులు, కాంచనపల్లి చిన వెంకటరామారావు, వట్టికోట ఆళ్వారుస్వామి, బొల్లిముంత శివరామకృష్ణ వంటి వారెందరో సాయుధ పోరాట సాహితీ క్షేత్రాన్ని పండించి నిర్బంధాలకు గురయ్యారు.

అరసం ‘పునరుద్ధరణ
1967 నుండి అనేక చోట్ల ముఖ్యంగా విజయవాడలో అరసం సమావేశా లు జరుగుతూ వచ్చాయి. 1970లో హైదరాబాద్‌లో ‘అరసం’ పునరుద్ధర ణకు చేసిన ప్రయత్నాల ఫలితంగా 1973 నాటి ‘అరసం’ నిర్మాణ యుతం గా తిరిగి రూపుదిద్దుకొని పునరుద్ధరించబడింది. కాలంతో వచ్చిన మార్పును గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘంగా పేరులో మార్పు తెచ్చుకుంది. కొత్త ప్రణాళికను ప్రకటించుకుంది.

మహాసభలు
kalojiaa1973 ఆగస్టులో ‘అరసం’ 6వ రాష్ర్ట మహాసభలను జరుపుకుంది. 7వ సభను హైదరాబాద్‌లో, 8వసభ 1978 డిసెంబర్‌లో కాకినాడలోనూ, 1985లో 9వ మహాసభ తిరుపతిలో, 1988లో 10వ మహాసభ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో, 1992లో 11వ సభ గుంటూరులోనూ, 1996లో 12వ సభ గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ, 13వ మహాసభలు కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని లోనూ, 14వ సభ సాగరతీరం విశాఖలోనూ జరుపుకుంది. ఈ సభల్లో సాహితీ, సాంస్కృతిక, ఆర్థిక అంశాలపెై పలు తీర్మానాలను చేసింది. పోరాటాలకు సాహిత్యం పదును పెట్టగా సాహిత్యానికి పోరాటాలు స్ఫూర్తినిచ్చాయి. ’భారతీయ నాగరికతలోని ఉత్తమ సంప్రదాయాలకు వారసులమని నొక్కి చెప్పుతూ, మన దేశంలోని అభివృద్ధి నిరోధకత్వాన్ని అన్ని విధాలా విమర్శిస్తాం. మన దేశంలో ఒక నూతన జీవిత్న్నా లక్ష్యంగా పెట్టుకొని పాటుపడుతుంది ‘అరసం’.

అందుకు తోడ్పడే ప్రతి విషయాన్ని వెలిబుచ్చడం ద్వారాను, నూతన రచనల ద్వారా కృషిచేస్తోంది. అందుకు కావాల్సిన దేశీయ, విదేశీయ విజ్ఞాన సంపదను వినియోగించుకుంటాం. మన భారతీయ వారసత్వం ఆకలి, దారిద్య్రం, రాజకీయ బానిసత్వం, సాంఘికంగా వెనుకబడడం మొదలెైన జీవిత ప్రధాన సమస్యల్ని చర్చించాలని అభ్యుదయ రచయితల సంఘం తన ప్రణాళికను ప్రకటించింది.
దీంతో పాటు ఆభివృద్ధికర సాహిత్యాన్ని ప్రచురించడం, అభివృద్ధి నిరోధక సంస్కృతిని ప్రతిఘటించడం, నూతన సమాజాభివృద్ధికి పాటుపడడం, ఆలోచనా స్వాతం్త్ర్యం, అభిప్రాయ స్వాతం్త్ర్యం, స్వేచ్ఛా ప్రచార హక్కులను పరిరక్షించాలని పోరాడడం ‘అరసం’ ఆశయాలుగా పేర్కొంటూ ముందుకు సాగుతోంది.

ఇంతటి మహాశయాలు కలిగిన అభ్యుదయ రచయితల సంఘానికి చాలాకాలం శ్రీశ్రీ, చాగంటి సోమయాజులు, పుచ్చలపల్లి సుందరయ్య, తుమ్మల వెంకటరామయ్య, పులుపుల వెంకట శివయ్య, కుటుంబరావు, రాంబట్ల కృష్ణమూర్తి, ధాశరధి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, పులిపండా అప్పలస్వామి, తెలికిచర్ల వెంకటరత్నం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గజ్జెల మల్లారెడ్డి మరెందరో ‘అరసం’ బాటలో పయనిస్తూ బాధ్యతలు నిర్వహించారు. వారి స్ఫూర్తితో వందలాది యువ సాహితీవేత్తలు అభ్యుదయ రచయితల సంఘానికి చేరువయ్యారు. నాలుగు తరాల ప్రగతిశీల రచయితలకు వారధిగా అభ్యుదయ సాహిత్యోద్యమ సారధిగా నేడు ‘అరసం’ పురోగమిస్తుంది.

