You Are Here: Home » చిన్నారి » పేపర్‌ను మొదట ఎప్పుడు తయారుచేశారు?

పేపర్‌ను మొదట ఎప్పుడు తయారుచేశారు?

పేపర్ తయారుచేసింది చైనా. 2000 ఏళ్లక్రితం చైనాలోని సైలన్ అనే వ్యక్తి ఓ నది ఒడ్డున గల మల్బరీ చెట్టులోని కొంతభాగం నీటిలో పడి దారాలుగా విడిపోయి ఉండటం గమనించాడు. గుజ్జులాంటి ఆ పదార్థాన్ని వెదురుకర్రలతో చేసిన చాప మీద పరిచి, ఎండలో ఉంచాడు.

గుజ్జులోని నీరంతా ఇంకిపోయి పలుచటి పొరలాగ పేరుకుంది. అదే మొట్టమొదటి కాగితం. అనంతరం కాగితం తయారీ కళ చైనాలోని వ్యాపారుల ద్వారా రష్యాకి, ఆ తర్వాత మధ్యప్రాచ్యదేశాలలోకి, అక్కడి నుంచి క్రమేపీ యూరప్ అంతటా వ్యాపించింది. పేపర్ తయారీ యంత్రాన్ని 1798లో ఫ్రాన్స్‌కి చెందిన లూయీస్ రాబర్ట్ కనుగొన్నాడు. దీనిని 19వ శతాబ్ది మొదట్లో లండన్‌కి చెందిన ఫోర్డీనియర్ బ్రదర్స్ అభివృద్ధి చేశారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top