You Are Here: Home » ఇతర » పలికింది.. ఆకాశవాణి!

పలికింది.. ఆకాశవాణి!

ఆలిండియా రేడియో (ఆకాశవాణి) భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా) విభాగం.

AIRaఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం పార్లమెం టు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్‌ లో ఉన్నది. ఆకాశవాణి భవన్‌ లో నాటక విభాగం, ఎఫ్‌.ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. భారతదేశం లో మెదటి రేడియో ప్రసారాలు 1923 జూన్‌ లో రేడియో క్లబ్‌ ఆఫ్‌ బొంబాయి ద్వారా ప్రసారమయ్యాయి. దీని తరువాత బ్రాడ్‌ కాష్టింగ్‌ కంపెనీ ఏర్పాటైంది. ప్రయోగాత్మకం గా 1927లో జూలై 23న కలకత్తా, బొంబాయి నగరాలలో ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ ప్రసారాలు చెసింది. ఇండి యన్‌ బ్రాడ్‌ కాిస్టింగ్‌ కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేసింది.

1936లో ఆకాశవాణి ప్రభుత్వ సంస్ధగా అవతరించింది. అంతకిపూర్వం ప్రైవేటు రేడియో క్లబ్బులు ఉండేవి.భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చెసరికి 6 ఆకాశవాణి కేం ద్రాలు (కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, లక్నో, తిరుచిరా పల్లి) మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 అకాశ వాణి కేంద్రా లు 337 ప్రసారకేంద్రాల (144 కేంద్రాలు, 54 కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తో 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞా నాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్‌ ఎమ్‌ రేడియో చానెళ్లు అన్ని వర్గాల వారికీ శ్రవణానం దా న్ని కలిగిస్తున్నాయి.

రాష్టంలో ఆకాశవాణి ప్రసార కేంద్రా లు అదిలాబాదు, కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరా బాదు, అనంతపురం, కర్నూలు, కొత్తగూడెం, నిజామాబాదు, తిరుపతి, వరంగల్లులలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎఫ్‌ఎం పైఆకాశవాణి రెయిన్‌బో (హైదరా బాదు, విజయవాడ) కార్యక్రమాలు ప్రజాదరణ పొందుతు న్నాయి. విద్యా ప్రసారాలకై జ్ఞానవాణి కేంద్రం (హైదరాబాదు, విశాఖపట్నం, ఇతర ముఖ్య నగరాలలో) పని చేస్తున్నది.ప్రారంభం నుండి ఇప్పటి వరకు అకాశవాణి హైదరాబాద్‌ కేం ద్రం వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అనేకం.

శాస్ర్తీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యా సాలు, చర్చలు, గోష్టులు, పరిచయాలు, ఇంటర్వ్యూలు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. గ్రామ స్థులకు, స్ర్తీలకు, పిల్లలకూ, విద్యార్థులకు, కార్మికులకు, యువతరానికి ఇవి ఉపయోగపడుతుం టాయి. నాటికలు, నాటకాలు, రూపకాలు, మీరు కోరిన సినిమా పాటలు, శబ్ద చిత్రాలు, సినిమా నటీనటులు, దర్శకులు, నిర్మాతలు. సాంకే తినిపుణుల ఇంటర్వ్యూలు ప్రసారమవుతున్నాయి.
1938లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్ర మాలు ప్రారంభమైనప్పుడు తెలుగులో తొలి సారి తన వాణిని వినిపించిన మొదటి మహిళా అనౌన్సర్‌ భానుమతి. ఈమె కూతురు జ్యోత్స్న కూడా రేడియో అనౌన్సర్‌గా రిటైర్‌ అయ్యా రు. తెలుగులో మొదటి రేడియో నాటకం ’అనా ర్కలి’ మద్రా సు నుంచి1938 జూన్‌లో ప్రసారమైంది. విశ్వనాథ, వింజ మూరి నరసింహరావు, ముద్దుకృష్ణ సమర్పించి నటించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top