You Are Here: Home » ఇతర » నిర్విరామ వైద్య సేవ

నిర్విరామ వైద్య సేవ

సహనానికి మారుపేరు మహిళ. అనేక రంగాల్లో వీరు అందించే సేవలకి విలువ కట్టలేం. సమర్ధవంతంగా అనేక సమస్యల్ని శాంతంగా పరిష్కరించడంలో వీరికి వీరే సాటి. అందులోనూ వైద్య రంగంలో మహిళలు ఏ స్థారుులో ఉన్నా వారందించే సేవలేక సగం రుగ్మతలు మటుమాయం అవుతాయ నడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అదీకాక ఈ రంగంలో అసాధారణ సహనాన్ని కలిగి ఉంటేనే ఈ వైద్య వృత్తిలో రాణించ గలుగుతారు. అందులో చెప్పుకోదగ్గ నేటి మహిళ డా. ప్రీతారెడ్డి

.
Untia6ఈమె అపోలో హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఈమె తన తండ్రి డా. ప్రతాప్‌ సి. రెడ్డి ప్రేరణతో, ఆయన మార్గదర్శ కత్వంతో 1989లో అపోలో హాస్పిటల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదవిని చేపట్టారు. 5 సంవత్సరాల తర్వాత ఈ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతిని సాధించింది. అపోలో ఆసియా మొత్తం మీద, అంతర్జాతీయంగా కూడా ప్రజారోగ్య విషయంలో అగ్రగామిగా నిలిచింది. వైద్య పరమైన అన్ని సదు పాయాలతో గ్రామీణ ప్రాంతాలతో సహా అందరికీ సేవలందిం చడంలో అగ్రగామిగా నిలిచిన అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ 1983లో 26 మిలియన్‌ పేషంట్లకి నమ్మకమైన ఆసుపత్రిగా గౌరవ పురస్కారాన్ని అందుకుంది. ప్రీతారెడ్డి వైద్య బృందాలతో, ఇతర పనివారితో మమేకమై కలిసి మెలిసి పనిచేస్తూ ఈ ఆసుపత్రికి మంచి గుర్తింపుని, ఉన్నతిని తీసుకువచ్చింది.

అంతేకాక ప్రణాళికలు వేయడం, వాటికి రూపకల్పన చేయడం, పెట్టుబడి వ్యవహారాలు చూసుకోవడం వంటి ఇతర అంశాల్లో కూడా పాల్గొంటూ అపోలో గ్రూప్‌ ఉత్త మమైన మార్గంలో నడవటానికి ఎంతో కృషి చేసారు. గ్రూప్‌ ఆసుపత్రులన్నిటిలోను నాణ్యమైన సేవలందించడంలో ఈమె స్వయంగా పర్యవేక్షిస్తూ తన కార్యకలా పాలు సజావుగా ముం దుకు సాగేలా పాటుపడుతోంది. సంచార మెడికల్‌ వాహనాలు అభివృద్ధిచేసి, తద్వారా భారతదేశంలో అన్ని మూలలా వైద్య సహకారం అందే విధంగా చేయడం ఈమె లక్ష్యంగా పెట్టుకుని అందుకు తగిన ప్రతిపాదనలు రూపొందిస్తూ మరింత ముందు కుసాగాలని, అందువల్ల ఎన్నో లక్షల జీవితాలకి వెలుగునివ్వ డం వీలుకలుగుతుందని ఆశిస్తోంది.

