You Are Here: Home » ఇతర » పిక్కపిక్కకూ లెక్క

పిక్కపిక్కకూ లెక్క

ఏం చేస్తుంటారు అంటే అబ్బే నేను ఏ ఉద్యోగం చేయనండీ అని గృహిణులు చెబుతుంటారు. కానీ మన రాష్ట్రంలో చాలా మంది మహిళలు ఇంటి వద్ద చేసే పలు చిన్న చిన్న పనులు వారికి ఇంటి ఖర్చుల్లో సాయంగా, ఆ పరిశ్రల అభివృద్ధికి ఎంతో తోడ్పాడునందిస్తుంటారు. చింతపండు గింజ తీయడం, పూలు కట్టడం, బీడీలు చుట్టడం లాంటి పనుల ద్వారా రోజుకు 100 నుంచి 200లు సంపాదించే మధ్యతరగతి గృహిణులు ఎందరో ఉన్నారు. అనంతపురంలో చింతపండుపై ఆధారపడే వేల కుటుంబాలు బతుకుతున్నాయంటే అతిశయోక్తి కాదు. తెలంగాణలో బీడీలు చుట్టి కుటుంబాలను పోషిస్తున్న మహిళలు ఎక్కువే.

photo-4కరవున్న అనంతపురం జిల్లాలో రైతులు నాణ్యమైన పంటలు పండిస్తుంటారు. నాలుగు నెలల (జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌) చింతపండు సీజన్‌లో ఇంటిల్లిపాదీ కష్టించి ఏడాదికి సరిపడా గ్రాసం పొందుతున్న కుటుంబాలు అనేకం. ఈ చింతపండు ఉత్పత్తిలో మహిళల పాత్రే ప్రధానం. మహిళలే ఎక్కువగా కష్టపడుతారు. నాణ్యమైన చింతపండుకు హిందూపురం పరిసర మండలాలు ఎంతో ప్రసిద్ధి. అందులో చిలమత్తూరు పంచాయతీ తుమ్మలకుంట, కోడూరు పంచాయతీ సుబ్బరావు పేట, కొడికొండ, చిలమత్తూరు, చాగలేరు, తదితర గ్రామాలలో చాలా కుటుంబాలు చింతపండుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా తుమ్మలకుంట, సుబ్బరావుపేట గ్రామాలలో ప్రతి కుటుంబంలో ఇంటిల్లిపాదీ పనిచేస్తూ చింతపండును తెచ్చుకుంటారు.

పూతదశ నుంచే చింతకాయలను తీసుకోవడానికి కర్ణాటకలోని కోలార్‌ జిల్లా, చిక్‌బళ్లాపురం, గౌరిబిదునూర్‌, అనంతపురం, కర్నూల్‌ తదితర ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ చింతచెట్లను తీసుకుంటారు. అవి కాయలుగా మారి పండ్లయ్యే వరకు కాపాడుకుని తరువాత తెంపి ఇళ్లకు చేరుస్తారు. వాటిని ఇంటి వద్ద శుభ్రం చేసి గింజతీసి చింతపండు తయారుచేసి హిందూపురం, విజయవాడ, హైదరాబాద్‌, ఇటు కర్నాటకలోని పట్టణాల్లో విక్రయిస్తుంటారు. దక్షణ భారతదేశంలోనే చింతపండుకు హిందూపురం పెద్దమార్కెట్‌గా పేరు వుంది.

కరపుడికే అధిక డిమాండ్‌:గంగాధర్‌
photo-1చింతపండులో మేలి రకం కరపుడి. ఇది ప్రస్తుతం కేజీ రూ.80 వరకు వుంది. దీనిలో తెల్లదనం ఎక్కువగా ఉంటే ధర మరింత పెరిగే అవకాశం ఉంది.కుళ్లా (పూవుపండు) కేజీ రూ.35 వరకు ఉంది. చింతపండును ఒలిచిన తరువాత వచ్చే చింత విత్తనాలు కూడ కేజీ రూ.12 వరకు విక్రయిస్తారు. కొట్టిన పండును మార్కెట్‌ చేర్చడానికి రైతులు అందరు కలిసి వాహనం ఏర్పాటు చేసుకుని హిందూపురం మార్కెట్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి చెనై్న, బెంగుళూర్‌, కలకత్తాకే కాక బంగ్గాదేశ్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రతి ఏటా హిందూపురం మార్కెట్‌లో వందకోట్ల రూపాయల వరకు వ్యాపారం జరుగుతోంది. అందులో ఎక్కువ శాతం చిలమత్తూరు, లేపాక్షి మండలాల నుంచే వెళ్తుంది.

