You Are Here: Home » సఖి » అందం » పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే…

పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే…

పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే…

వేసవి మొదలైంది… హమ్మయ్య చర్మం పగుళ్లు తగ్గుతాయనుకుంటే పొరపాటే. పెదవుల పైన చర్మం పొరలుగా వచ్చేయడం. పగుళ్లు బారడం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. చర్మం సంరక్షణ కంటే పెదవుల సంరక్షణ వేసవిలో చాలా అవసరం. ముఖ్యం అందుకే పెదవుల ఆరోగ్యం కోసం చిన్న చిట్కాలు…

1. పెదవులు తడిఆరి పగుళ్ళు ఏర్పడుతాయి. 8,9 గంటలపాటు లిప్‌ స్టిక్‌ ఉంచుకుంటే పెదవులు పొడిబారతాయి. కాబట్టి లిప్‌ గార్డ్‌ గానీ, వాజలిన్‌ గానీ రాస్తే మంచిది.

2. లిప్‌ స్టిక్‌ పెదవులపై ఎక్కువ సేపు ఉండాలంటే అదిపెట్టుకునే ముందు పెదాలపై పౌడర్‌ గానీ, లైట్‌గా ఫౌండేషన్‌ గానీ వేసుకోవాలి. అప్పుడు లిప్‌ స్టిక్‌ పెట్టుకుంటే చాలా సేపటివరకూ పోకుండా ఉంటుంది.

3. మాయిశ్చరైజర్‌ లిప్‌ స్టిక్‌ పెదవులను మెరిసేలా చేస్తుంది.

4. పెదవులు నల్లగా అందవిహీనంగా ఉంటే బీట్‌ రూట్‌ ముక్కతో పెదవులను బాగా రుద్దితే మెరుపు సంతరించుకుంటాయి.

5. రోజూ పెదవులకు తేనె రాసుకుంటే అక్కడి చర్మం నుంచి తేమ వెళ్లిపోకుండా కాపాడుతుంది. పగిలిన పెదవులకు ఇన్‌ ఫెక్షన్‌ రాకుండా కూడా తేనె నివారిస్తుంది.

6. పెదవులపై ఆలివ్‌ అయిల్‌ని రోజుకి రెండుసార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

7. నిమ్మకాయ ముక్కతో పంచదారలో అద్ది పెదవులపై గుండ్రంగా రుద్దాలి. ఇలా పది నిమిషాలు పాటు చేసి చల్లని నీటితో కడిగేస్తే పెదవుల తేమ పోకుండా ఉంటుంది.

8. రాత్రి పడుకోబోయే ముందుగా కాటన్‌తో పెదవులను తుడుచుకుని కొబ్బరి నూనె లేదా వెన్నను వేలితో అప్లై చేసి రెండు మూడు నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే పెదాలు సున్నితంగా తయారవ్వడమే కాక… మెరుస్తుంటాయి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top