You Are Here: Home » ఇతర » నోకియా ఫోన్‌లపై ధరల తగ్గింపు?

నోకియా ఫోన్‌లపై ధరల తగ్గింపు?

nokiaనోకియా అభిమానులకు శుభవార్త. లూమియా సిరీస్‌ నుంచి ఇటీవల విడుదలైన లూమియా 900,800 విండోస్‌ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను 10 నుంచి 15 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు నోకియా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రిటీష్‌ రిసెర్చ్‌ సంస్థ సీసీఎస్‌ తాజాగా బహిర్గతం చేసిన సమాచారం మేరకు లూమియా 800పై 15 శాతం, లూమియూ 900పై 10 శాతం ధర తగ్గింపును అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నోకియా ప్రతిష్టాత్మకంగా డిజైన్‌ చేసిన విండోస్‌8 స్మార్ట్‌ఫోన్‌లు లూమియా 920,820లు నవంబర్‌ నుంచి అందు బాటులోకి వస్తున్న నేపథ్యంలో లూమియా 900, 800 అమ్మకాలను సాధ్యమైనంత మేరకు ముమ్మరం చేసేం దుకు ధరల తగ్గింపు నిర్ణయం తీసుకు న్నట్లు సమా చారం. మరోవైపు వరుస నష్టాలను చవిచూస్తున్న నోకి యాకు విడుదల కాబోతున్న నోకియా లూమియా 920, 820 స్మార్ట్‌ఫోన్‌లు నూతన ఉత్తేజాన్ని నింపగలవని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top