You Are Here: Home » సినిమా » పాటలు » పెళ్లి చేసుకుందాం (1997)-కోకిల కోకిల కూ అన్నది

పెళ్లి చేసుకుందాం (1997)-కోకిల కోకిల కూ అన్నది

పల్లవి :
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ అన్నది
దేవత నీవని మమతల కోవెల
తలపు తెరిచి ఉంచాను
ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో
సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో ॥

చరణం : 1
గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మజన్మలందు నీడ కావా
లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా

చరణం : 2
వాలు కళ్లతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామా
వేళపాళలు ఏలనమ్మా
వీలులేనిదట్టులేదులేమ్మా
మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం
కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం
కలలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మా

చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997)
రచన : సాయి శ్రీహర్ష
సంగీతం : కోటి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top