You Are Here: Home » చిన్నారి » నోబెల్ బహుమతిని రెండు సార్లు అందుకున్న శాస్త్రవేత్తలు ఎవరు?

నోబెల్ బహుమతిని రెండు సార్లు అందుకున్న శాస్త్రవేత్తలు ఎవరు?

నోబెల్ బహుమతి ప్రాముఖ్యత గురించి తెలియని వారుండరు. ఒక్కసారి నోబెల్ బహుమతి అందుకోవడమే చాలా గొప్ప విషయంగా భావిస్తుంటారు. అలాంటిది రెండుసార్లు అందుకోవడం చాలా అరుదైన విషయం. ఇప్పటివరకు అలాంటి ఘనతను సాధించినవారు నలుగురు ఉన్నారు.

మేరీ క్యూరీ (1903) ఫిజిక్స్‌లో, (1911) కెమిస్ట్రీలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆమె ఈ ఘనతను సాధించిన మొదటివ్యక్తి, ఏకైక మహిళ. లైనస్ కార్ల్ పాలింగ్ అనే మరో శాస్త్రవేత్త 1954లో కెమిస్ట్రీలో నోబెల్ బహుమతితో పాటు, 1962లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నాడు. జాన్ బర్దీన్‌కి రెండుసార్లు (1956, 1972) ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి లభించింది. ఫెడరిక్ సాంగర్ అనే శాస్త్రవేత్త రసాయన శాస్త్రంలో రెండుసార్లు (1958, 1980)నోబెల్ బహుమతిని అందుకున్నాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top