You Are Here: Home » ఇతర » పార్టీ : పబ్‌

పార్టీ : పబ్‌

‘యువతకు ఎలాంటి వేడుకలెకైనా పబ్‌లు వేదికగా మారుతున్నారుు. సెలబ్రిటీల నుంచి సినీతారల వరకు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలను పబ్‌లలో నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరుపుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. నగర యువతరం అనుసరిస్తున్న కొత్త పంధాతో వీెకండ్గ్సతో పాటు మామూలు రోజుల్లో సైతం పబ్‌లు కళకళలాడుతున్నారుు. దీంతో నిర్వాహకులు ఇలాంటి పార్టీల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసి మరీరా రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఎంతో పేరు పొందిన డీజేలను సైతం తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. వీెకండ్గ్సలో భాగ్యనగరంలోని పబ్‌లు సందడిగా మారుతున్నారుు. ఎంత పని ఒత్తిడితో ఉన్నా ఎంజాయ్‌ ముఖ్యమంటూ వారు ఉల్లాసంగా గడుపుతున్నారు. శని, ఆదివారాల్లో వారికి ఇష్టమైన పబ్‌లలో స్నేహితులతో మజా చేస్తున్నారు. ఆ వివరాలు ఈవారం ‘స్టైల్‌’ లో మీకోసం…’

వారాంతాల్లో స్నేహితులతో ఉల్లాసంగా గడిపేందుకు నగర యువత పోటీపడుతున్నారు. తమకు ఇష్టమైన కబుర్లు చెప్పుకుంటూ వినసొంపైన సంగీతాన్ని ఆస్వాదించేందుకు ఉత్సాహం చూపు తున్నారు. పబ్‌కల్చర్‌కు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో నగరంలోని పలు పబ్‌లు వారిని ఆకర్షిం చేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా పేరుపొందిన డిస్క్‌ జాకీలను నగరానికి తీసుకువచ్చి మరీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో యువతరం తమకు ఇష్టమైన పబ్‌లలో ఉల్లాసంగా గడిపేందుకు ఉవ్విళ్లూరుతోంది.

భాగ్యనగరంలో పార్టీల జోరు…
భాగ్యనగరంలో ఇటీవలి కాలంలో పార్టీల సందడి పెరుగుతోంది. ఉన్నత వర్గాల వారు నిర్వహించే ఈ పార్టీలకు ప్రముఖ సెలబ్రిటీలు హాజరవుతుండడంతో వెరైటీగా కార్యక్రమాలు సాగుతున్నాయి. పార్టీల్లో ధరించేందుకు కొత్తరకం డ్రస్‌లను డిజైనర్లు రూపొందిస్తున్నారు. స్టార్‌ హోటళ్లతోపాటు పబ్‌లను కూడా ఈ పార్టీలకు వేదికగా ఎంచుకుంటున్నారు. పుట్టినరోజు, వివాహవేడుకలు, రిసెప్షన్‌లతో పాటు చిన్నపాటి సందర్భాలకు కూడా ప్రత్యేకంగా నిర్వహించడం పరిపాటిగా మారుతోంది. ఇక ఉన్నతవర్గాలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమానికైనా సెలబ్రిటీల తాకిడి పెరుగుతోంది. దీంతో నగర యువతీ, యువకులు మోడరన్‌ డ్రస్‌లపై మోజు పెంచుకుంటున్నారు. నలుగురి దృష్టిలో ప్రత్యేకంగా కనపడాలని కోరుకుంటున్నారు. దీంతో డిజైనర్లు ఎంతో కష్టపడి వెరైటీ పార్టీవేర్‌లను తీర్చిదిద్దుతున్నారు.

ఆకట్టుకుంటున్న పెళ్లి వేడుకలు…
ఇక పెళ్లి రిసెప్షన్‌ వేడుకల కోసం ప్రత్యేకంగా డిజైన్లు ముందుకువ స్తున్నారు. ఇక ఇలాంటి పార్టీల కోసం స్టార్‌హోటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విందు, వినోదం కోసం లక్షల రూపాయలు వెచ్చించి కళ్లు చెదిరే ఆకర్షణలను అద్దుతున్నారు.

వచ్చిన ఆహ్వానితులను అలరిం చేందుకు గానా బజానా కోసం కచేరీ లతోపాటు ఫ్యాషన్‌షోలను కూడా నిర్వహిస్తున్నారు. ఒక్క వేడుక కోసం లక్షల రూపా యలను ఖర్చు పెడుతు న్నారు. ఏదేమైనా ఈ పార్టీలతో ఎం తోమందికి ఉపాధి మాత్రం కలుగు తోంది. ఇక పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల్లో సైతం ఫ్యాషన్‌షోలు దర్శన మిస్తున్నాయి. నగరంలోని స్టార్‌ హోటళ్లలో జరిగే ఈ వేడుకలకు ఇవి అదనపు ఆకర్షణగా ఏర్పాటు చేస్తు న్నారు. లక్షల రూపా యలు వెచ్చించి మరీ ఈ షోలను నిర్వహిస్తుండడం విశేషం. భాగ్యనగరం లో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఫ్యాషన్‌ రంగంపై యువతీయువకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఏ రంగంలోనైనా సరే తమకు మంచి భవిష్యత్తు ఉంటేచాలన్న ధీమాతో యువతరం పరుగులు తీస్తోంది.

