You Are Here: Home » ఇతర » పేలాలు టైం పాస్‌కి కాదు

పేలాలు టైం పాస్‌కి కాదు

పేలాలు అంటే సినిమా హాళ్ళల్లోను, పార్కుల్లోను కాలక్షేపానికి తినే పదార్ధాలే అనుకుంటారు చాలామంది. కానీ, ఇవి ఆరోగ్యానికి ఎంత దోహద పడతాయో చాలా కొద్దిమందికే తెలిసుంటుంద నడంలో ఆశ్చర్యం లేదు. పేలాలు ఏ విధంగా మనకి రక్షణ కల్పిస్తాయో ఒక్క సారి సింహావలోకనం చేస్తే…

మొక్కజొన్న పేలాలు:
2fillerమొక్కజొన్నగిజ లోపల 14 శాత నీరు ఉటుది. 400 డిగ్రీల వరకూ వేడిని ఈ గిజలకు ఇచ్చినప్పుడు గిజ లోపలి నీరు ఆవిరయి, వత్తిడి కలిగిచడతో గిజలో ఉన్న పిడిపదార్థ పేలి, దాని అసలు పరిమాణానికన్నా 40% ఎక్కువగా పువ్వులా విచ్చుకొటుదఇమెరికన్‌ రెడ్డిండియన్‌ జాతులవారు దేవతా విగ్రహాలను మొక్కజొన్న పేలాల దండలతో అంలకరిస్తారు. వాటిని ధరిచి నౄఎత్య చేస్తారు. బెల్ల పాక పట్టి ఉడలు చేసుకొటారట కూడా! వీటిలో ఫైబర్‌ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉటాయి. బి విటమినూ, ఇతర ప్రొటీన్లూ అధికం.

వరి పేలాలు:
వరి పేలాలు తియ్యగా, చలవచేసేవిగా ఉంటాయి. మలమూత్రాలు ఎక్కువగా కాకుండా కాపాడుతాయి. వాంతులు, విరేచనాలు, దప్పికలను తగ్గిస్తాయి. రక్తదోషాలను పోగొడతాయి.
పెసర పేలాలు:
పెసర పేలాలు విరేచనాలను నివారించి, నీటి శాతాన్ని తగ్గిస్తాయి. వాతాన్ని పెరగనీయకుండా కాపాడతాయి.
జొన్న పేలాలు:
తొలి ఏకాదశినాడు కేవలం జొన్న పేలాల పిండిని మాత్రమే తిని ఉపవాస చేసే ఆచారం సాంప్రదాయక కుటుబాల్లో కనిపిస్తుంది. చక్కెర వ్యాధిగ్రస్తులకి జొన్నపేలాలు వరప్రసాదం. స్థూలకాయం, జీర్ణకోశ వ్యాధులూ ఉన్నవారికి ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి.
రాగి పేలాలు:
రాగులతో పేలాలు కన్నడ వారికి బాగా అలవాటు. ఒక కప్పు రాగులకు నాలుగు చెంచాలు పెరుగు కలిపి ఆరగటసేపు ఆరనిచ్చి పేలాలుగా పేలుస్తారు. రాగి పేలాలను మిక్సీ పట్టిన పిండిలో కొబ్బరి తురుము, పాలు, పంచదార, నెయ్యి వగైరా కలిపి ఉండలు చేసుకొటారు. రాగి హురిహుట్టు అని పిలుస్తారు దీన్ని. ఇది ఆరోగ్యానికి చాలామంచి ఔషధంగా పనిచేస్తుంది. అజీర్తిని పూర్తిగా తగ్గించడంలో దీనికి ఇదే సాటి.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top