You Are Here: Home » భవిత » విద్య » పేద విద్యార్థులకు పెన్నిధి ఎపిఆర్‌జెసి-ఆర్‌డిసి సెట్-2012

పేద విద్యార్థులకు పెన్నిధి ఎపిఆర్‌జెసి-ఆర్‌డిసి సెట్-2012

ప్రతిభ, తెలివి తేటలు ఉండి కూడా కేవలం పేదరికం కారణం గా ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని కోల్పోయే విద్యార్థు లకు ప్రభుత్వ పరంగా వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ వారు కూడా పై చదువులు చదివే అవకాశాలను కల్పిస్తున్న సంస్థలు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థలు. పదోతరగతి, ఇంటర్మీడియట్ స్థాయి వరకూ చక్కని ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన విద్యార్థులకు పై చదవులకు ఆర్థిక పరిపుష్టి లేదనే దిగులును దూరం చేస్తూ కార్పొరేట్ కళాశాలల స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్నాయి ఈ గురుకుల విద్యా సంస్థలు.అంతే కాదు ఈ విద్యాసంస్థలు ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులను ఆహ్వానిస్తు న్నాయి. అయితే దీనికి విద్యార్థులు చేయాల్సిందల్లా ఎ.పి.ఆర్.ఇ.ఐ.ఎస్ సంస్థ నిర్వహించే ఒక ప్రవేశ పరీక్షకు హాజరు కావాలి. విద్యార్థులు గురుకుల విద్యాలయాల్లో చదవకపోయినా సంబంధిత ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఈ విద్యా సంస్థల్లో ఇంటర్, డిగ్రీ సీట్లను పొందవచ్చు.

ఎవరు పోటీ పడవచ్చు?
2012 మార్చి/ఏప్రిల్‌లో జరుగుతున్న టెన్త్‌క్లాస్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఎపిఆర్‌జెసి ఎంట్రన్స్ పరీక్షకు పోటీపడవచ్చు. ఎపి.ఆర్‌జెసి ఎంట్రన్స్ పరీక్ష మే 4న జరుగనుంది. ఇటు ప్రవేశ పరీక్ష ఫలితాలు, అటు టెన్త్ క్లాస్ పరీక్షల రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాటి ఆధారంగా అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేసి ఎపిఆర్‌జెసి ఇంటర్ అడ్మిషన్లు జరుపుతారు. అయితే 2012 పదోతరగతి పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి. టెన్త్‌క్లాస్‌లో వెనకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాల్సి ఉండగా, ఓపెన్ కేటగిరి అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాలి. షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు మాత్రం పాసయితే చాలు. అయితే వీరందరూ ఎపిఆర్‌జెసి ఎంట్రన్స్ పరీక్షలో మెరిట్ మార్కులు సాధించటం తప్పనిసరి.ఇదిలా ఉండగా ఎపిఆర్‌డిసి ఎంట్రన్స్ పరీక్షకు, 2012 మార్చి/ఏప్రిల్ ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయిన అభ్యర్థులే పోటీపడాలి. ఇంటర్ ఇన్‌స్టంట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు అనర్హులు. డిగ్రీ కోర్సులలో ఎపిఆర్‌డిసి ఎంట్రన్స్ పరీక్ష మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయి. కర్నూల్‌లోని సిల్వర్ జూబ్లీ కాలేజీ, నాగార్జునసాగర్‌లోని ఎపిఆర్‌డిసి కాలేజీలలోని కోర్సులలో పురుషులకు మాత్రమే అడ్మిషన్లు ఉంటాయి. మహిళా అభ్యర్థులకు ప్రవేశం లేదు. డిగ్రీ కాలేజీ బోధన ఆంగ్లంలో ఉంటుంది.

ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుంది?
టెన్త్‌క్లాస్ స్టేట్ సిలబస్‌ను ఆధారంగా చేసుకుని ఎపిఆర్‌జెసి ప్రవేశ పరీక్ష సబ్జెక్టులు ఉంటా యి. ప్రవేశ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్, ఆబ్జెక్టివ్‌టైప్ పద్ధతిలో ఉంటుంది. ఓఎంఆర్ షీట్‌పై అభ్యర్థులు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ఉదా॥ ఎంపిసి కోర్సు కోరుకునే అభ్యర్థులు ఆంగ్లం, గణితం, భౌతిక, రసాయన శాస్త్రం సబ్జెక్టులలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆంగ్లం సబ్జెక్టుకు 30 ప్రశ్నలతో కలిపి ప్రతి సబ్జెక్టుకూ 40 మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కు లుంటాయి. అలాగే ఎపిఆర్‌డిసి ప్రవేశ పరీక్షలోనూ ఆంగ్లంకు 30 మార్కులు, ఇతర సబ్జెక్టులకు ప్రతి దానికీ 40 మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి.

80 వేల మంది పోటీ !
2012 ఎపిఆర్‌జెసి, ఎపిఆర్‌డిసి ఎంట్రన్స్ పరీక్షలకు 80 వేల మంది అభ్యర్థులు పోటీపడతారని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ, ఎపిఆర్‌జెసి-ఆర్‌డిసి సెట్ ఛైర్మన్ జి.గోపాల్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది జరిగిన ఎపిఆర్‌జెసి ఎంట్రన్స్ పరీక్షకు 60 వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారని, ఈ పరీక్ష మెరిట్ ఆధారంగా 2500 ఇంటర్ సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. అలాగే గతేడాది నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలోని 136 సీట్లకు వేల మంది అభ్యర్థులు పోటీపడ్డారని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం కర్నూల్ సిల్వర్ జూబ్లీ డిగ్రీకాలేజీలో 280 సీట్లకు జరిగే అడ్మిషన్ల కోసం ఎపిఆర్‌జెసి ప్రవేశ పరీక్షను తామే నిర్వహిస్తున్నామన్నారు.

ముఖ్యమైన తేదీలు
1.దరఖాస్తుల విక్రయం : 24-3-12 నుంచి 16-4-12
2.దరఖాస్తుల స్వీకరణ గడువు : 17-4-12 సా॥ 5 గం. వరకు
3.ప్రవేశ పరీక్ష తేదీ : 04-05-2012
4.దరఖాస్తు ధర : రూ.150
5.దరఖాస్తులు లభించు ప్రదేశాలు : ఎపి గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సిల్వర్ జూబ్లీ కాలేజీ – కర్నూల్, ఎపిఆర్‌ఇఐఎస్ సంస్థ, గగన్ విహార్,హైదరాబాద్ కార్యాలయం.వెబ్‌సైట్లు ః www.apresidential.gov.in, www.sjgckurnool.org.in

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top