You Are Here: Home » చిన్నారి » ‘పక్షులు దివ్యమైన సరీసృపాలు’ అని ఎందుకు అంటారు?

‘పక్షులు దివ్యమైన సరీసృపాలు’ అని ఎందుకు అంటారు?

సరీసృపాలు, పక్షులు రెండూ ఒక వర్గానికి చెందినవి కావు. కానీ ఒక శాస్త్రవేత్త పక్షులను దివ్యమైన సరీసృపాలు అన్నాడు. అలా ఎందుకు అన్నాడో తెలుసుకుందాం. చార్లెస్ డార్విన్ రచించిన ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ 1859లో ప్రచురితమైన తర్వాత పక్షుల పుట్టుక గురించి అధ్యయనం ప్రారంభం అయింది. థామస్ హెన్రీ హక్స్‌లే శాస్త్రవేత్త కూడా పక్షుల పుట్టుకపై అనేక పరిశోధనలు చేశాడు.

ఆయన పక్షులకు సరీసృపాలకు కొన్ని లక్షణాలు ఒకేలా ఉన్నాయని చెప్పాడు. పక్షులకు, సరీసృపాలకు మధ్య అనుసంధానజీవి అయిన ఆర్కియాప్టెరిక్స్ అనే జీవి శిలాజాన్ని ఆయన చాలాకాలం పాటు అధ్యయనం చేశారు. పక్షులు… సరీసృపాలను నుంచి ఉద్భవించాయని పేర్కొన్నాడు. సరీసృపాల కన్నా పక్షులు మెరుగైన స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని దివ్యమైన సరీ సృపాలని ఆయన భావించాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top