You Are Here: Home » సినిమా » పాటలు » పల్లెటూరి బావ (1973)- ఒసే వయ్యారి రంగీ నా మనసే కుంగి

పల్లెటూరి బావ (1973)- ఒసే వయ్యారి రంగీ నా మనసే కుంగి

పల్లవి :
ఒసే వయ్యారి రంగీ నా మనసే కుంగి
పాడిందే కన్నీటి పాట
నా ఆశలారి నా రాత మారి
అయ్యిందే నా బతుకు బొమ్మలాట

చరణం : 1
ఆనాటి మా పెళ్లి మేళాలే
నేడు వినిపించే నాలోని వేదనలు
కన్నాను ఎన్నెన్నో తీయని కలలు
అవి కరిగి కురిసేను కన్నీళ్లు
మూణ్ణాళ్ళు చేశాను కాపురము (2)
మోశాను తీరని అవమానము
నా మనసు నా మమత తెగతెంచి
ఓ రంగమ్మా వెళ్లిందే ఇల్లాలు
వె ళ్లిపోయిందే ఇల్లాలు
॥వయ్యారి॥

చరణం : 2
నా కంటి వెలుగై వచ్చినది
నా ఇల్లు చీకటి చేసినది
కట్టిన తాళినే కాదన్నది
తన కడుపున నన్నే మోస్తున్నది
ముగిసిందిలే ఒక ఊరేగింపు (2)
ఇక మిగిలింది ఒక్కటే తుది పిలుపు
నా ఇల్లు నా కళ్లు వెలివేసి
॥రంగమ్మా॥॥వయ్యారి॥

చిత్రం : పల్లెటూరి బావ (1973)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : టి.చలపతిరావు
గానం : ఘంటసాల

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top