You Are Here: Home » ఇతర » ప్రచురణలు

ప్రచురణలు

ఆ తరువాత ముంబాయిలోని నేచురల్‌ హిస్టరీ సొసైటీలో కొంత కాలం పనిచేశారు. కదలకుండా చేసే sunita3ఉద్యోగం ఈమెకు రుచించలేదు. అక్కడ్నించి ఢిల్లీ వెళ్లారు. 1982లో సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌ మెంట్‌లో కార్యకర్తగా చేరి, క్రమక్రమంగా డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. భారతదేశ పర్యావరణ సమస్యలమీద అభినివేశంతో అధ్యయనం చేయడం, ఇదే సమస్యపై వ్యాసాలూ విశ్లేషణాలూ రాయడంతో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభమయింది. తాను జర్నలిస్టుననీ, పర్యావరణ ఉద్యమ కారిణి అనీ ప్రకటించు కున్న సునీతా నారాయణ్‌ నీరు, పర్యావరణం, మానవ హక్కులు, ఆరోగ్యం, ప్రజాస్వామ్య విలువలు కోసం నిర్విరామ కృషి చేసారు.

శీతల పానీయాల్లో పురుగుల మందులు కలుపుతున్న విషయాన్ని బయట పెట్టిన వ్యక్తి సునీతా నారాయణ్‌. ఈ గుట్టు రట్టు చేసిన తర్వాత, ఆమె పేరు దేశప్రజల దృష్టిలో పడింది. ఈ కేసు గొప్ప సంచలనాన్ని రేకెత్తించింది. ప్రముఖ వార్తా పత్రికల్లోను, అన్ని టీవీ చానెళ్ళలోను పతాక స్థాయిలో ఈ వార్త దేశమంతటా మారుమోగింది. ఆ తరువాత టైగర్‌ టాస్‌‌క ఫోర్స్‌ సంస్థ ఏర్పడింది. సునీతా నారాయణ్‌ ఆ సంస్థకు చైర్‌ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి, ప్రజలను చైతన్య పరచడానికి అంకిత భావంతో కృషి చేస్తున్నారు.

నీటి వినియోగం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగంలో నీటిని పొదుపుగా ఏలా వాడాలో తెలుసుకునే పరిజ్ఞానాన్ని కలిగించడం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజస్థాపన, ఢిల్లీలో కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన సిఎన్‌జి విధానాన్ని దేశంలో ఇతర ప్రధాన నగరాలకు విస్తరింపజేయడం తమ ప్రధాన లక్ష్యాలుగా ఆమె చెబుతుంటారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో విభిన్న జీవన రంగాలలో నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యమ మేధావులు వందమందిని గుర్తించి, బ్రిటన్‌లోని ఒక అధ్యయన సంస్థ జాబితాను రూపొందించింది. అందులో ఆరుగురు భారతీయ మేధావులకు స్థానం లభించింది.

cvdఆ ఆర్గురిలో ఐదుగురు విదేశాలలో క్రియా శీలంగా పనిచేస్తున్న భారతీయులుకాగా, భారతదేశాన్ని తన క్షేత్రంగా ఎన్నుకున్న ఏకైక ఉద్యమకారిణి సునీతానారాయణ్‌. గత సంవత్సరం స్టాక్‌ హోమ్‌ సిటీ హాల్‌లో జరిగిన ఒక ఉత్సవంలో స్వీడన్‌ రాజు కార్‌‌ల ఎక్స్‌.వి.ఐ చేతుల మీదుగా 2005 ‘స్టాక్‌హోమ్‌ వాటర్‌ ప్రైజ్‌’ కింద లక్షాయాభైవేల డాలర్ల అవార్డునూ, స్ఫటిక శిల్పాన్ని సునీత అందుకున్నారు. స్టాక్‌ హోమ్‌ ఇంటర్నేషనల్‌ వాటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నెలకొల్పిన ఈ అరుదైన ప్రపంచ జల సత్కారాన్ని పొందిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్‌‌డ సృష్టించారు. నిజాయితీ, నిబద్థత, నిరాడంబరతలను తమ వ్యక్తిత్వంలో భాగంగా మలుచుకుని పురోగమిస్తున్న ఈ తరం పర్యావరణ ఉద్యమకారిణి సునీతానారాయణ్‌ నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

సునీత అంతర్జాతీయంగా అనేక సంస్థలకి తన సేవలు అందించడమే కాకుండా ప్రపంచదేశాల్లో తన పరిశోధ నాత్మకమైన అనుభవాన్నీ, ఆలోచనల్నీ క్రోడీకరిస్తూ ఎన్నో ప్రసంగాలు చేసారు. 2008లో ‘పర్యావరణ సిద్దాంతం యొక్క అవశ్యకత, పేద, సామాన్య జనాల్లో దీనిని ఎందుకు తెలియజేయాలి’ అనే అంశం మీద కె.ఆర్‌ నారాయణన్‌కు తెలియజేసింది. అకుంఠిత దీక్షతో పర్యావరణం, కాలుష్య రహిత వాతావరణం, స్వచ్ఛమైన నీటి వనరుల గురించే కాకుండా స్వచ్ఛమైన సమాజాన్ని కూడా ఈమె ఆకాంక్షిస్తోంది. గ్రామీణ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటే, ప్రజలు అంత అరోగ్యంగా ఉంటారని, తద్వారా దేశంలోని ప్రతి ప్రాంతం పర్యావరణ సంరక్షణ జరిగి అందరికీ మేలు జరుగుతుందని ఈమె ఎన్నో వ్యాసాల్లో రాయడం అందరికీ తెలిసిన విషయమే.

ప్రచురణలు
1989లో సహరచయితగా ఈమె పచ్చని గ్రామాలు అభివృద్ది చెందడానికి స్థానిక ప్రజాస్వామ్య సహకారం, అక్కడి ప్రజలందరి సహకారం అవసరం అనే నేపథ్యంలో ఒక గ్రంధాన్ని ముద్రించారు. 1991లో ప్రపంచంలో అస్తవ్యస్తమైన వాతావరణం వల్ల కలుగుతున్న గోబల్‌ వార్మింగ్‌ (భూగోళం వేడెక్కడం) గురించి వివరిస్తూ సహరచయితగా ఈమె మరో గ్రంధాన్ని వెలువరించారు. 1992లో పర్యావరణ నిర్వహణలో చట్టపరమైన విధానాలు, మానవహక్కులు ఉండాలా? అంటూ సహ రచయితగా గ్రీన్‌ వరల్డ్‌ గ్రంధాన్ని విడుదల చేసారు.
1997 క్యాటో ఒప్పందం ప్రకారం ఈమె సరళ పద్దతులు, వాతావరణ చర్చలు, హక్కుల నేపథ్యంలో ఎన్నో శీర్షికలు, నివేదికలు అందించారు. 2000లో స్వచ్ఛమైన రాజకీయ నేపథ్యంలో సహ సంపాదకురాలిగా మరో గ్రంధాన్ని అందించింది. ఇలా ఎన్నో ఈమె రచనలు ఆదరణని, గుర్తింపుని పొంది, పర్యావరణ పరిరక్షణ మీద ప్రపంచ దేశాల్లో అవగాహన కలగడానికి దోహదం చేస్తున్నాయి.

ప్రచురణలు">

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top