You Are Here: Home » ఇతర » పిల్లల్లో వ్యాయామం

పిల్లల్లో వ్యాయామం

సాయంత్రం వేళలో స్కూలు నుంచి రాగానే పిల్లలను ట్యూషన్లకు పంపడం ఆనవాయితీ అయింది. రోజంతా పిల్లలు చదువు ధ్యాసలోనే ఉంటే మంచి ర్యాంకులు వస్తాయని తల్లిదండ్రులు అనుకోవడం సహజం. కానీ స్కూలు నుంచి వచ్చాక కాసేపు పిల్లలతో వ్యాయామం చేయించాలి.

ఆ తర్వాత వారికి ఎక్కువ పోషకవిలువలున్న ఆహారం ఇచ్చి ట్యూషన్‌కు పంపాలి. ఇలా అయితే వారు చదువులో ముందుంటారు. పిల్లలచే ఒక గంట యోగా, మెడిటేష న్‌ చేయించినా కూడా ఫలితం ఉంటుంది.

  • వ్యాయామం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
  • సాయంత్రం వేళలో పిల్లలచే వ్యాయామాలు చేయిం చడం వల్ల శారీరకంగా బలంగా తయారవు తారు. స్కూల్లో ఎక్కువసేపు కూర్చోడానికి శక్తి, సహనం పొందుతారు.
  • వీలుంటే ఉదయాన్నే కూడా వ్యాయామాలు చేయిం చడం మంచిది. దీనివల్ల మెదడు చురుగ్గా పనిచే స్తుంది.
    Kids
  • కొంతమంది పిల్లలు వయసుకు మించిన బరువు ఉంటారు. వాళ్లు ఏపని చేయాల న్నా చేయలేరు. బద్ధ కిస్తారు కూడా. ప్రతిరోజూ గంట వ్యాయామంతో బరువు తగ్గడమే గాక,ఉత్సాహంగా ఉండగలు గుతారు.
  • చదువుపెై పూర్తిస్థాయి ఏకాగ్రత పెరగాలంటే వ్యా యామం తప్పనిసరి. ఈ రోజుల్లో పిల్లలకు శక్తికి మించిన బరువును చదువు రూపంలో మోయవలసి వస్తోంది. చిన్న ప్పటి నుంచే ఐఐటి, మెడిసన్‌.. ఇతర ఎంట్రన్స్‌కు కోచింగ్‌ తీసుకుంటున్నారు. వా ళ్లు ఎక్కువసేపు అలసిపోకుండా చదవాలన్నా వ్యాయా మం చేయాల్సిందే.
  • అన్నింటికన్నా ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెరగాలన్నా, మెదడు చురుగ్గా పనిచేయా లన్నా తప్పనిసరిగా పిల్లలతో వాకింగ్‌, స్కిప్పింగ్‌ లాంటివి చేయించాలి.
  • చాలామంది పిల్లలు ఆహారం తీసుకునే విషయంలో చాలా మారాం చేస్తుంటారు. దీనికోసం తల్లిదం డ్రులు డాక్టరుకు చూపించి మందులు వాడటం మొ దలు పెడుతుంటారు. ఇలాచేయటం వలన పిల్లలకు సైడ్‌ఎఫెక్ట్‌‌స రావడం తప్ప ప్రయోజనం ఉండదు. పిల్ల లకు ఎక్కువగా మల బద్ధకం కూడా ఉంటుంది. అం దుకే వాళ్లకు ఎక్కువగా ఆకలి అవదు. దీనికోసం ప్రతిరోజూ తప్పని సరిగా వ్యాయామం చేయి స్తే మం చిది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top