You Are Here: Home » ఇతర » పిలిచిన పలికే దెైవం

పిలిచిన పలికే దెైవం

09asdజకీళ్‌వానం వెళ్లెన్ఱు ఎరుమై శిఱువీడు
మేయ్‌వాన్‌ పరన్దనకాణ్‌ మిక్కుళ్ళ పిళ్లైగళుమ్‌
పోవాన్‌ పోగిన్ఱారెై ప్పోగామల్‌ కాత్తునె్నై
కూవువాన్‌ వన్దువిన్ఱోమ్‌, కోదుకలముడెైయ
పావామ్‌ ఎళున్దిరాయ్‌ పాడిప్పఱైక్కొణ్డు
మావాయ్‌ పిళన్దానెై మల్లరెై మాట్టియ
దేవాది దేవనెై చ్చెన్ఱు నామ్‌ శేవిత్తాల్‌
ఆవా వెన్ణారాయ్‌ అరుళేలో రెమ్బావాయ్‌

తూర్పుదిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. తెల్లవారినది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి. మనతోటి పిల్లలు వ్రతస్థలమునకు వెళ్ళుటకై బయలుదేరిరి. అట్లు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు. కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని భావించి వారు వెళ్ళుచున్నారు. అట్లు వెళ్ళుచున్నవారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచియున్నాము. కుతూహము కల ఓ లనా! లేచి రమ్ము. శ్రీకృష్ణుని దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టియు ‘పర’యను సాధనము గ్రహించి కేశియను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లగొట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడెైన వానిని సమీపించి సేవించిన యెడల ఆతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలెనను కొనుచుండగా మీరే వచ్చితిరే అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొలుపుచున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top