You Are Here: Home » ఇతర » పది కాలాలపాలు ‘చెప్పు’కోండి

పది కాలాలపాలు ‘చెప్పు’కోండి

shuesహాబీలు చాలామందికి ఉంటాయి. కానీ కొందరి హాబీలు ఔరా..! అనిపించినా, వేలంవెర్రిగా కూడా అనిపిస్తుంది. అందుకు కాలిఫోర్నియాకి చెందిన 57 ఏళ్ళ డార్లినీ ఫ్లిన్‌ అనే ఈ మహిళామణే నిలువెత్తు సాక్ష్యం. ఇంతకీ ఈమె హాబీ ఏమిటో చెప్పలేదు కదూ..! ఈవిడకి చెప్పులంటే మహా ఇష్టం. రకరకాల మోడల్స్‌ చెప్పులు కొనడమే కాకుండా ఇంట్లో ఫర్నిచర్‌, మరికొన్ని ఆబ్జెక్ట్‌‌స చెప్పుల మాదిరిగా కూడా తయారుచేయించుకుంది. ఆ విషయం ఎలా ఉన్నా ఈమె పోగేసి దాచుకున్న చెప్పుల సంఖ్య చూస్తేనే మనకి కళ్ళు తిరుగుతాయి. ఈమె ఇంట్లో 16,400 చెప్పుల ‘జతలు’ దర్శనమిస్తాయి. వాటికోసం ఒక ప్రత్యేక గది ఏర్పాటుచేసి అందులో అలంకరించింది.

2006లో కేవలం 7,765 చెప్పులు జమచేసినందుకే రికార్డ్‌ కెక్కింది. ఇప్పుదు ఆ సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగానే ఉంది. వీటికోసం ఫ్లిన్‌ అక్షరాలా 316,000 పౌండ్ల ధనాన్ని ఖర్చుపెట్టింది. అఫ్‌కోర్స్‌ అంత డబ్బు పెడితే చెప్పుల కంపెనీయే పెట్టుకోవచ్చు కదా..! అనే తెలివెైన ఆలోచన మనకొచ్చినా, ఆవిడకి రావద్దూ..!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top