You Are Here: Home » చిన్నారి » కథలు » నీ ప్రేమకై

నీ ప్రేమకై

SUNDAY-STORYపెద్దబంగ్లా… విశాలమైన ప్రాంగణం… చుట్టూ నారీఖేళ వృక్షాలు… వాటిి సేవ చేయడానికి ఒక నౌకరు. వసారాలో కూ ర్చోని పేపర్‌ చుస్తున్నాడు రాజేశ్వరరావు. భార్య లక్ష్మి కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది… ‘‘వినోద్‌ ఇంకా ఇంటికి రాలేదు లక్ష్మి… ఎక్కడికి వెళ్ళినట్లు’’ కాఫీ కప్పు అందుకుంటు అడిగాడు… ‘‘వాడు ఎప్పుడు వస్తాడో.. ఎప్పు డు వెళ్తాడో వాడికే తెలీనప్పుడు మనకు ఎలా తెలుస్తుంది’’ చలోక్తి విసిరింది లక్ష్మి. అంతలోగా తెల్ల కలర్‌ బెంజ్‌ కారు పావురంలా వే గంగా వచ్చి ఆగింది. అందులో నుంచి టీష ర్టు, జీన్స్‌ ధరించి డ్రీమ్‌గా తయారై యువలోకానికే రారాజులా కనిపిస్తున్న వినోద్‌ దిగాడు. ‘‘ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు’’ అలా లోపలికి వెళ్తున్నాడో లేదో తండ్రిగారి ప్రశ్న కాళ్ళ కు అడ్డుతగిలి చప్పున నిలిచిపోయాడు వినోద్‌.

‘‘ఇలా చిన్న చిన్న ప్రశ్నలు వేయద్దు డాడీ’’ చిరు కోపాన్ని ప్రదర్శించాడు. ‘‘సర్లే వెళ్ళి స్నా నం చేసి టిఫిన్‌కు రెడిగా’’ సర్దుకు పోయాడు రాజేశ్వర్‌రావు. ఒక్కొగానొక్క కొడుకు. గారాబంగా పెంచా డు. వినోద్‌ మాత్రం విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, మానవత్వాన్ని మరచిపోతున్నాడు. అరక్షణం ఇంట్లో నిలబడే మనిషి కాదు. టిఫిన్‌ ఆరగించాడో లేదో… కారెక్కి తుర్రున లేచిపోయి ప్రభు ఫ్యాన్సీ స్టోర్‌ కాంప్లెక్స్‌లో వాలిపోతాడు… అక్కడికైతే అమ్మాయి లు ఎక్కువగా వస్తుంటారు. వీడికి కోరుకున్న అమ్మాయితో జతకట్టనపోతే కునుకురాదు.

ఆకర్షణీయమైన, అల్పమైన, ప్రేమను డబ్బు తో కోనే అలవాటుకు బానిస అయ్యాడు వినో ద్‌… మాటల వలవేసి ఇప్పటికీ చాలమంది అమ్మాయిలతో సరసకలాపాలు అడాడు… డబ్బును ఎరగా వేస్తూ… అమ్ముడు పోయో అమ్మాయిలతో తిరుగుతుంటాడు. అనుకోకుండా ఒకరోజు… మసీదు సర్కిల్‌ వీధిలో ఒకమ్మాయి కనిపించింది వినోద్‌కు అంతే ఎంత తిప్పుకుందామన్న అతని కళ్ళు.. అమెవైపు నుండి మరలలేదు… ఇన్నాళ్ళు శారీరక అనుభవాలకు అలవాటుపడిన వినో ద్‌ ఈసారి ఈ అమ్మాయితో మనసావాచా జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. తిన్నగా తొలిపరిచయం కోసం అడుగు ముందుకువే శాడు. మరుసటి రోజు హోటల్‌లో తారసపడింది. ఆ అమ్మాయి… అమె కూర్చున్న టేబుల్‌లోనే ఎదురుగా కూర్చున్నాడు… వినోద్‌ను చూసి ఆమె మొదట ఇబ్బంది పడుతూ పైకి లేవబోయింది… ‘‘ఫర్వాలేదు కూర్చోండి’’ అనేసాడు వినోద్‌… ఈ మాటతో కూర్చుండిపోయింది.

