You Are Here: Home » ఇతర » నిశ్శబ్ద దినం మెహర్‌ బాబా బోధన

నిశ్శబ్ద దినం మెహర్‌ బాబా బోధన

Meheaమెహర్‌ బాబాను విశ్వసించే వారు ఈ రోజు (జులై 10)ను నిశ్శబ్దదినంగా పాటిస్తారు. ఏటా ఈ విధంగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు అంతా వారు మౌనంగానే ఉంటారు. భారత దేశం లో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువులలో మెహర్‌ బాబా ఒకరు. దేశవిదేశాల్లో ఆయనను విశ్వసించే వారు ఉన్నారు. మెహర్‌ బాబా 1925 జులై 10 మొదలుకొని 1969 లో తనువు చాలించే వరకు కూడా మౌనంగానే గడిపా రు. మొదట్లో ఆయన అక్షరాలు రాయడం ద్వారా తన భావాలను వెల్లడించే వారు. ఆ తరువాత చేతిసైగల ద్వారా బోధించడం ప్రారంభించారు. ఆయన శిష్యుల్లో ఒకరైన ఇరుచ్‌ జెస్సావాలా వాటికి భాష్యం చెప్పేవారు. జులై 10న మౌనం పాటించాలని మెహర్‌ బాబా సూచించారు. ఆ రోజున ప్రార్థనలు చేయాలని, దైవనా మాలు ఉచ్ఛరించాలని మొదట్లో చెప్పినా, ఆ తరువాత మాత్రం ఈ రోజున పూర్తి మౌనం పాటించాలని తెలి పారు. కొందరు ఆ రోజున సాధారణ విధులకు దూరం గా ఉండి మౌనం పాటిస్తే మరికొందరు మాత్రం రోజు వారీ పనులు చేసుకుంటూనే మౌనం వహిస్తుంటారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top