You Are Here: Home » చిన్నారి » కవితలు » నీడలో దాగిన ముఖం

నీడలో దాగిన ముఖం

విసిరేసినతనమేదో
ఒంటరిగా దెయ్యంపట్టులా
మదిగుబురులో వేలాడుతూ

అందిన చేయి
పొడిగా గరకుగా
అరచేయి చాళ్ళగుండా
ఏదీ ప్రవహించలేనితనంతో

మాట కూర్చలేని దారంగుండా
జీవితపు సూది బెజ్జంలోంచి
కన్ను మూగగా రోదిస్తూ

ఒక్కసారిగా మీదపడ్డ
నల్ల దుప్పటి నేలమాళిగలో
నన్ను ఓదారుస్తూ
పాడుతున్న లాలి పాటలా

అసంతృప్తిగా అరాచకంగా
అబ్సర్డ్‌ గా గోడపై బొగ్గుతో
రాస్తున్న నినాదం ఊచల
నీడలో దాగిన ముఖం పై నువ్‌
చేసిన నెత్తుటి గాటు

అతకని పదాల మధ్య జిగురుగా
కాసింత ఉమ్మనీటినలా ఒలకనీ…

కెక్యూబ్‌ వర్మ
మీ కవితలు, వ్యాసాలు
పంపవలసిన చిరునామా: Editor, Surya, Surya Soudha, Plot.No.2-58/1/185,
Near Ayappa Society,
Chandanayak Thanda, Madhapur,
Opp: Cyber Towers, Hi-Tech City, Hyderabad – 57
‚yîTsTTýÙ: editpage@suryaa.com

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top