You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » నో టెన్షన్‌

నో టెన్షన్‌

ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి విని పిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చే సరికి నియంత్రణ చేయాలి.

చిన్నప్పువు ఇష్టంగా తిన్నామని… పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదర దు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమ తుల ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువశాతం ఒత్తిడికి గుర య్యే విషయంలో పురుషుల కన్నా మహిళలే ముందు వరుసలో ఉంటున్నారని ఇటీ వల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే వైద్యుల వద్దకు వెళ్లి సైడ్‌ ఎఫెక్ట్‌‌స కలిగించే మందులను ఊరికే వాడుతుంటాం. మన చేతిలో ఉన్న చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోము. సహజసిద్ధంగా ఒత్తిడి శాతాన్ని తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలను పరిశీలిద్దామgraphica
graphicaబొప్పాయి: దీనిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది.
ఆరెంజ్‌ : అత్యధికంగా కమలాల్లో లభించే సి విట మిన్‌ వల్ల ఒత్తిడి ఫలితంగా ్రపభావం చూపే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.
అరటిపండు : దీనిలో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపం డు ఎంతో మేలయినదని వైద్యులు చెబుతున్నారు.
బంగాళ దుంప : జింక్‌, విటమిన్‌ సి పెరిగి రోగని రోధక శక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
చాక్లెట్‌ : వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజసి ద్దమైన యాంటీ – డిప్రెెస్సెంట్‌గా పనిచేస్తుంది. ఇవి కాకుండా యాప్రికోట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తే, పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది. గోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. పాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.<.pre>

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top