You Are Here: Home » సఖి » అందం » ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ పొందాలంటే!!

ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ పొందాలంటే!!

ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ పొందాలంటే!!

 

ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల ఫేస్‌ ప్యాక్‌లు లభిస్తున్నాయి. వీటిలో ఏది వాడాలో అర్థంకాని పరిస్థితుల్లో కొందరు మహిళలుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే తయారు చేసుకునే ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ వివరాలు…
ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌:
Faceరెండు చెంచాల చందనపు పొడి, ఒక చెంచా ముల్తానీ మట్టి, పది చుక్కల నిమ్మకాయ రసం, ఐదు బాదం పప్పులతో తయారుచేసిన పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసుకోండి. ఇందులో రోజ్‌ వాటర్‌ కలుపుకుని పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్ళకు పూయండి. ఇలా 15-20 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. దీంతో మీ చర్మకాంతి మరింత ఇనుమడిస్తుంది.

యాంటీ లూజ్‌ స్కిన్‌ ప్యాక్‌:
ఒక చెంచా పచ్చిపాలలో ఒక చెంచా బాదంపప్పుల పొడిని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ కు పూయండి. బాగా ఎండిపోయిన తర్వాత స్పాం జ్‌ను నీటిలో ముంచి ముఖం, మెడను శుభ్రపరచు కోండి. దీంతో చర్మం బిగుతుగా తయారై నిగనిగలా డుతుందని అంటున్నారు సౌందర్య నిపుణులు.చర్మం వదులుగా ఉన్నవారు ఇలాంటి స్కిన్‌ ప్యాక్‌ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top