You Are Here: Home » భవిత » విద్య » పరిష్కారం చూపే ప్రక్రియ

పరిష్కారం చూపే ప్రక్రియ

కౌన్సెలింగ్‌ కౌన్సెలింగ్‌ అనే పదాన్ని మనం అనేక సంద ర్భాలలో వింటూనే ఉంటాం. ఇటీవలి కాలంలో కొన్ని రకాల వ్యాధులకు చికిత్సగా కౌన్సెలింగ్‌ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.ముఖ్యంగా పలు మానసిక సమస్యల విషయంలో కౌన్సెలింగ్‌ తీసుకోవాలనే అంశం ప్రస్తావనకు వస్తుంటుంది. అలాగే టివి ఛానెళ్లలో ఏ అంశంపై చర్చా కార్యక్రమం ప్రారం భమైనా అందులో కౌన్సెలింగ్‌ సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అది అత్యాచారం కావచ్చు.విద్యార్థులపై పడుతున్న ఒత్తిడి కావచ్చు. మద్యపానం కావచ్చు. కుటుంబ సమస్యలు కావచ్చు. ఇలా ఏ చర్చా కార్యక్రమమైనా చివరకు కౌన్సెలింగ్‌ చేయడం అవసరమనే సూచనతో ముగుస్తుంది.
ఇలా రకరకాల సందర్భాలలో కౌన్సెలింగ్‌ అనే పదం వినిపిస్తుండటంతో ప్రజలకు నిజానికి కౌన్సెలింగ్‌ అంటే ఏమిటనే సందేహం కలుగక మానదు. కౌన్సెలింగ్‌ అనే ఈ పదానికి అనేక అర్థాలు, అన్వయాలు ఉన్నట్లు అర్థమవుతోంది.
సాంఘికపరమైన, మానసికమైన, శారీరకమైన ఒక సమస్యను పరిష్కరించడానికి ఉపకరించే మహిమ కలిగిన తాయెత్తు లేదా మంత్రం కౌన్సెలింగ్‌ అనే అభిప్రాయం సాధారణ జనంలో కనిపిస్తుంది.
గతంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు కావడంతో పెద్దల అండ ఉండటం, సమస్యలు వచ్చినప్పుడు వారి సలహాలతో వాటిని పరిష్కరించుకోవడం జరిగేది.
ప్రస్తుతం చిన్న కుటుంబ వ్యవస్థలు అధికమయ్యాయి. భార్య, భర్త, ఇద్దరో ముగ్గురో పిల్లలతో ఉండే కుటుంబంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సలహా ఇవ్వడానికి పెద్దలెవరూ అందుబాటులో ఉండకపోవడంతో ఎంత చిన్న సమస్య అయినా సరైన సలహాలు, మార్గదర్శకత్వం లోపించి పరిష్కరించు కోలేనంత పెద్దదిగా కనిపించడం ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దలు నిర్వహించే సలహాలు, సూచనలు ఇచ్చే సంప్రదాయం వత్తిపరమైన కౌన్సెలింగ్‌ విధానంగా రూపొందింది. అయితే వృత్తిపరమైన కౌన్సెలింగ్‌ పూర్తిస్థాయిలో పెద్దల మార్గదర్శకత్వంగా మాత్రం కనిపించదు. నిజానికి కౌన్సెలింగ్‌ అంటేఏమిటి? సమస్యలలో ఉన్న వ్యక్తి చెప్పేఅంశాలను సానుభూతితో విని, అవసరమైన సూచనలు చేయడం. ఇలా కౌన్సెలింగ్‌ చేస్తున్న వ్యక్తిని కౌన్సెలర్‌ అని వ్యవహరిస్తాం. వీరు తమ వద్దకు వచ్చే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచాలి. అంతే కాకుండా, ఆయా వ్యక్తులపై లేదా సమస్యలపై ఎలాంటి ముందస్తు అభిప్రాయాలను ఏర్పరచుకోకుండా ఉండాలి. అలాగే కౌన్సెలింగ్‌ కోసం వస్తున్న వారివిషయంలో ఎలాంటి తీర్పులు చెప్పకూడదు.
ఉదాహరణకు మద్యపానానికి బానిస అయిన వ్యక్తికో, లేదా హింసాత్మకగుణం కలిగిన వ్యక్తికో కౌన్సెలింగ్‌ చేయాల్సిన సమయంలో వారిపై కోపం రావడమో, సానుభూతి కలగడమో సహజమే. అయితే, ఇటువంటి సమయంలో కౌన్సెలింగ్‌ చేస్తున్న వ్యక్తి రోగి సమస్యలను సావకాశంగా వింటూ ఆ వ్యక్తికి జీవితంపై అనురక్తి కలిగించే విధంగా ప్రవర్తించాలి.
అన్ని రకాల సమస్యలకు కౌన్సెలింగ్‌ సమాధానం కాదు. అనేక సమస్యలకు కౌన్సెలింగ్‌లో తగిన తరుణోపాయం లభించదు. జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదు. ఇటువంటి సమయాల్లో కౌన్సెలర్‌ తన వద్దకు వచ్చిన వ్యక్తికి కౌన్సెలింగ్‌ పరిధిని వివరించి చెప్పి ఆ వ్యక్తిని అంగీకరింపజేయడం ఉత్తమమైన విధానం.
తమ సమస్యలకు అతి సులభమైన, పటిష్టమైన, వెన్వెంటనే పరిష్కారం లభించాలని ఆశించకుండా, వాటి పరిష్కారం కోసం తమ వంతు కషి చేసే వ్యక్తులకు మార్గదర్శక ప్రక్రియగా ఉపకరిస్తుంది.
భావోద్రేకపరంగా నిరాశా నిస్పహలతో క్రుంగిపోయే వారిని తిరిగి సాధారణ స్థాయికి తీసు కురావడానికి ఉపకరించే అద్భుతమైన ప్రక్రియ కౌన్సెలింగ్‌. కౌన్సెలింగ్‌ అంటే కేవలం సల హాలు, సూచనలు చేయడం, సమాచారాన్ని అందించడమే కాదు. ఒక వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి వీలుగా సహకరించడం కౌన్సెలింగ్‌.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top