‘‘మీ పేరు…’’ అడగటానికి మొదట సంశయపడిన వినోద్‌ ధైర్యంగా అడిగేసాడు… ‘‘పరిమళ’’ అంది తిన్నగా… ‘‘గుడ్‌నేమ్‌’’… అనేశాడు వేంటనే… ‘‘ఏం తీసుకుంటారు..’’ అడిగాడు… ‘‘నేనప్పుడే ఆర్డర్‌ ఇచ్చేసాను’’ సింపుల్‌గా అనింది పరిమళ. ‘‘ఆ… అలాగా… ఒకే…’’ ఈ మాటలో కాస్త తడబాటు కనిపించింది… అంతలోగా నూడల్స్‌ కప్‌ అక్కడ పెట్టేసి వెళ్ళాడు బేరర్‌… వినోద్‌ కూడా అదే ఆర్డర్‌ వేశాడు… తను తినే లోపు పరిమళ లేచి వెళ్ళిపోతుంటే… కళ్ళార్పకుండా చూస్తూ వుండి పోయాడు వినోద్‌…

అంతే తనలో ప్రేమ పరిమళం నిండుకుంది. అక్కడ పరిమళ జీవితం మేకులా తయారైవుంది… పేదరికపు పడగ నీడలో కాలం వెల్లబుచ్చుతోంది… కుటుంబ భారాన్ని తలపై మో స్తూ… భారంగా అడుగులు వేస్తోంది..తండ్రి దురలవాట్ల మధ్య… జీవన తరంగాల మధ్య జీవితం కష్టంగా ఈడుస్తోంది… జీవిత పోరాటంతో ఒంటరిగా తలపడింది. దేవుడిచ్చిన చదువు పదుగురికి పంచగలిగే అదృష్టం కొలది టీచర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది పరిమళకు… సరస్వతి విద్యామందిరంలో టీచర్‌గా పని చేస్తోంది పరిమళ…ప్రతి దార్లో ఎదురు పడేవాడు వినోద్‌… ‘‘హాయ్‌’’ అంటూ పలకరింపుతో మొదలు పెట్టిన వినో ద్‌… కొద్ది రోజులకు ‘‘ఏంటి నీ ముందే వెళ్తు వుంటాను…

ఒక్కసారి కూడా లిప్ట్‌ అడగరా… ఏం నా కార్లో రావటానికి నామోషిగా వుంటుందా…’’ అంటూ క్లోజ్‌గా మాట్లాడేవర కు వచ్చేసాడు… ‘‘అబ్బే అదేం లేదు… నడిచి వెళ్ళడమంటే నాకు ఇష్టం..’’ ఆ మాటలో నును సిగ్గు మొగ్గలేసింది… ‘‘సరే ఐతే… నేను కూడా కారు ఇంట్లో పెట్టి… రేపట్నుంచీ నడుచుకొంటూ వెళ్తాను…’’ అంటాడు తన మాట కారి తనాన్ని ప్రదర్శిస్తూ… ‘‘ఎందుకు’’ అని పరిమళ అడగ్గానే..‘‘నీ ఇష్టమే నాఇష్టం’’ అనేశాడు చప్పున. ఈ మాటకు ఓరకంటితో చూస్తూ తప్పుకున్న పరిమళ ముఖకవళికలు వినోద్‌కు బాగా నచ్చాయి.

