You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » పౌష్టికాహారంతో ఆరోగ్యం

పౌష్టికాహారంతో ఆరోగ్యం

NewsListandDetailsఅందమే ఆనందం.ఆనందమే జీవిత మకరందం అన్న కవిమాటలు నిత్యసత్యాలు.మనస్సును చలాకీగా ఉంచుకొంటే మనిషిని వృద్ధాప్యం ఏమీ చేయలేదంటారు 112 సంవత్సరాల ఫ్రాంక్‌బెంట్‌కెలోవే.”వాట్‌యు ఈట్‌? వాట్‌ యు ఆర్‌ అన్నారో గొప్ప పరిశోధకుడు.  మన ఆరోగ్యం, మన ఆలోచనలు, మూడ్స్‌ మనం తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటాయని అనటంలో అతిశయోక్తి లేదు. విట మిన్సు, మినరల్సు, ప్రొటీన్లు (సమీకృత ఆహారం) తినేవారిలో ఆరోగ్యం బాగుంటుంది.
పుష్టికర ఆహారం తీసుకోవాలి
గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, పళ్లు, పాలు, పెరుగు, కూర గాయలు మీ ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారం ఎంత మితంగా ఉంటే అంత ఉత్తమం. ఆహరంలో నిత్యవిధిగా ఆకుకూరలు, పళ్లు, సలాడ్సు, మొలకలు, నట్సు తప్పక తీసుకోవాలి. లేదంటే ముప్ఫయిలోనే అరవై వయస్సు వచ్చినట్లు అకాల వృద్ధాప్యానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇరవై ఐదు సంవత్సరాలలో ముఖం పీక్కుపోయి, ముడతలు పడి, కళ్లు లోపలికి పోయి, ఎండిపోయిన పెదవ్ఞలు, ఓపికలేని నీరసం, ఇవన్నీ మిమ్మల్ని ఆవహించి మీ జీవితాన్నే కూల్చివేసే ప్రమాదం ఉంది. బట్టతల నెరసిన జుట్టు, కాళ్లలాగడం, ఇలాంటివన్నీ మీకు కల్గకుండా ఉండాలంటే ముఖ్యంగా ఐదు ముఖ్యమైన విషయాలు గుర్తుంచు కోవాలి. అకాల వృద్ధాప్యానికి బైబై చెప్పాలి. అందులో పుష్టికర ఆహారం గురించి తెల్సుకున్నాం కదా!
ఇటీవల ఎన్‌.ఐ.ఎన్‌ సంస్థ వారు సమీకృత ఆహారం, తగిన వ్యాయామం ఉంటే శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆహార విహారాల్లో ఆరోగ్య సూత్రాలు పాటించే వారిలో ఏజింగ్‌ ప్రాసెస్‌ త్వరగా వీరిలో ఆరంభం కాదు అని చెప్తున్నారు.
ఆకలికి ఏదో తినటం, రుచికీ ప్రాధాన్యత నివ్వకుండా మీ మీ శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించడం మీ కర్తవ్యంగా భావించాలి. మీ శరీరం ఏం చెబుతుందో ఓ పదినిముషాలు గ్రహిం చండి. ఆ పైన అలా నడుచుకోండి.
మానసికంగా చింతను తగ్గించు కోవడం. ”చితి మనిషిని మరణా నంతరం ఒక్కసారి కాలిస్తే. చింత మనిషిని నిత్యం కాలుస్తూనే ఉంటుంది. బాధ, చింత, సుఖం క్రమంగా మిమ్మల్ని డిప్రెషన్‌లోకి తీసుకువెళతాయి. ఆ డిప్రెషన్‌ కార ణంగా ఎన్ని వ్యాధులు, మరెన్నో అనారోగ్యపు బాధలు. మీ మైండ్‌ మీ బాడీలోని ఎన్ని ఫిజియాలాజికల్‌ ఫంక్షన్సును కంట్రోలు చేస్తుంది. ఆ మైండ్‌ బాధకు గురయితే ఆ ప్రభావం మీ శరరంపై పడుతుంది. అవయవాల ఫంక్షన్స్‌ మీద, మీ ఇమ్యూనిటీ వ్యవస్థమీద పడుతుంది. ఫలితంగా మానసికవ్యాధికి గురై మీలో ఏజింగ్‌ ప్రొసెస్‌ ర్యాపిడ్‌గా స్టార్ట్‌ అవ్ఞతుంది.
కానున్నది కాకమానదు. మీరు ఏదీ చేయలేనపుడు ఆలోచించి ఫలితం ఏమిటి? పోతూ ఏమి తీసు కువెళ్లలేము అన్న నిజం తెల్సినవారు టేకిట్‌ ఈజీ పాలసీని అవలంభించా రంటే నవ్ఞ్వతూ బ్రతకటం అలవాటు చేసుకున్నారంటే అకాల వృద్ధాప్యం మిమ్మల్ని అకాలంలో కబళించదు.
శరీరానికి వ్యాయామం తప్పనిసరి
