You Are Here: Home » సఖి » అందం » పువ్వులు, పండ్లతో…

పువ్వులు, పండ్లతో…

గుప్పెడు గులాబీలను పాలల్లో ఓ గంట సేపు నానబెట్టి తరువాత మెత్తగా రుబ్బుకుని అందులో అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి పూతలా వేసుకొని పది నిమిషాలయ్యాక కడిగేస్తే చర్మం తాజాదనంతో మెరుస్తుంది.

flow

  • పుచ్చకాయ ముక్కల్ని తేనెలో ముంచి ముఖానికి మర్దన చేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే మంచి మెరుపు కనిపిస్తుంది.
  • బంతి పువ్వుల్ని గుజ్జులా చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ప్యాక్‌లా వేసుకోవచ్చు. అయితే బంతిపువ్వులు తాజాగా ఉండాలి. ఈ పూతను వేసుకోవడం వల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకుని, ప్రకాశవంతంగా మారుతుంది.
  • కమలాఫలాల తొనల గుజ్జు తీసుకుని అందులో కీరదోస తురుము, నాలుగైదు చుక్కల నిమ్మరసం, చెంచా తేనె లేదా కలబంద గుజ్జు కలిపి ముఖానికి పూతలా వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్లమీద కూడా పెట్టుకోవచ్చు.
  • ఐదారు నల్లద్రాక్ష పండ్లు తీసుకుని ముఖ చర్మానికి రుద్ది, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
  • బొప్పాయిగుజ్జు, యాపిల్‌ గుజ్జు, అరటిపండు గుజ్జు, కమలాఫలం పూసలు చెంచా చొప్పున తీసుకుని అందులో అరచెంచా తేనె కలపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగినట్లైతే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top