ఆ రోజు నుండి మాటల్లో తేడా వచ్చింది.. చూపుల్లో తేడా వచ్చింది..నీ ప్రేమకై..జీవిస్తు న్నా… అంటూ చాలా లోతూ గల భావాలు వినోద్‌లో కనిపిస్తుంటే పరిమళకు ఆశ్చర్యం కలిగింది.
ప్రేమంటే రాత్రి వెలిగి, పగలు ఆరిపోయో బల్బుకాదు… ఆకర్షించడం ఆకలి తీరాక వికర్షిచడం ప్రేమ నైజం కాదు… అందుకు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి… తనపై వినోద్‌ పడుతున్న తపన… చెలరేగుతున్నా ఆరాటం… ప్రతిరోజు తనకు, నన్ను ఒప్పిం చాలనే కుతూహలం అన్ని కలిసి వినోద్‌ చే స్తున్న ప్రేమ పోరాటం పరిమళకు పూర్తిగా అర్థం అయింది…. వినోద్‌ మనసు విప్పి నా తో అసలు విషయం ఎప్పుడు చెబుతాడా అని ఎదురుచూస్తున్న పరిమళకు ఒక రోజు గ్రం థాలయం మెట్లపై తారసపడ్డాడు. అక్కడి నుండి తిన్నగా కదిలారు…

‘‘నువు రోజు మా ఇంటివైపే వస్తున్నావ్‌ ఎందుకు’’ అని అడిగింది. ‘‘నీ ప్రేమకై’’ అన్నాడు వినోద్‌… ‘‘ఒక్కరోజైన నాతో మాట్లాడని రోజంటూ వుందా… లేదు… ఎందుకు నా మీద అంత అప్యాయత కనబరుస్తున్నారు’’ అని పరిమళ అడిగిన ప్ర శ్నకు ‘‘నీ ప్రేమకై’’ అదే సమాధానం వచ్చింది వినోద్‌ నోట నుండి. ఇంక ప్రయోజనం లేద ని ‘‘సరే… రేపు కలుద్దాం… ఒకే నా…’’ అం టూ స్పీడుగా వెళతున్న పరిమళ వైపు తదేకంగా చూస్తూ నిలబడ్డాడు వినోద్‌..
మరుసటి రోజు ఉదయం. మాధవరాయ గుడి ప్రాంగణంలో పచ్చని పచ్చికపై నీరెండ పడుతుంటే… చూడ్డానికి గమ్మత్తుగా వుంది.. వీస్తున్న పిల్లగాలులు తనువులను తాకుతుం టే… పులకరింపులు పుట్టుకొస్తున్నాయి. వినో ద్‌… పరిమళ… గర్భగుడికి ఎదురుగా వున్న గరుడ స్తంభం దగ్గర నిలుచుకొని వున్నారు… ‘‘చూడు వినోద్‌…

ప్రేమ పెంచుకోవడం చాలా సులువు దాన్ని ఆచరణలో పెట్టడం అసాధ్యం… నాలో ఏమి నచ్చి నన్ను ప్రేమిం చాలని డిసైడ్‌ అయ్యావో నాకు తెలీదు… నీకు వున్నట్టే నాక్కూడా కొన్ని ఆశలు వుంటాయి. నిన్ను ప్రేమిస్తాను..తప్పకుండా ప్రేమిస్తాను..’’ అంటూ పరిమళ ఇంకా చెప్పబోతుండగా.. ఆనందం నిండిన కళ్ళతో చూస్తూ…‘‘చాలు… ఇది చాలా పరిమళ నాకు… నా కోరిక ఈ నా టికి ఫలించింది…’’ అంటూ కల్పించుకున్నా డు వినోద్‌.. ‘‘నీ కోరిక ఫలించింది… మరి నా కోరిక ఫలించలేదు…’’ అంది పరిమళ… ‘‘ఏంటో చెప్పు తప్పకుండా తీరుస్తాను… నీ కోసం ఏమైనా చేస్తాను…’’ అన్నాడు ఎంతో ఉత్సాహభరితుడైనా వినోద్‌ ‘‘తండ్రులు లేదా తాతలు సంపాదించిన ఆస్తులను చూసి, ము రిసిపోతూ… కాలాన్ని మరచిపోతాం… విలాసంగా తిరగడం నాకు సరిపోదు… సొంత కష్టార్జితంతో పైకి వచ్చి… పదుగురికి సహా యం చేస్తూ…