ఈమె సారధ్యంలో ఆర్ధికంగా ప్రతి ఏటా 20% వృద్ధి రేటు పెరు గుతోంది. ఈ 2011-12 సంవత్సరంలో ఈ గ్రూప్‌ ఆదాయం 3,147.5 కోట్లు నమోదయ్యింది. టాక్స్‌లు పోగా నికరాదా యం 219.4 కోట్లు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా 7 వేల పేషంట్లు, 6 వేల మంది బైట రోగులు, 200 క్లిష్టమైన కేసులు, 120 గుం డెకు సంబంధించిన కేసులు, 50 వరకూ శస్త్ర చికిత్సలు, 400 డయాలసిస్‌ కేసులు, 40 వేల లేబరేటరీ టెస్టులు నిర్వహిం చారు. పేషంట్‌ల నమ్మకానికి ఇదే నిదర్శనం. ఇదంతా ప్రీతారెడ్డి సల్పిన అభివృద్ధి కృషిలో భాగంగా నమోదవుతుంది. ఈ విధంగా దూసుకుపోతున్న ప్రీతారెడ్డి 2010 – 2011 సంవ త్సరంలో ‘50 మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబి తాలో స్థానం దక్కించుకుంది.

అదే విధంగా ‘అత్యంత శక్తివం తమైన మహిళ’గా 2011లో ఫార్ట్యూన్‌ జాబితాలో చోటు సాధించింది. 2006 నుండి నేటి వరకూ ‘పవర్‌ ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌’గా అమె స్థానం అలాగే నిలిచివుంది. ప్రీతా ‘నేషనల్‌ క్వాలిటీ కౌన్సిల్‌’ వ్యవస్ధాపక సభ్యురాలుగా కూడా కొనసాగుతూ భారతదేశ ఆసుపత్రులకు నాణ్యత ప్రమాణాల మార్గదర్శకాలు అందిస్తూ వాటిని మరింత మెరుగుపరుస్తున్నారు. అంతేకాకుం డా అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు మెంబర్‌గా కొనసా గుతున్నారు. అదే విధంగా విప్రో బిజినెస్‌ లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ లోను, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషడ్‌పూర్‌, బోర్డ్‌ మెంబర్‌గా కూడా తనవంతు సేవలు అందిస్తున్నారు.
లయోలా ఫార్మ్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌ వారు ఏర్పాటు చేసిన సదస్సులో ప్రీతారెడ్డిని ‘లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డ్‌తో సత్కరించారు.

చిన్నపిల్లల గుండె వ్యాధుల ఆపరేషన్‌లలో ఈమె ముందుకు వచ్చి ఎంతో సహృదయతతో 5 వేలమంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేయగా, 50 వేల మంది చిన్నారులకు గుండె జబ్బులకు వైద్య పరీ క్షలు నిర్వహించింది. అత్యవసర చికిత్సలకు ఈమె వెంటనే స్పందిస్తూ తగిన విధంగా సేవలందించడం గమనార్హం.ఇంత ఎత్తుకు ఎదిగిన ప్రీతారెడ్డి చెనై్నలోని స్టెల్లా మేరీస్‌ కాలేజీలో బి.ఎస్‌సి పూర్తిచేసింది. ఆత ర్వాత మద్రాస్‌ యూనివర్సిటీ నుండి పబ్లిక్‌ ఎడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ చేసింది. అలాగే మద్రాస్‌ కళాక్షేత్రంలో ఫైన్‌ ఆర్ట్‌‌సలో శిక్షణ పొందింది. అందువలన ఈమెకు భారతీయ సంప్రదాయ కళల మీద అవగాహన ఏర్పడింది. తర్వాత ఎంజిఆర్‌ మెడికల్‌ యూనివర్సిటీ ద్వారా ఈమె చేసిన సేవలకి గుర్తింపుగా డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ పట్టాపొందింది. భర్త, ఇద్దరు పిల్లలతో గృహిణిగా కూడా తన బాధ్యతని సమర్ధవంతంగా నిర్వహిస్తోంది.

