You Are Here: Home » చిన్నారి » నీటిలో కర్పూరం కరుగుతుందా?

నీటిలో కర్పూరం కరుగుతుందా?

దేవుడికి హారతినిచ్చే కర్పూరం బిళ్లలను నీటిలో ముంచి వెలిగిస్తే వెలుగుతాయా? వెలగవు కదా! అలాగే మండుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా కూడా ఆరిపోతుంది. మరి కర్పూరాన్ని నీటిపై ఉంచి వెలిగిస్తే మండుతుందా? జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే కర్పూరం మండుతుంది.

కర్పూరం సాంద్రత నీటిసాంద్రత కంటే తక్కువగా ఉండటం వల్ల, అది నీటిపై తేలటం వల్ల గాలిలో ఉన్న ఆక్సిజన్ సహాయంతో మండుతుంది. అలాగే కర్పూరానికి ఉష్ణవాహకత కూడా బాగా తక్కువగా ఉండటం వల్ల, నీటి చ ల్లదనం కర్పూరం ముద్దపై వెలుగుతున్న మంటను చల్లబరచి అది ఆరిపోయేలా చేసేంత శక్తి దానికి ఉండదు. కర్పూరం నీటిలో కరగదు. ఎందుకంటే ఇది ఒక టర్ఫీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ఒక ప్రత్యేక పద్ధతిలో అనుసంధానించి ఉంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top