చిల్లర చేష్టలకు స్వస్తి చెప్పి నలుగురిలో మంచివాడు అని అనిపించుకు న్న రోజు… తప్ప కుండా నిన్ను ప్రేమిస్తాను… నువ్వు నువ్వుగా ఎదుగు… అంతే…’’ అంది పరిమళ…
అంతే… అదే అదనుగా ఇంటికి వచ్చాడు వినోద్‌… రోజూ స్పీడుగా కారుదిగి… హుంద గా వచ్చేవాడు… ఈ రోజు ఏదో ఆలోచిస్తూ నిదానంగా వస్తుంటే రాజేశ్వర్‌రావుకు ఆశ్చ ర్యం వేసింది. ‘‘ఏంట్రా అలావున్నావ్‌’’ అడిగాడు రాజేశ్వరరావు… ‘‘నేను ఇంటి నుండి వెళ్ళిపోవాలను కొంటున్నాను డాడీ…’’ వినోద్‌ మాటకు రాజేశ్వర్‌రావు కళ్ళు మిటకరించి చూసాడు. ‘‘ఏమీ… లక్ష్మీ… ఒకసారి ఇలా వస్తావా..’’ భార్యను కూతపెట్టి పిలిచాడు. ‘‘ఆ… వస్తున్నాను…’’ అంటూ క్షణాల్లో అక్కడ వాలింది లక్ష్మీ… ‘‘వీడికి దిష్ఠి తగిలినట్లు వుం ది…

తీసుకెళ్ళి తీసెయ్‌…’’ అన్నాడు రాజేశ్వర్‌రావు… ‘‘నేను బాగానే వున్నాను నాన్న… నాకేం కాలేదు… తాతగారి ఆస్తితో జలసాగా తిరగటం నాకు ఇష్టం లేదు… నేను సొంత సంపాదన చేసి, ఐదుగురికి సహాయం చేయాలను కొంటున్నాను… అందుకే ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయి ఏదైనా జాబు చేయాలను కొంటున్నాను…’’ వినోద్‌ మాటకు రాజేశ్వర్‌రావుకు నోరుపెగల్లేదు… వినోద్‌కు ఏం చెప్పాలో అర్థం కాలేదు తనకి…
మరుసటి రోజు చెప్పినట్లే బ్యాగు సర్దుకోని, ఉన్న పళంగా బయలు దేరాడు… ‘‘కారు తీ సుకెళ్ళరా…’’ అంది లక్ష్మీ…’’ వద్దు మమ్మీ… అది కూడా తాతగారి ఆస్తేగా…’’ వినోద్‌ మా టకు లక్ష్మీ మారు మాట్లాడలేదు… తిన్నగా నడుచుకొంటూ వెళ్తూ… గేటు దాటుతున్నా కొడుకుని చూస్తూ కళ్ళల్లో నిండుగా నీళ్ళు పెట్టుకుంది లక్ష్మీ…

ఇదిలా వుండగా… అదొక స్వచ్ఛంద సంస్థ… అక్కడొక కారొచ్చి ఆగుతుంది. అందులో నుండి సూటూ, బూటూ ధరించిన ఒక యం గ్‌ పర్సన్‌ ఠీవీగా దిగుతాడు… అతని పేరు ఆనంద్‌… మనిషి చాలా సాఫ్ట్‌గా వున్నా…
మ నసు చాలా షార్ప్‌… స్పీడుగా వెళ్ళి ఆఫీసు రూంలో స్పాంజ్‌ చైర్‌లో తీపీగా కూర్చున్నా డు… అంతలోగా… ఒక మీడియేటర్‌ మైక్‌ పట్టుకొని… ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ సార్‌…’’ అన్నాడు… ‘‘ఎస్‌ కమ్‌…’’ అంటూ కూర్చున్న సీటు సవరించుకున్నాడు ఆనంద్‌… ‘‘మీరు స్వచ్ఛంద సంస్థ పేరుతో… కొన్ని అక్రమాలు చేస్తున్నారని… వార్తలు వినిపిస్తున్నాయ్‌ ఇది ఎంత వరకు నిజమంటారు…’’ అడిగాడు మీడియేటర్‌.

