You Are Here: Home » చిన్నారి » కవితలు » పులిలా బతకాలి!

పులిలా బతకాలి!

వాళ్ళు నిజంగా ప్రజాయుద్ధ వీరులే!
బానిసత్వాన్ని ధిక్కరించిన ధీరులు
తల్లిపాల భాష కోసం తండ్లాడిన తనయులు
పుట్టిన మట్టిలోనే ఆవరిస్తున్న చీకటి ఆధిపత్యంపై
తిరుగబడ్డ ఆరుద్ర పురుగులు
అస్తిత్వపు ఆయువునే ఆయుధీకరించిన ఈలంలు
మానవతను మింగుతున్న సింహాళపై గాండ్రించిన పులులు
మెడలో మృత్యువే బతుకు అలంకారమైన ఆత్మాహుతి
జాతి విముక్తికి ప్రాణమిస్తున్నవాళ్లు
నిజంగానే దేశభక్తులే!
ఆత్మాహుతి గద్దెపై రెపరెపలాడుతున్న
జాతి ఆత్మగౌరవ జెండాలు
బానిస బతుకుల స్వేచ్ఛకు శ్వాసనిచ్చిన చిరతలు
ఆ ముద్దు బిడ్డలకు యుద్ధభూమే కడదాక కన్న ఒడి
ఇవ్వాల్టి పులిసారుకలు రేపటి సూర్యోదయానికి పోరాట పాఠం
తిమిరాన్ని తరిమే నెత్తుటి త్యాగమే కొత్త వెలుగులకు ఊపిరి
బతుకంటూ బతికితే పులుల్లా బతుకాలిరా!
పెద్ద పులిలా పోరులో నడవాలిరా!
దోపిడీ పీడల విముక్తికి మన నేల పొత్తిళ్ళలో
గా పోరు ఇత్తులే సాలువోసుకుందం
బత్కినన్నాళ్ళాయే…సచ్చి బతుకుదాం
బతికి సచ్చుడు కన్న నయమే కదా!
వాళ్ళు నిజంగా ప్రజాయుద్ధ వీరులే!

మీ కవితలు, వ్యాసాలు
చివరి నెత్తుటి బొట్టు వరకు పోరాడిన
ఈలం పులులకు అంకితం


పంపవలసిన చిరునామా:
Editor, Surya, Surya Soudha, Plot.No.2-58/1/185,
Near Ayappa Society,
Chandanayak Thanda, Madhapur,
Opp: Cyber Towers, Hi-Tech City, Hyderabad – 57
‚yîTsTTýÙ: editpage@suryaa.com

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top