You Are Here: Home » చిన్నారి » పెంగ్విన్లు వేగంగా ఈదగలవా?

పెంగ్విన్లు వేగంగా ఈదగలవా?

పెంగ్విన్లు చాలా వేగంగా ఈదుతాయి. ఇవి గంటకు ఇరవై ఏడు కిలోమీటర్ల వేగంతో కూడా ఈత కొట్ట గలవు. అలా వేల మైళ్లదూరం ఈత కొడుతుంటాయి. పెంగ్విన్ల శరీరం భారీగా ఉంటుంది, కాబట్టి మిగిలిన పక్షులలాగా తేలిగ్గా ఎగరలేవు, కానీ నీటిలో చాలా సేపు ఉండగలవు. కొన్ని జాతుల పెంగ్విన్లు గంటల తరబడి నీటిలో గడుపుతుంటాయి. గుడ్లు పెట్టడానికి, ఈకలు రాల్చటానికి తీరానికి వస్తుంటాయి.
ఇవి ఈత కొట్టే వేగం సాధారణంగా గంటకు 15 నుంచి 24 కిలో మీటర్లు. ఇది ఒక మనిషి పరిగెత్తగలిగిన అత్యధిక వేగంతో సమానం. పెంగ్విన్లు లోతుగా డైవ్ చేయగలవు. అయితే ఒక్కొక్క జాతి పెంగ్విన్ వేగం ఒక్కోరకంగా ఉంటుంది. ఎంపరర్ రకం పెంగ్విన్లు 535 మీటర్లు (1755 అడుగులు), కింగ్ పెంగ్విన్లు 325 మీటర్లు (1059 అడుగులు), గెంటు పెంగ్విన్లు 210 మీటర్ల (688 అడుగులు) లోతు డైవ్ చేయగలవు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top