You Are Here: Home » ఇతర » పిల్లల్లో గుండెజబ్బు

పిల్లల్లో గుండెజబ్బు

గుండెజబ్బు అనగానే భయపడనివారు ఉండరు. గుండె జబ్బు వచ్చిం దంటే మరణమే శరణ్యం అని చాలా మంది అనుకుంటారు. అయితే వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన ప్రస్తుత సమయంలో ఏ వ్యాధి కైనా వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే పిల్లల్లో వచ్చే గుండె జబ్బుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేనట్లయితే ఎదగాల్సిన పిల్లలకు ప్రాణహాని సంభవించే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని పెద్దలు గుర్తించాలి.

geta వైద్యశాస్త్రంఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సామా న్య ప్రజలందరికీ ఇంకా అందుబాటులోకి రాలేద నే చెప్పాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇం కా ఆధునిక వైద్యం అందుబాటులో లేదు. ఆధు నిక వైద్యానికి వెచ్చించాల్సిన ఖర్చుకూడా చాలా ఎక్కువ. అయితే పిల్లలకు వచ్చే గుండెజబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించా లని వైద్యులు అంటున్నారు.పుట్టిన పిల్లల్ని ఆందోళనకు గురిచేసే అంశం ఏంటంటే ప్రతి వందమంది పిల్లల్లో ఒకరికి గుండె జబ్బు వుం టోంది. ఈ లెక్కన గుండెజబ్బుతో బాధపడే పిల్లలు మన రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో ఊహించవచ్చు.

సాధారణంగా పుట్టే పిల్లల్లో గుండెలోని సిరలు, ధమనుల్లో వుండే లోపాలు, లేదా గుండెలోని జఠరికలు, కర్ణికల నిర్మాణంలో ఏర్పడే లోపాలు, కవాటాలలో ఏర్పడే లోపాల వల్ల గుండె జబ్బులు వస్తుంటాయి. ఇలా పుట్టిన పిల్లల్లో గుండె జబ్బు వచ్చిం దంటే వంశపారంపర్యం కాదు. ఎందుకంటే పెద్దవాళ్లకు గుండెజబ్బులు వున్నంత మాత్రాన పిల్లలకు కూడా గుండెజబ్బు రావాలని లేదు. వాతావరణంలో అసమతుల్యత, వైరస్‌ సంబంధం గానూ, క్రోమోజోమ్‌ల నిర్మాణం లో లోపాల వల్ల పుట్టిన పిల్లల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సాధా రణంగా గుండె జబ్బుల్ని బిడ్డలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే గుర్తించవచ్చు. లేదా ప్రస వించిన సమయంలోనూ గుర్తించవచ్చు.

వ్యాధి లక్షణాలు
గట్టిగా ఏడ్చినపుడు నీలిరంగులోకి ముఖం మారడం జరిగితే ఆ పిల్లవాడికి గుండె జబ్బు ఉన్నట్లుగా గుర్తించవచ్చు. పిల్లలకు తరుచుగా దగ్గురావడం, జలుబుతో ముక్కులు కారుతుండడం, పాలు తాగలేక పోవడం, అయాసపడుతుండడం, నుది టిమీద చమటపట్టడం, లివర్‌ పెరిగినట్లనిపించ డం, వంటి లక్షణాలతో వున్నప్పుడు వారికి గుండె జబ్బు ఉన్నట్లుగా గుర్తించవచ్చును. నిర్థారణ కోసం వెంటనే పరీక్షలు నిర్వహించాలి.గుండెపొరల్లో రంధ్రాలు ఏర్పడితే దాన్ని పిల్లలు పుట్టిన వెంటనే ఎకో పరీక్షల ద్వారా గుర్తించితే పెద్దగా ఆం దోళన చెందాల్సిన అవసరం లేదు.

పొరల్లో ఏర్పడిన రంధ్రాలు అనేకం వూడిపోతుంటాయ్‌.అయితే గుండె కం డరాల్లో ఏర్పడిన రంధ్రాలు పూడిపోవాలంటే తప్పని సరిగా ఆపరేషన్‌ చేయాల్సిందే. ఎందుకంటే ఈ రం ధ్రాలను మందుల ద్వారా పూడ్చలేం. వీటికోసం సర్క్యుటేనియస్‌ కార్డియాక్‌ సర్జరీ చేయాలి.పుట్టిన తొలివారంలోనే పిల్లల్లో గుండె జబ్బులకు సం బంధించిన లక్షణాలు కనిపించినట్లయితే ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించాలి. ఆరు వారాల తరువాత వీటిని తగిన సమయంలో గుర్తించగలిగితే వాళ్లు కొంతకాలం బతికే అవకాశం ఉంటుంది‚.

ఐదేళ్ల తరువాత ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే మధ్యలో ఇన్ఫెక్షన్‌ వల్ల వచ్చినదిగా భావించాలి. రంధ్రం వున్న పిల్లలకు వెంటనే ఆపరేషన్‌ చేసి రంధ్రాన్ని పూడ్చాలి.అయితే పిల్లవాడి ఆరోగ్య సామర్థ్యాన్ని బట్టి ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గుండె రంధ్రాన్ని మూసివేసేలా చేయడానికి ముందు అతని ఊపిరితిత్తుల సామర్థ్యం, బరువు, ఇతర ఇన్ఫెక్షన్‌ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ బాగుంటే వెంటనే సర్జరీ చేయాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top