ఆహారం ఎంత ముఖ్యమో శరీరానికి వ్యాయామం కూడా అంతే ముఖ్యం. మన శరీరాన్ని ఉపయోగించకపోతే కొంతకాలానికి దేనికీ పనికి రాకుండా పోతుంది. తొంభై ఏళ్లు జీవించిన వారి గత జీవితాన్ని మీరు తెల్సుకొంటే వారు అమితంగా శ్రమించిన వారే అయి ఉంటారు. శరీరంలోని సెల్యూలార్‌ వేస్టు బైటికి పోవడానికీ, మెటబాలిజమ్‌ హెల్దీగా ఉండేందుకు, శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఫ్యాట్‌ పేరుకోకుండా కాపాడుతుంది. యోగా, నడక, బ్రిస్క్‌ వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ లాంటివి విధిగా ఓ అరగంట సేపు చేయండి. వ్యాయామం, యోగ, ధ్యానం లాంటివి చేస్తే శరీరం నిత్య యవ్వనంగా తయా రవ్ఞతుంది. వయస్సు పై బడ్డా కుర్రవాళ్లలా పరుగులు తీస్తారు. ఈ అనుభవం అనుభించాల్సిందే కానీ, మాటలకు అందని అనుభవం.
ఇక మూడవది ఒత్తిడి
ఇది శరీరంపై భయంకరమైన దుష్ప్రచారాన్ని చూపుతుంది. చిన్న వయస్సులోనే వృద్ధాప్యం రావటానికి ముఖ్యకారణం స్ట్రెస్‌గా పరిగణించాలి. స్ట్రెస్‌ మిమ్మల్ని ఎంతగా వేధించినా, ఎప్పటికప్పుడు దాన్నుండీ బైటికి పడటానికి ప్రయత్నించండి. ఈ స్థితిలో శరీరానికి చాలా ఎనర్జీ అవసరం అవ్ఞతుంది. ఎక్కువ స్ట్రెస్‌తో ఉన్నవారు వెయిట్‌గెయిన్‌ అవ్ఞతారు. కొందరిలో నెర్వెస్‌ బ్రేక్‌డౌన్‌ అయి, ఇమ్యూనిటీ సిస్టమ్‌ దెబ్బతింటుంది. ఫలితంగా శారీరక రుగ్మత కూడా స్ట్రెస్‌కు తోడై అకాలవృద్ధాప్యానికి దారితీస్తుంది.
ఆరోగ్యానికి నిద్ర అవసరం
ప్రపంచ వ్యాప్తంగా 7,8గంటల సేపునిద్ర తప్పనిసరి. సగటు మనిషికి అన్న విషయం పరిశోధనలు వెల్లడిస్తున్న నిజం. అందుకే ఎనిమిది గంటలు నిద్ర మనిషికి అవసరం. మీకు నిద్రతో కలిపితే 60శాతం మీ ఇమ్యూనిటీ సిస్టం పనితనం డ్రాప్‌ అవ్ఞతుందని పరిశోధనలు స్పష్టంగా తేల్చిన విషయం. పుష్టికర ఆహారం, వ్యాయామం, నిద్ర, స్ట్రెస్‌ లేకుండా ఉండడం, ఆరోగ్య సూత్రాల్ని పాటించడం మరువకండి. వీటిలో ఏది లోపించినా కష్టమే.
ఇక మీరు విధిగా మానాల్సినవి. ఉప్పు, పంచదార, కారం, పులుపు వీలైనంత తక్కువగా వాడటం. నిల్వ ఉంచిన ప్యాకెట్‌ ఫుడ్స్‌ను వాడకపోవడం, కూల్‌డ్రింక్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌, బర్గర్లు. ఒక్కమాటలో చెప్పాలంటే మైదాతో చేసిన పదార్థాలు తినకండి. ఇంట్లో మీ చేతులతో ఆరోగ్యపరిసరాల్లో వండి, వేడిగా తినడం అలవాటు చేసుకోండి. నూనె, డాల్డాలను వీలైనంత తక్కువ వాడండి. ముడిబియ్యం, చక్కటి రసం, పప్పు, ఆకుకూరలే, కాయగూరలు చేర్చండి మీ ఆహారంలో. కాచి చల్లార్చిన నీటిని తాగండి. మీరు సగం వ్యాధులను నిర్మూలించి నట్లు, అలాగే మీ ఇంట్లో వేడివేడిగా వండి తింటే లేదా మీ కుటుంబ సభ్యులకు వడ్డిస్తే తొంభై శాతం రోగాలు లేనట్లే. ఓ పదిశాతం మీరు మీ రొటీన్‌ వర్కులో సక్రమంగా వినియోగించుకొంటే, రోగాలు లేని ఆరోగ్యమైన జీవితం అనుభవించినవారవ్ఞతారు.
మన సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ కూడా మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా జీవించడానికి రూపొందించినదే. పోతే నాగరికత పేరుతో, గొప్పకో, గత్యంతరం లేక, లేని రోగాన్ని ఆహ్వానిస్తున్నారు. భగవంతుడిచ్చిన దాంట్లోనే పచ్చడి మెతుకులతో ఆనందంగా జీవించే వారెందరో ఉన్నారు. వారికి ఆశలూ, ఆశయాలూ లేవా? ఉన్నాయి. వారి పద్ధతిలో వారు కృషి చేస్తుంటారు. వారికీ టైం వచ్చినపుడు ఆ కష్టానికి తగిన ఫలాన్ని అందుకొంటారు. అందుకే ఏదీ అతిగా ఆలోచిం చకండి. మీ కర్తవ్యాన్ని మీరు చేయండి. ఫలితం మాత్రం ఆ దేవ్ఞనికే వదిలేయండి. అన్నీ ఆయనే తప్పక చూసుకుంటాడు. ఆరోగ్యమైన ఆలోచనలను ఆహ్వానించండి. మీ రోజును అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా గడిపే ఆలోచన చేయండి. ప్రతీ సెకండు ఆనందంగా జీవించండి.

– పేకేటి గీతా శివరాం

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top