You Are Here: Home » చిన్నారి » కవితలు » నేనుండగానే చెప్పు

నేనుండగానే చెప్పు

నాకు చెప్పాలనుకున్నది
ఇప్పుడే చెప్పు
నేనుండగానే చెప్పు
నే వెళ్ళిన తరువాత
ఎటూ చెబుతావులే
అప్పుడు విననని కాదు
నే విన్నానని
నిన్పు అప్పుడు నమ్మించలేను కదా

ఇప్పుడెైతే
వినకపోయినా
నే విన్నానని నిన్ను వంచించగలను కదా

చెప్పులే
ఏదో ఒకటి చెప్పులే
నిన్న విన్నాను కదాని
మొండికెయ్యనులే ఇప్పుడూ వింటానులే
నిన్న వినలేదని
ఇవ్వాళా విననని అనుకోవద్దులే నువ్వు

చెప్పులే ఏదో ఒకటి
ఏదో ఒకటి చెప్పులే
నువ్వు చెబుతూ చెబుతూ ఉండులే
నే పోతూ పోతూ వింటూ ఉంటానులే

vellyఇప్పుడే చెప్పు
నేనుండగానే చెప్పు
నాకు చెప్పాలనుకున్నది
ఇప్పుడే చెప్పు
చెప్పడం
చెప్పమన్నంత సులువు కాదని
ఎవరికి తెలియదులే!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top