You Are Here: Home » ఇతర » పిల్లల్లో చర్మవ్యాధులు

పిల్లల్లో చర్మవ్యాధులు

సాధారణంగా చిన్న పిల్లల్లో ఎరితిమా, ఎగ్జిమా, హెర్పిస్‌, సోరియాసిస్‌, అర్టీకేరియా, గజ్జి, తామర అనే వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల్లో సాధారణంగా చర్మంపెై నల్లమచ్చలు, ఎరమ్రచ్చలుగా, పొడగా లేదా కారడం, చర్మంపెై పొలుసుగా రావడం మొదలెైన లక్షణాలు ఆయా జబ్బులు బట్టి వస్తాయి. కొన్ని చర్మవ్యాధులు కొన్ని కొన్ని చోట్ల వస్తాయి. గజ్జి వ్యాధిలో చేతి వేళ్లలో, తొడ లోపలి భాగంలో, శరీరం ఇతర భాగాలలో వ్యాపిస్తుంది. ‘సొరియాసిస్‌’ లో పొలుసుగా పొడి చర్మం వస్తుంది. ‘ఎరితిమా’ వ్యాధిలో చర్మం ఎరబ్రడి దురదగా ఉంటుంది. అర్టికేరియాలో దద్దుర్లు వస్తాయి.

Kidsఒళ్లంతా రావచ్చును. విపరీతంగా దురద వస్తుంది. ఎగ్జిమా’ వ్యాధి ముఖ్యంగా కీళ్ల మలుపులో వస్తుం ది. పొట్ట, వీపు, కాళ్లు, చేతుల్లో, మెడ వద్ద వస్తుంది.
కారణాలు:
ఎలర్జీ వల్ల, వాతావరణ మార్పుల వల్ల, తినే వస్తువులలో కొన్ని పడకపోవడం వల్ల, శుభ్రత సరిగా లేకపోవడం వల్ల, వంశపారపర్యంగా, ఫంగస్‌ వల్ల మొదలెైన ఎన్నో కారణాల వల్ల మానసికంగా కుంగిపోవడం వల్ల కూడా చర్మవ్యాధులు ఎక్కువవుతాయి.

హోమియోపతి వెైద్యం:
1. ఆర్సనిక్‌ ఆల్బమ్‌:
ముఖంపెైన, తలలో పొడగా, పొలుసుగా చర్మవ్యాధి, పస లాంటి డిస్‌చార్జి ఉంటుంది. విపరీతమైన మంట, దురదలు ఉంటాయి. ఈ పిల్లలు చాలా నీరసంగా ఉంటారు. దాహం ఎక్కువ. చలి వాతావరణం పడదు. ఆందోళ న, భయం ఎక్కువ. అన్ని రకాల చర్మవ్యాధులకు ఇది ముఖ్యమైన మందు.
2. గ్రాఫెైటిస్‌:
ఎగ్జిమా, సోరియాసిస్‌ వ్యాధులకు ముఖ్యమైన మందు. ఈ పిల్లలు లావుగా, బొద్దుగా ఉంటారు. చర్మం మందంగా ఉంటుంది. నల్లని మ చ్చలు ఏర్పడతాయి. దురదగా ఉంటుంది. చర్మం నుండి కారడం ఉంటుంది. వీరికి మలబద్దకం ఎక్కువ. చర్మంలో పగుళ్లు ఉంటాయి.
3. హెపర్‌ సల్ఫ్‌:
తలో ఎగ్జిమాకు ముఖ్యమైన మంది. వీరు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. చర్మాన్ని ముట్టుకున్నా నొప్పిగా ఉంటుంది. జననాంగాల వ ద్ద ఎగ్జిమా, ఎరితిమా వ్యాధులకు ముఖ్యమైన మందు.
4. కాలమూర్‌:
ఎగ్జిమాకు ముఖ్యమైన మందు. ఇక్కడ తెల్లని డిస్‌చార్జి ఉంటుంది.
5. రస్‌టాక్స్‌:
‘అర్టికేరియా’కు ముఖ్యమైన మందు. చర్మం ఎరబ్రడి దద్దుర్లు వస్తాయి. దు రదగా ఉంటుంది. తేమ వాతావరణంలో ఎక్కువవుతుంది.
6. సల్ఫర్‌:
చర్మవ్యాధులకు ఇది సర్వరోగ నివారిణి లాంటిది. ఏ వ్యాధినెైనా సమూలంగా తొలగించుటకు ఒక స్టేజ్‌లో ఈ మందును ఇవ్వవలసి ఉంటుంది. వీరికి మలబద్దకం ఎక్కువ. పరిశుభ్రత తక్కువ. చల్లగాలి పడదు. రాత్రిపూట దురదులు ఎక్కువ. మంటగా ఉంటుంది. గోకితే ఉపశమనంగా ఉంటుంది. గజ్జి, తామరకు ముఖ్యమైన మందు.
7. ఆంటమొనియమ్‌ క్రూడ్‌:
సోరియాసిస్‌కు ముఖ్యమైన మందు. ఈ పి ల్లలు లావుగా ఉంటారు. తినడం ఎక్కువ. పని తక్కువ. సోమరిపోతులు. నాలుకపెై తెల్లని కోటింగ ఉంటుంది. వేడి వల్ల చర్మవ్యాధి ఎక్కువవుతుంది. ఇవే కాకుండా ఆర్సనిక్‌ అయోడ్‌, డల్‌కమరా, మెర్కూరియస్‌, నాట్రరిమూర్‌, బొవిస్టా, ఏపిస్‌, సెపియా, ఆర్టికా యూరెన్స్‌, మెజీరియం మొదలెైన హోమియోపతి మందులు వాటి రోగ లక్షణాలను బట్టి ఉపయోగించవచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top