You Are Here: Home » ఇతర » నిర్మాణ రంగంలో కొత్త మలుపులు

నిర్మాణ రంగంలో కొత్త మలుపులు

శాస్త్ర సాంకేతికత సమాజానికి సౌకర్యా లను సమకూర్చడంలో ఎప్పుడూ ముందుం టుంది. దాన్ని మన జీవితంలోకి అన్వరుుం చుకొని ఉపయోగించుకోవడమే మనం చేయాల్సింది. దానికి కొంత దార్శనికత, చొరవ అవసరం. అటువంటిదే ప్రి-ఇంజనీరింగ్‌ టెక్నాలజీ. భవన నిర్మాణ రంగం లో ఇదొక మేలి మలుపు. ఏ విధంగా చూసి నా రాబోయే రోజుల్లో ఇదో కొత్త విప్లవం. దీన్ని అందిపుచ్చు కోవడం అవసరం. ప్రి-ఇంజనీరింగ్‌ వల్ల కలిగే లబ్ధి, చేకూరే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం…

Untit6ప్రి-ఇంజనీర్డ్‌ భవనాలంటే…
ఇటుకలు, సిమెంట్‌ కంకర అక్కరలేకుండానే కట్టే భవంతులు
మరి దేంతో కడతారు…
ఫ్యాబ్రికేటెడ్‌ స్టీలు ప్యానళ్లు, పెద్ద పెద్ద స్టీలు గడ్డర్లు, పిల్లర్లు వాడతారు. దీనికి ఉదాహరణ హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సమీపంలో వున్న హైటెక్స్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌.
దీన్ని ఎలా కట్టారు…
అచ్చంగా స్టీలుతో
విదేశాల్లో పరిస్థితి…
అమెరికా, ఐరోపా, గల్ఫ్‌ దేశాలలో ఈ భవంతులు ఎక్కడ చూసినా కన్పిస్తాయి.
మరి మనదేశంలో…
ఇపుడిపుడే వేగం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, గోదాములకే వినియోగిస్తున్నాం.
ఎలా కడతారు…
పెద్ద పెద్ద స్టీలు గడ్డర్లు, పిల్లర్లు కాలమ్స్‌ కోసం వినియోగిస్తారు. ఫ్యాబ్రికేటెడ్‌ స్టీల్‌ ప్యానళ్లతో గోడలు కడతారు. పైకప్పు నిర్మాణానికి కూడా ఇవే.
ఎక్కడ తయారు చేస్తారు…
ఫ్యాక్టరీలోనే తయారు చేసి తెచ్చి నిర్మాణ స్థలంలో అసెం బుల్‌ చేస్తారు.
ఇంకా ఏమేం నిర్మిస్తారు…
షో రూమ్‌లు, క్రీడా మైదానాలు, విమానాల హ్యాంగర్లు (నిలిపివుంచే ప్రదేశాలు), బహుళ అంతస్థుల భవనాలు, ఆఫీస్‌ భవనాలు.
Preఎక్కువ కాలం మన్నుతాయా…
నిర్మాణ సంస్థల నుంచి వీటికి గ్యారంటీ కూడా వుంది.
పునాదులు వుంటాయా…
భారీగా పునాదులు అవసరం లేదు.
ఎంతకాలం నిర్మాణం…
ఒక భవన నిర్మాణానికి పట్టే సమయంలో మూడో వంతు.
మరి ఖర్చు సంగతి…
ఒక భవంతి నిర్మాణానికి అయ్యే ఖర్చులో మూడో వంతు మాత్రమే.
ఇతరత్రా లోపాలేమీ రావా…

తుప్పు పట్టవు. నీరు లీక్‌ కాదు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుంది.
మనదేశంలో ఈ భవంతుల నిర్మాణానికి ఏమేం సంస్థలున్నాయి…
గల్ఫ్‌కు చెందిన కిర్బీ బిల్డింగ్‌ సిస్టమ్స్‌ హైదరాబాద్‌లో యూనిట్‌ను నెలకొల్పింది. మూడు దశాబ్దాల అనుభవం.
70 దేశాలలో 50 వేలకు పైగా నిర్మాణాలు పూర్తి. టాటా బ్లూస్కో, పెన్నార్‌ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌, వర్ధమాన్‌, నిసా స్టీల్‌, ఇంటరార్చ్‌ బిల్డింగ్‌ ప్రాడక్ట్‌‌ప, ఎం.పి.ఐ.ఎల్‌., టైగర్‌ స్టీల్‌ తదితర సంస్థలు. బెంగుళూరుకు చెందిన ఎవరెస్ట్‌ స్టీల్‌ బిల్డింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఇటీవలే రంగప్రవేశం చేసింది.
Pre69అమెరికాలో ఈ భవనాల నిర్మాణం వాటా…
70 శాతం
మనదేశంలో…
27 శాతమే
మనదేశంలో భవన నిర్మాణ పరిశ్రమల విలువ…
రూ. 4 వేల కోట్లు, ఏటా 15-20 శాతం వృద్ధి నమోదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top