You Are Here: Home » చిన్నారి » పక్షుల గుడ్లన్నీ ఒకేరంగులో ఉండవా?

పక్షుల గుడ్లన్నీ ఒకేరంగులో ఉండవా?

సాధారణంగా పక్షుల గుడ్లు తెలుపు రంగులోనే ఉంటాయి. కానీ కొన్ని జాతుల పక్షి గుడ్లు ఇంద్రధనుస్సుతో పోటీపడే విధంగా రకరకాల రంగులలో కూడా ఉంటాయి. రాబిన్ పక్షి గుడ్లు నీలిరంగులో ఉంటాయి. దీనికి కారణం మూడు రకాల పిగ్మెంట్లు.

ప్రోటో పోరిఫిరిన్ అనే పిగ్మెంట్ పసుపురంగుతో పాటు ఎరుపు, గులాబీ, గోధుమ రంగులు ఏర్పడటానికి కారణం అవుతుంది. బైలీ వర్డిన్, జింక్ చిలేట్ అనే పిగ్మెంట్‌ల వల్ల నీలం, ఆకుపచ్చ రంగులు ఏర్పడతాయి. ఈ పిగ్మెంట్‌ల నిష్పత్తి మారుతూన్నప్పుడు మిగిలిన వర్ణాలు ఏర్పడతాయి.

ఈ రంగులు ఏర్పడంపై జన్యుపరమైన ప్రభావం కూడా ఉంటుంది. తల్లి పక్షి ద్వారానే గుడ్లకు రంగుల్ని కలగచేసే జన్యువు సంక్రమిస్తుంది. తల్లి పక్షిలో ఉండే డబ్ల్యూ, జెడ్ క్రోమోజోముల్లో డబ్ల్యూ క్రోమోజోమ్ ద్వారా ఇది జరుగుతుంది. మగపక్షుల్లో మాత్రం జెడ్ క్రోమోజోములు ఉంటాయి.

కొన్ని పక్షుల్లో ముందుగా పెట్టిన గుడ్ల కన్నా ఆ తర్వాత పెట్టిన గుడ్ల పైన మచ్చలు, గీతలు కన్పిస్తాయి. తల్లి పక్షుల్లో క్యాల్షియం నిల్వలు తగ్గటమే ఇందుకు కారణం. గుంపులుగా గూడు కట్టుకునే కొన్నిరకాల పక్షుల్లో తల్లి పక్షులు వాటి గుడ్లలను గుర్తించడం కోసం రకరకాల గుర్తులు ఉంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top