You Are Here: Home » విశేషం » పిక్‌నిక్ బ్రిడ్జి

పిక్‌నిక్ బ్రిడ్జి

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ నుంచి అమీర్‌పేటకు వెళ్లే రోడ్డు ఉన్నట్లుండి పిక్‌నిక్ స్పాట్‌గా మారిపోవడం సాధ్యమా? ఊహించటానికే కష్టం కదూ..! కాని ఇంతకంటే రద్దీగా ఉండే ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జి మీద అది సాధ్యం అయింది. ఈ బ్రిడ్జి మీద రోజుకు లక్ష వాహనాలు వస్తూ పోతుంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఇనుప వంతెనగా దీనికి పేరుంది. అంత రద్దీ బ్రిడ్జి కాస్తా అక్టోబరులో ఓ రోజు రోడ్డుకు బదులు హోటలైపోతుంది. ఆ రోజు నల్లటి తార్రోడ్డు మీద పచ్చగడ్డి పరుచుకుంటుంది. డైనింగ్ టేబుళ్లూ ప్రత్యక్షమవుతాయి. బిలబిలమంటూ జనం వచ్చేస్తారు. కుటుంబంతో హాయిగా టిఫిన్లు చేస్తూనో, పిజ్జాలు, బర్గర్లు తింటూనో గడిపేస్తారు. ఎంత లేదన్నా ఏడువేల మంది ఆతిథ్యం పొందుతారు. రోడ్డును పిక్‌నిక్‌స్పాట్‌గా ఎందుకు మార్చారంటే- పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకట..! ఏటా ఆగస్టులో పబ్లిక్ బ్యాలెట్ ద్వారా లక్కీవిన్నర్స్‌ను ఎంపిక చేసి.. బిజీ బ్రిడ్జి మీద తినే భాగ్యం కల్పిస్తోంది అక్కడి ప్రభుత్వం. మనం రోజూ వచ్చిపోయే రోడ్డు మధ్యలో కూర్చుని తాపీగా తిండి తినడమంటే ఎవరికైనా థ్రిల్లే కదూ!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top