You Are Here: Home » ఇతర » పన్నీర్‌ బ్రెడ్‌

పన్నీర్‌ బ్రెడ్‌

ఇవి కావాలి:

శాండ్‌విచ్‌ బ్రెడ్‌ ముక్కలు	: పది
Paneaపనీర్‌ : వంద గ్రా.
ఉల్లిపాయ : ఒకటి
కారం : ఒక టీ.
అల్లం వెల్లుల్లి : అర టీ.
శెనగపిండి. : వంద గ్రా.
ఉప్పు : తగినంత
మంచినీళ్లు : ఒక కప్పు
నూనె : సరిపడా
గరంమసాలా : ఒక టీ.

ఇలా చేయాలి:
ఉల్లిపాయ, పనీర్‌లను విడివిడిగా సన్నగా తరగాలి. బాణలిలో ఒక టీస్పూన్‌ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కల్ని వేసివేయించాలి. పన్నీర్‌, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. బ్రెడ్‌ ముక్కల అంచులు తీసేసీ.. త్రికోణాకారంలో కట్‌ చేసుకోవాలి. విడిగా చిన్న గిన్నెలో చిటికెడు ఉప్పు, కొద్దిగా బియ్యపిండి, తగిన నీళ్లు పోసి గట్టి పేస్టులా చేసి పన్నీర్‌ ముక్కల మిశ్రమంలో కలపాలి.కత్తిరించిన ఓ బ్రెడ్‌ముక్కను తీసుకుని దాని మీద ఈ మిశ్రమాన్ని పలుచగా పూసి పెైన మరో బ్రెడ్‌ ముక్క పెట్టి శాండ్‌విచ్‌లా తయారుచేయాలి. ఇలా మొత్తం బ్రెడ్‌ముక్కలని చేసుకుని.. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె కాగాక బ్రెడ్‌ ముక్కలను వేసి ఎరగ్రా వేయించి తీసేయాలి. అంతే పనీర్‌ బ్రెడ్‌ రెడీ.. ! వీటిని టమాటో సాస్‌ లేదా చింతకాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top