You Are Here: Home » సినిమా » పాటలు » పవిత్రబంధం (1996)- కార్యేషు దాసి కరణేషు మంత్రి

పవిత్రబంధం (1996)- కార్యేషు దాసి కరణేషు మంత్రి

పల్లవి :
కార్యేషు దాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాతా శయనేషు రంభ
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

మగవాని బ్రతుకులో
సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా

చరణం : 1
పసుపుతాడు ఒకటే మహాభాగ్యమై
బ్రతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచికోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు
ఏ పూజ చేసినా ఏ నోము నోచినా
ఏ స్వార్థమూ లేని త్యాగం
భార్యగా రూపమే పొందగా

చరణం : 2
కలిమిలేములన్నీ ఒకే తీరుగా
కలిసి పంచుకోగా సదా తోడుగా
కలిసిరాని కాలం వెలే వేసినా
విడిచిపోని బంధం తనై ఉండగా
సహధర్మచారిణి సరిలేని వరమని
సత్యాన్ని కనలేనినాడు
మోడుగా మిగలడా పురుషుడు

చిత్రం : పవిత్రబంధం (1996)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కె.జె.ఏసుదాస్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top