You Are Here: Home » చిన్నారి » పరుగులాంటి నడక అంటే ఏమిటి?

పరుగులాంటి నడక అంటే ఏమిటి?

మీరు టీవీలో ఆసియా క్రీడలు చూసే ఉంటారు. ఒలింపిక్స్ కూడా చూసి ఉంటారు. పరుగు పందాలు, నడక పోటీలు గమనించే వుంటారు. అయితే పరుగుకీ, నడక రేసింగ్‌కి తేడా ఏమిటి? శ్వాస ఎగ పీల్చటం, చెమటలు కారటం వంటి లక్షణాలను బట్టి నిర్ణయించే తేడాలు కావు ఇవి. పరుగుని పోటీల్లో గుర్తించటం సులభమే. శరీరాన్ని ముందుకు తోసుకుని వేగంగా పరుగె త్తటంలో పరుగును స్పష్టంగా గుర్తించవచ్చు. అయితే పోటీలో నడకను ఇంత సులువుగా గుర్తించలేం. పోటీలో పాల్గొన్నవారు మరీ జాగ్రత్తగా నడవ వలసి ఉంటుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నడిచేప్పుడు నేలను ఒక పాదం తాకుతూనే ఉండాలి. అదీ ఒక పాదం నేల మీద నుంచి పైకి లేపే లోపే రెండో పాదం పూర్తిగా నేలను తాకాలి. మరో నిబంధన ఏమిటంటే అడుగు వేసిన ప్రతిసారీ కాలు నిటారుగా ఉండాలి. అంటే మోకాలును మడవడం, వంచటం చేయకూడదు. అందుకే నడక పోటీలో పొల్గొనేవారు ఎక్కువ ప్రయాసతో వేగంగా కదులుతుంటారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top