పబ్‌లలో డిస్క్‌ జాకీలదే హవా
Ujjwalడాన్స్‌ఫ్లోర్‌ దద్దరిల్లేలా యువతీయువకుల్లో హుషారెత్తించడం వారికి భలే సరదా. అసలు సమయమే తెలియ నివ్వకుండా సంగీతంతో గమ్మత్తయిన మత్తును అందించే నిషా వారిది.. విభిన్న రకాల ట్యూన్‌లను వెరైటీగా వినిపించి కుర్రకారులో ఆనందాన్ని పెంపొందించడం వారికి వెన్నతో పెట్టిన విద్య.. వారే డిస్క్‌ జాకీలు..చేతివేళ్లతో హుషారైన సంగీతాన్ని పలు రకాలుగా అందించి మెప్పించడమే వీరి ప్రత్యేకత..వీకెండ్‌లలో సెలబ్రిటీల సందడితో నైట్‌లైఫ్‌ పబ్‌లలోనే గడిచిపోతోంది. పార్ట్‌టైమ్‌గా కొంతమంది డిజెల అవతారమెత్తితో ఫుల్‌టైమ్‌గా ఇందులో ఉండేవారూ ఉన్నారు. భాగ్యనగరంలోని పబ్‌లలో, స్టార్‌హోటళ్లలో సంగీతంతో చిందులేయించేవారే డిజెలు ఇరవై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు స్థాయిని బట్టి డిజెలు వేతనాలను పొందుతున్నారంటే నమ్మాలి మరి. నగరంలో పెరుగుతున్న పబ్‌ కల్చర్‌కు అనుగుణంగా డిజెలకు కూడా మంచి డిమాండ్‌ ఏర్పడుతోంది. సరదాగా సాయంత్రం సమయాల్లో గడపాలనుకునే నగరవాసులకు వీరు మరింత ఆనందాన్ని పంచుతున్నారు.

పబ్‌లలో నిత్యం డీజేల సందడి…
డిజె పార్టీలు గతంలో ఏ కొత్త సంవత్సరం రోజునో, ప్రత్యేక సందర్భాల్లోనే కనిపించేవి. ప్రస్తుతం శని, ఆదివారాల్లో ఎక్కడ చూసినా డిజెల సందడే. ప్రతి పబ్‌లోనూ పేరుపొందిన డిజె ప్రదర్శనలను ఏర్పాటు చేసి యువతీ, యువకులను రా రమ్మని ఆహ్వానిస్తున్నారు. ప్రతి రాత్రి వసంతరాత్రి అని వారు ఉప్పొంగిపోయేలా వీకెండ్స్‌లో డిస్క్‌జాకీలు మధురానుభూతులను పంచుతున్నారు. నచ్చిన ఫుడ్‌, మెచ్చిన సంగీతంతో యువతను మైమరిపిస్తున్నారు.

పబ్‌ల నిర్వాహకులు హైదరాబాద్‌తో పాటు ముంబాయి, బెంగుళూరు నగరాలనుంచి ప్రత్యేకంగా డిజెలను నగరానికి తీసుకువచ్చి సెలబ్రిటీలకు సందడి చేస్తున్నారు. డిజె లేకుండా పుట్టినరోజు పార్టీలు కూడా జరగడంలేదు. డిజెలకు కూడా మంచి డిమాండ్‌ ఉండడంతో ఒక్కో ప్రాంతానికి వేళ్లేందుకు రానుపోను ఫ్లైట్‌ ఛార్జీలతో పాటు ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు పారితోషకాన్ని పొందుతున్నారు.

ప్రతి ఏటా డిజె వార్‌ కంటెస్ట్‌ల పేరుతో పలు సంస్థలు పోటీలను నిర్వహించి కొత్త డిజెలకు స్థానం కల్పిస్తున్నాయి. అన్ని రకాల సౌకర్యాలతో పాటు కోరుకున్న విధంగా ప్రొఫెషన్‌ ఉండడంతో యువతీ, యువకులు డిజె అవతారమెత్తుతున్నారు. జంటనగరాల్లోని పలు స్టార్‌హోటళ్లు, పబ్‌లలో చాలామంది డిజెలుగా పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల నంగరంలో నిర్వహించిన డిజె పోటీల్లో కూడా నగరానికి చెందిన యువత పెద్దసంఖ్యలో పాల్గొనడం విశేషం.

– ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ లైఫ్‌స్టైల్‌ ప్రతినిధి
rajeshiska@gmail.com
ఫొటోలు : కె. సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్‌ శరత్‌బాబు, ఎ. రమణాచారి

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top