preethaaవైద్యరంగంలో ఇంతటి గుర్తింపు మరే ఇతర వైద్య రంగానికీ దక్కలేదు. ఈమె ఈ గ్రూప్‌ అధినేత్రిగా పదవీ బాధ్యతలు తీసు కున్నప్పుడు దీని ఆదాయం కేవలం 110 కోట్లు మాత్రమే. నేడు కేవలం నికర ఆదాయం 500 కోట్లకి చేరింది. ఆసియా లోనే నెం1గా పేరుగడించ డంతో పాటు అత్యవసర సేవలు, సాధారణ సేవలు అందించడంలో ఎంతో నాణ్యత గల ఆసుప త్రిగా అంత ర్జాతీయ ఖ్యాతిని గడించింది అపోలో హాస్పిటల్‌ గ్రూప్స్‌. ఎటు వంటి నిర్ణయానై్ననా ఉన్నతాధి కారులు తీసుకుం టారు. వాటిని చిత్తశుద్ధితో, నిష్పక్షపా తంగా, పారదర్శకంగా, బాధ్యతాయు తంగా అమలుచే యడమే నా కర్తవ్యంగా భావిస్తా నని ప్రీతా అం టూవుంటారు. అటువంటి కార్యదక్షత కలిగి ఉండటం వల్లనే ఈ స్థాయికి ఎదిగిందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

సమాజపరంగాను, సాహిత్య పరంగాను స్ర్తీలకు ఉన్నదాని కంటే ఎక్కువగా సౌకుమర్యాన్ని అంటకట్టి, వారిని అందలం ఎక్కించామని పూర్వంపెద్దలు భావించారు. అది స్ర్తీల పాలిట శాపంగా మారి సమాజంలో వారి పాత్ర ఇంటికి, ప్రత్యేకంగా వంటింటికి పరిమితమైంది. దాంతో సమాజంలో స్ర్తీలు క్రియాశీలక పాత్రలకు దూరమ య్యారు. ఆ వరవడిని ఎదుర్కొని తమ స్ర్తీ సౌకుమార్యాన్ని పక్కకు నెట్టి కొందరు మహిళలు సాహసో పేతమైన పాత్రలను నిర్వహించారు.ఆ కోవకు చెందిన వారిలో ఒకరైన వీరు పశ్చిమగోదావరి జిల్లా, తణుకు తాలుకా కుముదపల్లి, గ్రామంలో 1904లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు దాసం వెంకమ్మ, వెంకట్రామయ్య దంపతులు. ఆనాటి బాలికలందరిలాగే 12 సంవత్సరాలు రాగానే తల్లిదండ్రులు వారికి వివాహం చేశారు. భర్త పసల కృష్టమూర్తి.

సహజంగానే సామాజిక దృక్పథం కలవారు. 1921 మార్చి31-ఏప్రియల్‌1వ తేదీలలో అఖిల భారత కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశాలు విజయవాడలో జరిగాయి. ఆ సమావేశాలకు గాంధీజీతో సహా ఆనాటి యోధాను యోధులైన జాతీయ నాయకులు వచ్చారు. రాష్ర్టం నలుమూలల నుండి సుమారు రెండు లక్షల మంది కార్యకర్తలు అక్కడికి చేరి జాతీయోద్యమ ఉత్సాహంతో కదం తొక్కారు. ఆ స్ఫూర్తితో వీరి భర్త కాంగ్రెసు సభ్యత్వం స్వీకరించారు. భర్తను అనుసరిస్తూ వీరు ఖద్దరు వస్త్రాలు ధరించారు. ఖద్దరు ప్రచారం, విదేశీ వస్తు బహిష్కరణ, దళిత ఉద్ధరణ కార్యక్రమంలో క్రియాశీలకమైన పాత్రను నిర్వహించారు.గాంధీజీ 1929 ఏప్రిల్‌ నెలలో మనరాష్ర్టంలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు గ్రామానికి 27వ తేదీన వచ్చి అక్కడి ఆనందనికేతన్‌ ఆశ్రమంలో ఆరాత్రి బసచేశారు.

