You Are Here: Home » చిన్నారి » నిజమైన దానం

నిజమైన దానం

కోసంగిపురాన్ని శశాంకుడు అనే రాజు పరిపాలించేవాడు. తనను అందరూ మెచ్చుకోవాలనే కోరిక ఆయనకు ఎక్కువగా ఉండేది. దానితో అడిగినవారికి, అడగనివారికి కూడా బహువుతులు ఇచ్చేవాడు. వారందరూ రాజుని దయూహృదయుుడని ప్రశంసించేవారు. సరైన ప్రణాళిక లేకుండా రాజు డబ్బు అలా వృథా చేయుడం వుంత్రికి నచ్చేది కాదు. ఒకనాడు ఏదో మాటల సందర్భంలో మంత్రి రాజుతో ‘‘పెద్దలు సంపాదించిన ఆస్తిని దానం ఇవ్వడం గొప్పకాదు. అలా ఇవ్వటాన్ని దానం అని కూడా అనుకోలేం’’ అన్నాడు.
‘‘నేను చేసేది దానం కాదంటావా?’’ అని అడిగాడు రాజు.

‘‘రాజా! మీ దగ్గర డబ్బు ఉంది. అందుకే ఇస్తున్నారు. నలుగురి కష్టాలు తీర్చడం రాజుగా మీ బాధ్యత’’ అని జవాబిచ్చాడు వుంత్రి.

‘‘అరుుతే అసలైన దానశీలుణ్ని నాకు చూపించగలవా’’ అని అడిగాడు రాజు.
‘‘తప్పకుండా ప్రభూ! అయితే అలాంటి వ్యక్తిని గుర్తించడం కొంచెం కష్టం. మనం వూరువేషంలో ప్రజల వుధ్యకు వెళ్తే తెలుస్తుంది’’ అని చెప్పాడు వుంత్రి.

‘‘వురైతే ఇద్దరవుూ వెళ్దాం’’ అన్నాడు రాజు. ఇద్దరూ వూరువేషంలో బయలుదేరారు. వారు కొంతకాలం ప్రయాణించి ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కొందరు కూలీలు బావి తవ్వుతున్నారు.

‘‘బావి ఎవరు తవ్విస్తున్నారు’’ అని కూలీలను అడిగాడు మంత్రి. ఆ పక్కనే అతి సామాన్యంగా కనిపిస్తున్న వ్యక్తి ముందుకు వచ్చి, ‘‘అయ్యా! నేనే ఈ బావిని తవ్విస్తున్నాను’’ అని చెప్పాడు.
‘‘నువ్వు అతి సామాన్యంగా ఉన్నావు. అంత డబ్బు నీకు ఎక్కడ నుంచి వచ్చింది?’’ అని అడిగాడు వుంత్రి.

‘‘రెండేళ్లపాటు నా పొలం బాగా పండింది. వుంచి లాభాలు వచ్చారుు. ఈ సంవత్సరం కరువు వచ్చింది. ఊరిలో ఒక్క బావి వూత్రమే ఉంది. ఆ నీళ్లు అందరికీ సరిపోవడం లేదు. నేను దాచుకున్న డబ్బుతో ఊరి ప్రజల కోసం బావి తవ్విస్తున్నాను’’ అని చెప్పాడు ఆ వ్యక్తి.
‘‘మరి నీకోసం ఏమీ దాచుకోవా? ఆ తరువాత ఎలా బతుకుతావు?’’ అని అడిగాడు వుంత్రి.
‘‘ఊరు బాగుంటే నేనూ బాగుంటాను. ఎక్కడైనా నాకు కూలిపని దొరక్కపోదు’’ అన్నాడు. ఆ మాటలు విన్నాక… రాజుకు నిజమైన వుంచితనం, దానం అంటే ఏమిటో అర్థమైంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top