తెలంగాణ ఉద్యమానికి అరసం బాసట
తెలంగాణ రాష్ర్ట ప్రజల చిరకాల ఆకాంక్ష ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటును ‘అరసం’ స్వాగతించింది. కడపలో జరిగిన 15వ రాష్ర్ట మహాసభల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా సంఘం ప్రకటన చేసింది. ప్రజలు ఎక్కడ తమ స్వేచ్ఛ కోసం ఉద్యమిస్తారో అక్కడి వారికి అండగా ఉండటమే ‘అరసం’ ముఖ్య లక్ష్యమని సంఘం సభ్యులు చెబుతున్నారు. పెట్టుబడి, ప్రపంచీకరణకు వ్యతిరేకం గా వస్తున్న ఉద్యమాలకు ఆజ్యంపోస్తూ పీడిత ప్రజలకు అండగా రచనలు చేయాలని అరసం భావి స్తుందన్నారు. మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రచయితలు ఉద్యమ వ్యాప్తి కోసం సమా వేశాలు నిర్వహిస్తే అభ్యుదయ రచయితల సంఘం సభ్యులెైన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రచయితలు మద్దతుగా నిలిచారు. ‘అరసం’ భవిష్యత్‌ తరాలకు అభ్యుదయ రచనలు అందించి వారి భ్యున్నతికి తోడ్పడుతుందని భావిద్దాం.

rvraaప్రపంచీకరణ అనే ముసుగులో దేశ సంస్కృతిని, సాహిత్యాన్ని కనుమరుగు చేస్తుందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ‘అరసం’ భావిస్తుంది. కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు, గురజాడ, కాళోజి అందించిన సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్లు నిర్మించిన సాహిత్య పునాదులకు వామపక్ష భావజాలంతో ‘అరసం’ ముందుకెళ్తుందన్నారు. భవిష్యత్‌లో యువ రచయితలను ప్రోత్సహించడానికి సాహిత్య స్కూళ్లు, కార్యాగోష్ఠూలు జరపనున్నట్లు ‘అరసం’ ప్రకటించింది. ‘అరసం’ ఏర్పడి 76 వసంతాలు, ‘అరసం’ తెలుగు శాఖ ఏర్పడి 70 వసంతాలు పూర్తి అయ్యింది. అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆశిద్దాం.

అరసం ఆవిర్భావం సాంస్కృతిక వారసత్వాన్ని పదిలపర్చింది. మహారచయితలు శ్రీశ్రీ, కుటుంబరావు క్రియాశీల సభ్యులు కాకపోయినా..ఇక్కడ తాత్విక పునాది వేసేందుకు కృషి చేసింది వారే. శ్రీశ్రీ గేయం ‘ప్రతిజ్ఞ’ లండన్‌లో విడుదలెై భారత అభ్యుదయ రచయితల మ్యానిఫెస్టోని ప్రపంచానికి తెలియజేసింది. సాహిత్యాన్ని అంతఃపురాలు, రాజుల పోషణ నుంచి ప్రజాసామాన్యంలోకి తెచ్చి ప్రజల్ని చెైతన్యం చేయాలనేది శ్రీశ్రీ ఉవాచ. అయితే ఆ క్రమంలో భావకవిత్వం ఓ వెల్లువలా వచ్చి తనకంటూ ఓ పంథాలో వెళ్లింది. అయితే ‘అరసం’ ప్రత్యేకత వేరు. అది ప్రజాజీవితంతో ముడిపడి నది. అసలు అభ్యుదయ సాహి త్యం లేనట్టయితే ప్రేయసి మెల్లకన్నుపెై గీతాలు రాసుకునే వాళ్లమేమో! ఈ క్రమంలోనే ‘విరసం’ వచ్చి సాహిత్యంలో ఓ విభజన రేఖను సృష్టించింది. రాజకీయాలు-సాహిత్యం విడివిడిగా మారాయి. ఏదేమైనా సమాజ అసమానతలు తొలగించడానికి, జనం సౌకర్యంగా బతికే ఏర్పాటుకు ఓ సౌద్ధాంతికత అవసరం. దాన్ని తెచ్చింది అరసమే.

– ఆర్వియార్‌, ‘అరసం’ నాయకుడు

భారతీయ సాహిత్యంలో వాస్తవికత, సామాజిక చెైతన్యం, సమసమాజ నిర్మాణం అభ్యుదయ రచయితల సంఘం లక్ష్యం. అట్టడుగు ప్రజల జీవితాలను, అనుభూతులను, ఆకాంక్షలను, సాహితీ ప్రక్రియలుగా, కళారూపాలుగా రూపొందిస్తున్నది. అరసం 75వ వార్షికోత్సవం తెనాలి పట్టణంలో త్వరలో జరగనున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రమాదపుటంచులు తాకిన తెలుగు భాషను, విధ్వంసమౌతున్న మానవ సంబంధాలను, మార్కెటీకరించబడుతున్న కుటుంబ విలువలను, ధ్వంసమైపోతున్న సంసృ్కతిని పరిరక్షించేందుకు అభ్యుదయ రచయితలు కలాలను, గళాలను అంకితం చేయనున్నారు. పుస్తకాల ప్రచురణ, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యాన్ని బ్రతికించడమే అరసం భవిష్యత్‌ ప్రణాళిక.

– డా ఎస్‌.వి. సత్యనారాయణ, ‘అరసం’ నాయకుడు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top