‘‘నాకు గిట్టనివాళ్ళు… నన్ను తొక్కాలని ఇలాంటివన్ని కల్పించుకొని చెబుతుంటారు… వాటిని మీరు పట్టించుకోకండి…’’ అన్నాడు ఆనంద్‌… ‘‘మీ సంస్థ ప్రజలకు ఎలా తోడ్పడుతోంది…’’ అడిగాడు మీడియేటర్‌.. ‘‘అనాధలకు స్కూళ్ళు కట్టించాం… అన్ని రకాల ప్రజలకు మా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది…’’ అంటూ సమాధానపరచి… మీడియేటర్‌ని పంపించి వేయగానే… ఆనంద్‌ అనుచరుడు ప్రక్కనే వుండి మెల్లగా నవ్వి… ‘‘చెప్పేది శ్రీరంగనీతులు దూరేది దోమ్మెర గు డిసెలు…’’ రేయ్‌ నువు నోరు మూసుకొని ప డుండు… లేకుంటే చంపేస్తాను…’’ అంటూ అనుచరున్ని అదుపులో పెడుతాడు ఆనంద్‌..
సంస్థ పేరుతో ఆనంద్‌ ఎన్నో అరాచకాలు చేస్తూ… ఆడపిల్లల్ని పావులుగా వాడుతుంటా డు విలాసంగా గడుపుతున్నాడు.

ఇదిలా వుండగా… పరిమళపై గల అమిత ప్రేమతో తను చెప్పినట్టుగానే… అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి..మంచిగా మారిపోయి… తన స్నేహం వర్గపు సలహాతో స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి, విధ్య, వైద్య, ఆరోగ్య రంగాలలో నిరుపేదలకు సహకరిస్తూ… మంచి పేరుతో విలసిల్లు తాడు వినోద్‌…
ఆనంద్‌.. సంఘసేవ చేస్తున్న పెద్దమనిషిగా వుంటూనే… సమాజాన్ని సేవ రూపంలో దోచుకొంటూ, మాటకారి తనంతో అమ్మాయిలకు ఎరవేసి తన సంస్థకు డబ్బు పొగ పెడుతూ వుంటాడు. కానీ… పరిమళ పరిస్థితి గోడకు తగిలిన బంతిలా తయారైంది.. స్కూల్లో చిన్నపాటి గొడవ వలన… తన తప్పేమీ లేకున్నా… ఉద్యోగం విరమించకోవాల్సి రావడంతో… చాలా భాదపడింది… తిరిగి ఉద్యోగం కోసం అనేక సంస్థలకు దరఖాస్తు పెట్టుకుంది… ఐనా ప్రయోజనం లేక పోయింది. ఆనంద్‌ నిర్వహిస్తున్నా సంస్థలో వర్క్‌‌స ఖాళీ గా వున్నాయని తెలిసి…. ఇంటర్వ్యూకు హాజరవుతుంది… పరిమళ ముఖం చూడగానే ఆనంద్‌లో కోరికల పుట్ట ఒక్కసారిగా పగిలింది… పరిమళ అందానికి వశీకురుడై సమయస్ఫూర్తితో వ్యవహరించాడు… కావాలనే… సులువుగల ప్రశ్నలు వేసి… పరిమళను ఉద్యోగంలోకి తీసుకున్నాడు.

