You Are Here: Home » ఇతర » పిల్లల పట్ల జాగ్రత్త

పిల్లల పట్ల జాగ్రత్త

ముద్దోచ్చే రూపం, లేలేత చర్మం, ముట్టుకుంటే కందిపోయే సున్నితత్వం పసిపిల్లల సొంతం. తల్లిదండ్రుల కలల రూపం అయిన చిన్నారి బుగ్గలు కందితే వారి మనస్సు విలవిల లాడుతుంది. చిన్నిచిన్ని చేతులపై పొలుసులు వస్తే అల్లాడిపోతారు.
755లేత నాజూకు చర్మానికి పాతపద్దతుల్లో సున్నిపిండి పెట్టాలా, ఆధునా తన పద్దతుల్లో వస్తున్న ఆయిల్స్‌ వాడాలా తెలియని అయోమ యం. చిన్నారి రూపం మరింత అందంగా ఉండాలంటే, ఎలాంటి చర్మసంబంధ సమస్యలు తలెత్తకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుల్లో నాజూకైన చర్మ సంరక్షణ ఏలా, ప్రతి చిన్న రాష్‌కు భయపడకుండా, అన్నింటినీ తేలికగా తీసుకోకుండా తల్లిదండ్రుల్లో అవగాహన ఎంతో అవసరం. చంటిపాప కోసం ఎలాంటి సబ్బు, షాం పూ వాడాలి, ఏది లేలేత చర్మానికి హాని కలిగించ కుండా ఆరోగ్యాన్ని అందిస్తుంది అనేది ప్రతి ఒక్కరిలో కలిగే సందేహం.

ఆరోగ్యకరంగా ఉండే పసిపిల్లల్లో వచ్చే రాష్‌ గురించి ఎక్కువగా ఆందో ళన అవసరం లేదు. అయితే తరుచుగా రాష్‌ రావడం, వచ్చిన రాష్‌ కొద్ది రోజుల వరకు అలాగే ఉండటం, రాష్‌ కారణంగా పిల్లలు ఇబ్బందిగా ఫీల్‌ అవడం గమనించి డాక్టర్‌ ను సంప్రదించాలి. ఆయిల్‌ మాసాజ్‌ పడని పిల్లలకు మెడికేటెడ్‌ క్రీమ్స్‌ డాక్టర్‌ సలహా మేరకు వాడాలి. అనవసరమైన ఆందోళనకు స్వప్తి పలికి చంటిబిడ్డకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ, పరిశుభ్రమైన దుస్తులను, నాణ్యమైన డయాపర్స్‌ను వాడాలి. చిన్న చిన్ని జాగ్రత్తలతో చంటి పిల్లల నాజుకు చర్మాన్ని మరింత అందంగా మార్చవచ్చు. అయితే ముందుగా ఏ నిర్ణయం తీసుకోవలన్నా పిల్లల డాక్టర్‌తో సంప్రదించి వారి సలహాలు పాటిస్తే చాలా ఉత్తమం. సొంత నిర్ణయాలు అనర్ధాలకు దారితీస్తాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top