preetaఅక్కడ గాంధీజీని కలిసిన అంజలక్ష్మి తన ఒంటిమీద, కుమార్తె ఒంటిమీద ఉన్న బంగారు నగలను ఒలిచి గాంధీగారి చేతిలో పెట్టారు. అంతే-ఆనాటి నుండి బంగారు నగలకు వీరు జీవి తాంతం దూరంగా ఉండిపో యారు. వీరిపైన కందుకూరి వీరేశలింగం పంతులు సాంఘిక సంస్కరణోద్యమ ప్రభావం పడింది. రాజకీయో ద్యమంతో పాటు, సంస్కరణోద్యమాలలో కూడ క్రియాశీలి అయ్యారు. వితంతు, కులాంతర వివాహల ను ప్రోత్సహించి, వీరి చేతుల మీదుగా ఎన్నిటినో నిర్వహిం చారు. దళిత జనోద్ధరణను మాటల్లోనే కాకుండా చేతల్లో చూపారు. ఎందరో దళిత విద్యార్థులను చేరదీసి, వారికి విద్యా బుద్ధులు నేర్పి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరేందుకు చేతనైనంత కృషి చేశారు. సహాయ నిరాకరణోద్యమాన్ని 1931లో కాంగ్రెస్‌ నిర్వహించి నపుడు జనవరి 20వ తేదీన భీమవరంలో వీరు పాల్గొని అరెస్ట య్యారు.

వీరికి ఆరు నెలలు శిక్ష విధింపగా తన పసిబిడ్డతో సహా చెన్నై, రాయవేలూరు జైళ్ళలో ఉండి, గాంధీ-ఇర్విన్‌ ఒప్పందం వల్ల ముందుగానే విడుదలయ్యారు. పసిబిడ్డతో కలిసి జైలు జీవితాన్ని గడిపిన వీరు ఆ తరువాత ద్విగుణీకృ తమైన ఉత్సాహంతో ఉద్యమ కార్యక్రమాలను విస్తృతం చేసి నిర్వహించారు. భారతీ యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా- ప్రభుత్వ కార్యాలయాలపైన ఎగురుతున్న బ్రిటీష్‌వారి జెండా ను పీకివేసి, ఈ స్థానంలో జాతీయ జెండాలను ఎగురవేసే కార్యక్రమాలను ఉద్యమకారులు ఆకాలంలో చేపట్టారు. భీమ వరంలోని తాలుకా కార్యాలయంపైన జాతీయ జెండాను 1932 జూన్‌ 27న ఎగురవేయాలని ఉద్యమకారులు ముహూ ర్తం పెట్టారు. సాహసానికి ప్రతీకగా పేరుబడిన కృష్టమూర్తి – అంజలక్ష్మి దంపతులు తాలుకా కార్యాలయం పైన జెండా ఎగురవేసే బాధ్యతను తమ భుజస్కంధాలపైన పెట్టుకున్నారు.

ఆనాటికి వారు ఆరు నెలల గర్భిణి. ఆ సందర్భంలో బ్రిటిష్‌ అధికారులు ఉద్యమ కార్యకర్తలపైన జరిపిన దమన కాండను ఎదిరించి, ఆ దంపతులు జాతీయ జెండాను అక్కడ విజయ వంతంగా ఎగురవేశారు. ఈ ఉద్యమంలో అరెష్టయిన వీరికి 10నెలల జైలు శిక్ష విధించారు. వీరు గర్భిణిగా జైలుకు వెళ్ళి, అక్కడే కుమార్తెను కన్నారు. జైలులో మరో సాహస వనిత గుమ్మడిదల దుర్గాబాయమ్మ పరిచయం కలిగింది. వీరం దరూ కలిసి స్ర్తీలు గాజులు తీసివేసి, తెల్లచీరలనే ధరించాలనే జైలు నిబంధనలను వ్యతిరేకించారు. వీరి ఆందోళనకు తలొ గ్గిన ప్రభుత్వం రబ్బరు గాజులు, అంచుగల తెల్లచీరలు ధరిం చేందుకు నిబంధనలు సవరించారు. స్ర్తీగా తన సౌకుమార్యాన్ని పక్కనపెట్టి గర్భిణిగా శ్రమకోర్చి, ప్రమాదాలను లెక్కచేయక కార్యాలయ భవనమెక్కి జెండా ఎగరేసిన గర్భిణిగా జైలు జీవితాన్ని గడుపుచూ, జైలులోనే ప్రసవించిన పసల అంజలి జీవితం సాహసాలను ప్రదర్శించదలచిన వనితలకు ఆదర్శం.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top