ఉద్యోగం చేస్తున్న రోజుల్లో..జీతం పెంచా డు…తనలో ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి… నిరంబరత్వాన్ని సేవాబావాన్ని ప్రదర్శించి పరిమళ మనసును దోచుకొని దాచేసుకుంటా డు… కానీ… ఇంతకు మునుసే వినోద్‌కు మాటిచ్చిన విషయాన్ని ఏకాంతంగా కలుస్తా డు… వినోద్‌ ఉద్యోగరిత్యా వెళ్ళిన తరువా త… మరో అమ్మాయితో జతకట్టినట్టు నమ్మిస్తాడు… పరిమళ మనసును మల్లిస్తాడు. తన కోరికను వెల్లడిస్తాడు… పెళ్ళి చేసుకుంటే త ప్ప… శారీరకంగా కలవనని మాటివ్వగానే.. ఆనంద్‌ ట్రిక్కులు ప్రయోగించి మంచిరోజు చూసి సమధర్మ శివాలయంలో పరిమళ మెడలో తాళికడతాడు.
కొద్ది రోజులు అన్నోన్యంగా వున్నా వారి మ ధ్య దాంపత్య జీవితం మోజు తీరిపోగానే ఆ నంద్‌ పరిమళపై అయిష్ఠాన్ని చూపెడుతూ వ స్తాడు. మరో అమ్మాయి మోజులో పడి సొం త భార్యను పని మనిషి కంటే హీనంగా చూ డ్డం మొదలు పెడతాడు.

కూతురు అనుభవిస్తున్న కష్టాలు చూడలేక… మనస్తాపంతో మ రణిస్తాడు పరిమళ నాన్నగారు. ఇదిలా వుండ గా.. వినోద్‌ పరిమళ పెట్టిన షరతులను గెలుపొందిన తరువాత… తన స్నేహితుల ఒత్తిడి తో పరిమళ వున్న ఇంటికి వెళతాడు.. అక్కడ ఇంటికి తాళం వేసి వుండడం చూసి…ఆ పక్కనున్న ఒకతనితో..‘‘పరిమళ… ఎక్కడికెళ్ళిం దండి…’’ అని అడుగుతాడు… ‘‘అదుగో అక్క డ ఎదురుగా కనిపిస్తున్న మేడలో వుంటోంది వెళ్ళండి..’’ అన్నాడతను… వినోద్‌కు ఏమి అ ర్థం కాలేదు..తిన్నగా అక్కడికెళ్ళి నిలుచున్నా డు.. పైన వసారాలో తిరుగుతున్న పరిమళ గేట్‌లో నిలుచున్న వినోద్‌ను చూసి పరుగుతో వచ్చింది.. వినోద్‌ ఎదురుగా నిలబడింది.

‘‘నువ్వు చెప్పినట్టు… నేను నేనుగా బ్రతుకుతున్నాను..ఎన్నో సేవలు చేస్తున్నాను… ఇప్పు డు నేనంటే నీకు ఇష్టమేనా పరిమళ…’’ అని అడుగుతున్న వినోద్‌ ముఖంలో అమాయకత్వాన్ని చూస్తూనే కన్నీళ్ళు పెట్టింది పరిమళ… నోరు పెగల్లేదు అమెకు… కప్పుకున్నా కొంగు తీసి మెడలో తాళి చూపించిన పరిమళ వైపు.. రెండు కళ్ళల్లో కనీళ్ళు జారీపోతున్నా తుడుచుకొనే ప్రయత్నం కూడా చేయకుండా చూస్తూ నిలబడి పోయాడు వినోద్‌…

ఆనంద్‌ చేసిన మోసాన్ని..వినోద్‌కు వివరిం చింది..అనంద్‌ వచ్చేవరకు అక్కడే వున్న వినో ద్‌..మహిళాధ్యక్షురాకి ఫోన్‌ చేసి… వివరణ ఇ వ్వగానే..వాళ్ళు ఆనంద్‌కు బుద్ధిచేప్పి..విడాకు లు ఇప్పిస్తారు… ఇప్పుడు పరిమళ స్వేచ్ఛాజీ వి.. అంతేకాదు ‘‘నీ ప్రేమకై…’’ అంటూ తప న పడిన వినోద్‌ జీవితానికి భాగస్వామి…

– పి. రామకృష్ణారెడ్డి,
సెల్‌: 9949050429

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top