బీడీలు చుట్టడం
Beediముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బీడీలు చుట్టడం కుటీర పరిశ్రమలా వర్థిల్లుతోంది. యజమాని వద్దకు వెళ్లి తంబాకు, బీడీలో వాడే పొడి, దారం తెచ్చుకుంటారు. ఇంటి వద్ద జాగ్రత్తగా చుట్టి సాయంత్రానికి మళ్లీ యజమానికి అందజేస్తారు. దీని నిమిత్తం బీడీకి 10 నుంచి 25 పైసల వరకు తీసుకుంటారు. కుటుంబ ఆర్ధిక భారంలో భర్తకు చేదోడువాదుడుగా నిలుస్తుంటారు.

పూటు కట్టడం
Jasmine-(3)రాష్ట్రంలోని పూల వ్యాపారం కోట్ల రూపాయల్లో సాగుతోంది. ఎక్కువగా దండలు కట్టే విక్రయిస్తారు. ఈ దండలు కట్టడానికి ఎక్కువగా మహిళనే ఎంపిక చేసుకుంటారు. వీరికైతే డబ్బు తక్కువ ఇవ్వొచ్చు, శ్రద్ధగా పని చేస్తారు. ఉదయం పూలు, దారం ఇచ్చి పోయి సాయంత్రం దండలను లెక్కచూసుకుంటారు. మూరకు 10 నుంచి 25 పైసల వరకు లెక్కగట్టి ఇస్తుంటారు.

– డి.కె. శ్రీధర్‌, చిలమత్తూరు, మేజర్‌న్యూస్‌

కుటుంబంలో ప్రతి ఒక్కరూ పనిచేస్తుంటాం
నాలుగు నెలల సీజన్‌లో ఇంట్లోని పిల్లలు మొదలు పెద్ద, ముసలి అనే తేడా లేకుండా పనిచేస్తాం. కొంత మంది కూలీలను పెట్టుకుంటారు. చెట్ల నుంచి పొట్టు పండును దులపడానికి రూ.300 ఇస్తాం. ఇంటి వద్దకు వచ్చి చింతపండును కొట్టడానికి మహిళలకు రోజుకు రూ.100 వరకు ఇస్తుంటాం. ఇందులో మహిళలే ఎక్కువగా పనిచేస్తుంటార. కొంచెం ఓర్పుగా ఈ పనిచేయాలి.

రత్నమ్మ

మా కుటుంబాలన్నీ దీనిపైనే
hilamathuజిల్లాలో చింతపండుపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు దాదాపు 70వేల వరకు ఉంటాయి. అందులో హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. చిలమత్తూరు మండలంలో తుమ్మలకుంట, సుబ్బరావుపేట, కొడికొండ, చాగలేరు, చిలమత్తూరు తదితర గ్రామాల్లో దాదాపు 1500 కుటుంబాలు వరకు ఉంటాయి. ఏమైనా కరువు సీమలో వేలాది కుటుంబాలలో చింతపండు వ్యాపారంతో నిశ్చింతగా ఉంటున్నామన్నది వాస్తవం.

-గంగమ్మ

చేయూత అందించాలి
9,chilamathur,చింతపండుపై ఆధారపడే కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి వారికి పలు సౌకర్యాలు కల్పిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సోమశేఖర్‌ ఇక్కడ �చింతతో నిశ్చింత� అనే కార్యక్రమం పెట్టి వందలాది ఎకరాలలో చింతచెట్లను నాటించారు. అయితే అవి ప్రస్తుతం ఆనా పానా లేకుండా పోయాయి. ఉన్నతాధికారులు చొరవ చూపి చింతపండు పరిశ్రమను ఇక్కడ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం తలచుకుంటే చింతపండు వ్యాపారానికి దేశంలోనే మా ప్రాంతాలు మొదటి స్థానంలో ఉంటాయి.

-శివమ్మ

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top