You Are Here: Home » సినిమా » పాటలు » నువ్వేకావాలి (2000)- కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు

నువ్వేకావాలి (2000)- కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు

పల్లవి :
కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండెకోత పోల్చుకుందుకు

మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్లు తెలుసు
నువ్వూ నేను ఇద్దరున్నామంటే
నమ్మనంటూ ఉంది మనసు… ఓ… ఓ…

చరణం : 1
ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
గతమంటూ ఏం లేదని
చెరిగిందా ప్రతి జ్ఞాపకం
కనులు మూసుకుని ఏం లాభం
కలై పోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం
ప్రతిక్షణం ఎదురయ్యే నన్నే దాటగలదా

చరణం : 2
గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
నా హృదయం నీ చెలిమిదా
ముడివేసే ఇంకొకరిదా
నిన్న మొన్నలన్ని నిలువెల్లా
నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా
ఆకాశాన నువ్వు ఎటు ఉన్నా
చినుకులా కరగక శిలై ఉండగలవా

చిత్రం : నువ్వేకావాలి (2000)
రచన : సిరివెన్నెల
సంగీతం : కోటి
గానం : కె.ఎస్.చిత్ర

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top