You Are Here: Home » సినిమా » పాటలు » పెదరాయుడు (1995)- బావవి నువ్వు భామని నేను

పెదరాయుడు (1995)- బావవి నువ్వు భామని నేను

పల్లవి :

బావవి నువ్వు భామని నేను
ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెలకాలం
నిద్దర కరువవనీ

కొత్తకోక కిర్రెక్కిపోనీ
సన్న రైక వెర్రెక్కిపోనీ (2)
కన్నెసొగసే దుమ్మిత్తిపోనీ

చరణం : 1

ఒంటరి ఒంటరి వయసు
తుంటరి తుంటరి మనసు
జంటను వెతికే వేళ ఇది
తొందర తొందర పడకోయ్
అల్లరి అల్లరి మగడా
రెక్కలు విప్పిన రాతిరిది
హోయ్… పైన చూస్తే తళుకుల తార
కింద చూస్తే వెన్నెల ధార
పక్కనున్నాయ్ ముద్దుల డేరా
సక్కగొచ్చి హత్తుకుపోరా
పడుచు ఒడినే పంచుకుపోరా

చరణం : 2

కత్తెర చూపులు కొడితే
సిగ్గులు వాకిట తడితే
ఉక్కిరిబిక్కిరి అయిపోనా
తత్తర తత్తర పడితే
ఠక్కున కౌగిలి విడితే
టక్కరిపిల్లా రెచ్చిపోనా
గువ్వ గుట్టు గోరింకకెరుక
పిల్ల బెట్టు పిల్లాడికెరుక
ఒప్పుకుంటే వయ్యారికూన
కురిసిపోదా ముత్యాలవాన
జంట తాళం చూడవే జాణ

చిత్రం : పెదరాయుడు (1995)
రచన : భువనచంద్ర
సంగీతం : కోటి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top