You Are Here: Home » ఇతర » నోకియా లూమియా ఎంట్రీ త్వరలో…

నోకియా లూమియా ఎంట్రీ త్వరలో…

నమ్మకమైన మొబెైల్‌ తయారీ బ్రాండ్‌ నోకియా. తొలి విండోస్‌ 8 ఫోన్‌ ‘‘లూమియా 920’’ నవంబర్‌ నుంచి ఇండియన్‌ మార్కెట్లో లభ్యం కానుంది. ఈ విడుదలకు సంబంధించి నోకియా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నవంబర్‌లో లూమియా 920ను ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, హాంగ్‌కాంగ్‌, ఇండియా, ఇటలీ, పోలాండ్‌, రష్యా, సౌదీ అరేబియా, థాయిలాండ్‌, టర్కీ, యునెైటెడ్‌ అరబ్‌ యమరేట్స్‌, యూకే, యూఎస్‌ ఇంకా వియత్నాం ప్రాంతాల్లో విడుదల చేయనున్నారు.

nokia-తొలి విడుదలలో భాగంగా లూమియా 920ను యూకే ఇంకా ఫ్రాన్స్‌ దేశాల్లో విడుదల చేస్తారు. మలి విడత లో భాగంగా తక్కిన దేశాల్లో విడుదల చేయయనున్నారు. దేశీయ విపణిలో ఖచ్చితమైన విడుదలకు సంబంధించి తేదీని నోకియా ఆ ప్రకటనలో తెలపలేదు. నోకియా లూమియా 92 : విండోస్‌ ఫోన్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టం, నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికే షన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీ, వెైఫెై, 8 మెగా పిక్సల్‌ రేర్‌ కెమెరా (నోకియా ప్యూర్‌ వ్యూ టెక్నాలజీ), 1.3 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 4.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 1జీబి ర్యామ్‌, 32 జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోయూఎస్బీ పోర్ట్‌, శక్తివంతమైన 2,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, క్యఐ వెైర్‌లెస్‌ పవర్‌ స్టాండర్డ్‌ లూమియా 920 ఎల్లో, రెడ్‌, వెైట్‌, గ్రే, బ్లాక్‌ వంటి వెైబ్రెండ్‌ కలర్‌ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

ఫోన్‌లన్నీ ఒకేచోట : మొబెైల్‌ కొనుగోలు చేయడానికి డబ్బులుంటే చాలనుకుంటే పొరపాటు. ఉత్తమ మొబెైల్‌ ఎంపిక విషయంలో అవగాహనతో పాటు తులనాత్మక అంచనా తప్పనిసరి. మీరు ఎంపిక చేసుకున్న డివెైజ్‌ను అన్ని అంశాల్లో వేరే డివెైజ్‌లతో అంచనా వేసి ఓ సమగ్రమైన అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీకు సహాయపడేందుకు ఆన్‌లెైన్‌ ప్రెైస్‌ కంపారిజన్‌ ఇంజన్‌ గోప్రపోబో డాట్‌ కామ్‌ మీ ముందుకొచ్చింది. ఈ సైట్‌ ద్వారా మీకు నచ్చిన మొబెైల్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ పట్ల నిశితమైన అవగాహనకు వచ్చి, నచ్చిన ధరల్లో సొంతం చేసుకోవచ్చు. కొనుగోలుదారుకు…ఆన్‌లెైన్‌ రిటైలర్‌కు మధ్య వారధిగా వ్యవహరిస్తున్న గోప్రోబ్‌ డాట్‌ కామ్‌ విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే పొందుపరుస్తుంది. ఈ ెసైట్‌లోకి ప్రవేశించిన వినియోగదారు అన్ని జాతీయ అంతర్జాతీయ బ్రాండ్‌లకు సంబంధించిన మొబెైల్‌ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లను స్పెసిఫికేషన్‌లతో సహా తెలుసుకోవచ్చు. ఆయా డివెైజ్‌లపెై ప్రముఖ ఆన్‌లెైన్‌ రిటైలర్లు అందిస్తున్న ధర రాయితీలను సైతం వినియోగదారు తెలుసుకోవచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top