You Are Here: Home » ఇతర » పారిశ్రామిక రంగంలో మహా రాజశ్రీ

పారిశ్రామిక రంగంలో మహా రాజశ్రీ

ఈమె తమిళనాడులో కోయంబత్తూరులో తెలుగు సంతతికి చెందిన వనిత. ఈమె 1957లో కోయంబత్తూరులోనే జన్మించింది. చదువు సంద్యలు అక్కడే పూర్తిచేసిన రాజశ్రీ పాతి, ట్రిడెంట్‌ షుగర్స్‌ లిమిటెడ్‌కు, రాజశ్రీ షుగర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌కు అధిపతిగా తనదెైన పారిశ్రామిక విధానంతో ఈ సంస్థల్ని అత్యున్నత స్థాయికి చేర్చింది.
కుటుంబము

02dheeraరాజశ్రీ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాతృత్వమునకు పేరొందిన . . గోవింద స్వామి నాయుడు వంశానికి చెందిన వరదరాజు కుమార్తె. తండ్రి వరదరాజు పార్లమెంటు సభ్యుడు. లక్ష్మీ మిల్స్‌కిి చెందిన పతి సుందరం ఈమె భర్త. రెండు కుటుంబాలు సహృదయానికి మారుపేరుగా ప్రజల్లో ఎంతో గౌరవ మర్యాదల్ని పొందాయి. ఆ కుటుంబంలో పుట్టిన రాజశ్రీ కూడా ఎంతో దాతృత్వంతో అడిగినవారికి లేదనకుండా సేవలు అందిస్తుంది. వంద సంవత్సరాలుగా ఈ కుటుంబం ఎన్నో చారిటీలు ఏర్పాటుచేసి, విద్యాసంస్థలు నెలకొల్పి ఎందరికో చేయూతనిస్తున్నారు. రాజశ్రీ కూడా ఆ చారిటీల ద్వారా ఇతోధిక సేవలందిస్తూ ఇటు పరిశ్రమని, అటు వాణిజ్య రంగాన్నీ కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది.

పరిశ్రమలు
31992లో తండ్రి మరణానంతరం బాధ్యతలు స్వీకరించి అతి కొద్ది కాలంలోనే కంపెనీని బహుముఖముగా విస్తరింప చేసింది. ఈమె సంస్థల గ్రూపులో చక్కెర, ఆల్కహాల్‌, విద్యుత్‌, బయోటెక్నాలజి, ప్రత్తి, రియల్‌ ఎస్టేట్‌, పర్యాటక రంగము ముఖ్యమైనవి. 1990లో 50 కోట్లతో మొదలెైన వ్యాపారము ప్రస్తుతము 300కోట్లకు విస్తరించింది. ఆర్‌ఎస్‌సిఎల్‌ బ్రాండ్‌తో సరఫరా అవుతున్న అత్యుత్త పంచదార రాజశ్రీ గ్రూప్‌ నుంచే ఉత్పత్తి అవుతుంది. దీని కేంద్ర కార్యాలయం కోయంబత్తూర్‌లో ఉండగా, చక్కెర తయారు చేసే కర్మాగారాలు ఒకటి తమిళనాడులో థెని జిల్లాలోని వరదరాజ నగర్‌లోను, వెల్లుపురం జిల్లాలో ముండియంబాక్కంలోను, మూడవది ఇదే జిల్లాలో గింగీలోను ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో మెదక్‌జిల్లా జహీరాబాద్‌లో కూడా వీరి చక్కెర కర్మాగారం ఉండటం విశేషం.

పడవులు, పురస్కారాలు
11

  • 2004-2005 సంవత్సరంలో భారత చక్కెర కర్మాగారముల సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకొనబడింది.
  • 2007-2009లో దక్షిణ భారత చక్కెర కర్మాగారాల సంఘమునకు అధ్యక్షురాలిగా సేవ చేసింది.
  • 1996 లో ప్రపంచ ఎకనామిక్‌ ఫోరం స్విట్జర్‌లాండ్‌ నుండి ‘రేపటి ప్రపంచ నేతలు’గా గుర్తింపుని పొందింది
  • 1996-1999 వరకూ వస్త్ర ఉత్పత్తులో సిఐఐ నేషనల్‌ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నుకోబడింది.
  • 2000 సంవత్సరపు ‘ది ఎసెన్‌హోవర్‌ ఎక్చేంజ్‌ ఫెలోషిప్‌’ ప్రభుత్వ అవార్డ్‌ పొందినది.
  • మహిళా సంఘము 2006 సంవత్సరపు పురస్కారము ఇచ్చి గౌరవించినది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top